news

News October 23, 2024

జిన్‌పింగ్, మోదీ మధ్య కొనసాగుతున్న చర్చలు

image

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, భారత ప్రధాని మోదీ మధ్య ద్వైపాక్షిక చర్చలు ప్రారంభమయ్యాయి. రష్యాలోని కజన్‌లో జరుగుతోన్న బ్రిక్స్ సదస్సులో వీరు భేటీ అయ్యారు. దాదాపు ఐదేళ్ల తర్వాత వీరు సమావేశమవడం గమనార్హం. లద్దాక్‌లో ఎల్ఏసీ వెంబడి మిలిటరీ పెట్రోలింగ్‌పై రెండు రోజుల క్రితం ఇరుదేశాల మధ్య ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే.

News October 23, 2024

వెంకయ్య నాయుడి మనవడి పెళ్లిలో సీఎం

image

AP: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవడి పెళ్లికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ వేడుకకు సీఎంతో పాటు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఇతర ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

News October 23, 2024

ఆ నీచమైన వ్యాఖ్యలను తిరిగి చెప్పలేను: కేటీఆర్

image

TG: కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కేటీఆర్ 30 నిమిషాల పాటు వాంగ్మూలం ఇచ్చారు. సురేఖ ఏం వ్యాఖ్యలు చేశారని జడ్జి అడగగా, సమంతతో పాటు తనపై ఆమె అతి నీచమైన <<14254371>>వ్యాఖ్యలు<<>> చేశారని అన్నారు. ఆ వ్యాఖ్యలను తన నోటితో తిరిగి చెప్పడం ఇష్టం లేదని, ఆ వ్యాఖ్యలకు సంబంధించి రాతపూర్వక ఫిర్యాదును జడ్జి ముందు ఉంచారు. ఈ కేసు తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా పడింది.

News October 23, 2024

పెన్షన్ల సమస్యకు గ్రామ సభల్లో పరిష్కారం: ప్రభుత్వం

image

AP: గత ప్రభుత్వంలో అనర్హుల పేరిట తొలగించిన పింఛన్లపై క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల సమస్యను గ్రామ సభల ద్వారా పరిష్కరించాలని నిర్ణయించింది. అలాగే మంగళగిరి ప్రభుత్వాస్పత్రిని 100 పడకలుగా మార్చేందుకు ఆమోదం తెలిపింది. దేవాలయ పాలకమండళ్లలో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు సభ్యత్వం ఇవ్వాలని, సభ్యుల సంఖ్యను 15 నుంచి 17కు పెంచాలని నిర్ణయించింది.

News October 23, 2024

కోట్లిచ్చినా కొన్ని పనులు చెయ్యం: హీరోలు

image

చిన్న యాడ్ వీడియోలో కనిపిస్తే చాలు రూ.కోట్లలో ఆదాయం వస్తుంది. కానీ, డబ్బుల కోసం తప్పుడు పనులు చేయమంటున్నారు కొందరు స్టార్ హీరోలు. తాజాగా బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్‌ పాన్ మసాలా యాడ్‌ను తిరస్కరించారు. రూ.10 కోట్లు ఇస్తామని చెప్పినా ఆయన తృణప్రాయంగా తిరస్కరించారని సమాచారం. దీంతో పాన్ మసాలా యాడ్‌కు నో చెప్పిన అల్లు అర్జున్, కార్తీక్ ఆర్యన్, యష్‌ల సరసన కపూర్ చేరారు.

News October 23, 2024

విరాట్‌ను దాటేసిన పంత్

image

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ విరాట్ కోహ్లీని దాటేశారు. ఇంతకు ముందు విరాట్ 7వ స్థానంలో, పంత్ 9వ స్థానంలో ఉండగా తాజా ర్యాంకింగ్స్‌లో పంత్ ఆరో ప్లేస్‌కు చేరుకున్నారు. బంగ్లాతో సిరీస్‌లో సెంచరీ కొట్టిన రిషభ్, న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో 20, 99 పరుగులతో రాణించారు. ఆ మ్యాచ్‌లో గాయపడగా, రేపటి మ్యాచ్‌లో ఆడేందుకు ఫిట్‌గానే ఉన్నారని కోచ్ గంభీర్ తాజాగా వెల్లడించారు.

News October 23, 2024

ZOMATO, SWIGGY యూజర్లకు షాక్

image

పండగల సీజన్లో ఆఫర్లు, డిస్కౌంట్లు ఇవ్వడం రొటీన్. రేట్లు పెంచడం, షాకులివ్వడమే వెరైటీ! ZOMATO, SWIGGY ఇలాగే చేశాయి. జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.6 నుంచి రూ.10కి పెంచిన కొన్ని గంటల్లోనే స్విగ్గీ సైతం రూ.10కి పెంచేసింది. EX. మీరేదైనా ఆర్డరిస్తే, దానిపై డెలివరీ ఫీజు రూ.36, ప్లాట్‌పామ్ ఫీజు రూ.10 అదనంగా చెల్లించాలి. AUG 2023లో రూ.2గా ఉన్న ఈ ఫీజు ఏడాదిలోనే 400% పెరిగింది.

News October 23, 2024

తర్వాతి మ్యాచ్ కోసం కేఎల్ రాహుల్ సాధన

image

టీమ్ ఇండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ నెట్స్‌లో చెమటోడుస్తున్నారు. తొలి మ్యాచ్‌లో పంత్, సర్ఫరాజ్ వంటి యువ ఆటగాళ్లు రాణించగా, అనుభవజ్ఞుడైన రాహుల్ 0, 12 రన్స్‌కే ఔటయ్యారు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ న్యూజిలాండ్ బౌలర్ ఓ రూర్కే బౌలింగ్‌లో రాహుల్ ఔటయ్యారు. దీంతో అదే హైట్ ఉన్న మోర్నే మోర్కెల్ బౌలింగ్‌లో రాహుల్‌ నెట్స్‌లో సాధన చేశారు. రేపు ఉదయం 9.30 గంటలకు రెండో టెస్టు మొదలుకానుంది.

News October 23, 2024

BRICSలో చేరేందుకు 30+ కంట్రీస్ ఆసక్తి: పుతిన్

image

BRICSలో జాయిన్ అయ్యేందుకు 30+ కంట్రీస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ అన్నారు. తమ కూటమితో సంబంధాలను బలోపేతం చేసుకోవాలన్న గ్లోబల్ సౌత్, ఈస్ట్ దేశాల ఆసక్తిని విస్మరించకూడదని చెప్పారు. అదే టైమ్‌లో బ్యాలెన్స్ మెయింటేన్ చేయడం, సామర్థ్యం తగ్గకుండా చూసుకోవడం అవసరమన్నారు. తీవ్రమైన ప్రాంతీయ వివాదాలపై డిస్కస్ చేస్తామన్నారు. UNకు BRICS పోటీగా మారొచ్చన్న సందేహాలున్న సంగతి తెలిసిందే.

News October 23, 2024

నాకు, BRSకి నష్టం చేయాలనే సురేఖ అలా మాట్లాడారు: KTR

image

TG: బాధ్యత గల పదవిలో ఉన్న మంత్రి కొండా సురేఖ తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని నాంపల్లి కోర్టులో KTR వాంగ్మూలం ఇచ్చారు. ‘నేను డ్రగ్ అడిక్ట్ అని, రేవ్ పార్టీలు నిర్వహిస్తానని సురేఖ అన్నారు. సాక్షులు నాకు 18ఏళ్లుగా తెలుసు. సురేఖ చేసిన వ్యాఖ్యలను TVలో చూసి వారు నాకు ఫోన్ చేసి చెప్పారు. నాకు, BRSకి నష్టం చేయాలనేదే ఆమె ఉద్దేశం’ అని పేర్కొన్నారు. సురేఖ వ్యాఖ్యల వీడియోను కోర్టుకు సమర్పించారు.

error: Content is protected !!