India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్‌లో వాటాల కేటాయింపుపై సోదరి షర్మిల, తల్లి విజయమ్మపై Y.S.జగన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో పిటిషన్ వేశారు. మొదట్లో సోదరి అనే భావనతో షర్మిలకు వాటాలు కేటాయించాలని భావించానని, అయితే ఇటీవల రాజకీయంగా తనకు వ్యతిరేకంగా మారడంతో ఆ ఆఫర్‌ను విరమించుకున్నానని జగన్ పిటిషన్‌లో పేర్కొన్నారు. NCLT ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను Nov 8కి షెడ్యూల్ చేసింది.
TG: BRS MLAలను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడంపై TPCC చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. MLAలను చేర్చుకోవడం అనేది పార్టీ అధిష్ఠానం నిర్ణయమని చెప్పారు. పార్టీ నిర్ణయం ప్రకారమే MLAలను చేర్చుకున్నామన్నారు. దీని వల్ల MLC జీవన్‌రెడ్డి ప్రతిష్ఠకు ఎక్కడా భంగం వాటిళ్లలేదని ఆయన అన్నారు. కాగా కాంగ్రెస్‌లోకి వచ్చిన BRS MLAలపై వేటు వేయాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
మహారాష్ట్ర ఎన్నికల్లో NCP దూకుడు ప్రదర్శిస్తోంది. 38 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. 26 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ అవకాశమిచ్చింది. డిప్యూటీ CM, పార్టీ చీఫ్ అజిత్ పవార్ పుణే జిల్లాలోని బారామతి నుంచి బరిలోకి దిగుతున్నారు. సుల్భా ఖోడ్కే (అమరావతి), హిరామన్ ఖోస్కర్ (ఇగత్‌పురి), భరత్ గవిత్, Dy స్పీకర్ నరహరిజిర్వాల్ (దిండోరి), చగన్ భుజ్‌బల్, రాజ్‌కుమార్ బడోలెకు టికెట్లు దక్కాయి.
AP: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. భేటీ వివరాలను సీఎం చంద్రబాబు సాయంత్రం 4గంటలకు ప్రెస్‌మీట్‌లో వెల్లడించనున్నారు. ఇసుక, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, కొత్త రేషన్ కార్డుల జారీ, కొత్త మద్యం పాలసీ, అసెంబ్లీ సమావేశాలు, వాలంటీర్ల కొనసాగింపు, రేషన్ డీలర్ల నియామకం, పోలవరం, అమరావతిలో ప్రాజెక్టుల నిర్మాణం సహా పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.
AP: టీడీపీ, వైసీపీ చేసిన తాజా ట్వీట్లు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ‘Big Expose’ అంటూ తొలుత టీడీపీ ట్వీట్ చేసింది. ఆ తర్వాత ‘truth bomb dropping’ అని వైసీపీ పోస్ట్ పెట్టింది. దీంతో ఆ పోస్టులకు అర్థం ఏంటి? రేపు ఏం చెప్పబోతున్నాయి? అని టీడీపీ, వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి మరి.
TG: BRS నుంచి కాంగ్రెస్‌లో చేరిన MLAలపై వేటువేయాలని MLC జీవన్‌రెడ్డి చేసిన కామెంట్స్‌పై KTR స్పందించారు. ‘రేవంత్ గారు.. మీ సొంత పార్టీ నేతనే మీరు చేసిన MLAల ఫిరాయింపులు అప్రజాస్వామికమని, దుర్మార్గమైన చర్య అని సూటిగా వేలెత్తి చూపుతున్నారు. ఇప్పటికైనా మీరు లెంపలేసుకుంటారా? జీవన్‌రెడ్డి వంటి సీనియర్ నేత ఇది కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకమని మీ దిగజారుడు రాజకీయాలపై దుమ్మెత్తి పోశారు’ అని ట్వీట్ చేశారు.
మంత్రి కొండా సురేఖపై నటుడు నాగార్జున వేసిన పరువు నష్టం దావాపై విచారణను నాంపల్లి ప్రత్యేక కోర్టు అక్టోబర్ 30కి వాయిదా వేసింది. కాగా నాగార్జున వేసిన దావాపై మంత్రి సురేఖ తరఫున అడ్వకేట్ గుర్మీత్ సింగ్ రిప్లై ఫైల్ చేశారు. సమంత విడాకుల విషయంలో నాగార్జున ప్రమేయం ఉందంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.
బిహార్‌లో ‘పుష్ప’ రేంజ్‌లో స్మగ్లింగ్ వెలుగుచూసింది. ముజఫర్‌పూర్‌లో హిందుస్థాన్ పెట్రోలియం ట్యాంకర్‌పై అనుమానం వచ్చిన పోలీసులు వెంబడించగా నిందితులు ఆ వాహనాన్ని జాతీయరహదారిపై వదిలి పరారయ్యారు. ట్యాంకర్ ఓపెన్ చేసి చూస్తే అందులో మద్యం కాటన్లు ఉన్నాయి. మద్యం అరుణాచల్‌ప్రదేశ్‌లో తయారైనట్లు పోలీసులు గుర్తించారు. బిహార్‌లో లిక్కర్ అమ్మకాలు నిషేధం. అందుకే స్మగ్లర్లు ఇలా తప్పుడు దారులు ఎంచుకుంటున్నారు.
ప్రియాంకా గాంధీతో తలపడుతున్న BJP అభ్యర్థి నవ్యా హరిదాస్‌ది కోజికోడ్. వీరి కుటుంబానికి సంఘ్‌తో అనుబంధం ఉంది. 2009లో పెళ్లయ్యాక సింగపూర్‌కు వెళ్లిన నవ్య సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేశారు. 2015లో కోజికోడ్ ట్రిప్‌కు వచ్చి లోకల్‌బాడీ ఎలక్షన్లో పోటీ చేశారు. ఓడితే సింగపూర్ వెళ్దామనుకున్న ఆమె వరుసగా 2 సార్లు గెలిచి పార్టీలో ఎదిగారు. 2021లో కోజికోడ్ సౌత్ నుంచి MLAగా ఓడినా BJP ఓట్ల శాతం17-21కి పెంచారు.
బంగాళాఖాతంలో ‘దానా’ తుఫాన్ కారణంగా APలో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో తీరం వెంట గంటకు 80-90KM వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయంది. ఇవాళ, రేపు సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, జాగ్రత్తలు తీసుకోవాలంది. రేపు అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాములోపు తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది.
Sorry, no posts matched your criteria.