India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రాష్ట్రంలో రూ.99కే క్వార్టర్ మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఒక్కో లిక్కర్ షాప్‌నకు 3 నుంచి 8 కేసులు మాత్రమే సరఫరా చేస్తుండగా, త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు వైన్స్ నిర్వాహకులు చెబుతున్నారు. షార్ట్స్ పేరుతో బ్రాండీ, విస్కీ విక్రయాలు కూడా జరుగుతున్నాయి. దీంతో మందుబాబులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గాజా యుద్ధాన్ని ముగించేందుకు ఇజ్రాయెల్‌కు ఇదే సరైన సమయమని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ తాజాగా పేర్కొన్నారు. ఇరాన్‌తో ఉద్రిక్తతల్ని పెంచొద్దని ఆ దేశానికి సూచించారు. ‘గత ఏడాది అక్టోబరు 7 తర్వాతి నుంచి గాజా విషయంలో ఇజ్రాయెల్ నిర్దేశించుకున్న లక్ష్యాలన్నింటినీ సాధించింది. ఇప్పుడు ఆ విజయాలను శాశ్వతం చేసుకోవాలి. పరిస్థితి మరింత దిగజారనివ్వకూడదు. గాజాకిప్పుడు మానవతాసాయం అవసరం’ అని పేర్కొన్నారు.
టీమ్ ఇండియాలో క్రికెటర్ KL.రాహుల్ చోటుపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కోచ్ గంభీర్ స్పందించారు. వాటితో తమకు అవసరం లేదని, మేనేజ్మెంట్ ఏం అనుకుంటుందనేదే తమకు ముఖ్యమన్నారు. జట్టును ఎంపిక చేసేది నెటిజన్లు కాదన్నారు. రాహుల్ మంచి ఫామ్‌లో ఉన్నారని, అతడు పెద్ద స్కోర్లు చేయాలని భావిస్తున్నాడని తనకు అనిపిస్తోందని గౌతీ చెప్పుకొచ్చారు. న్యూజిలాండ్‌తో రెండో టెస్టు రేపు ప్రారంభం కానుంది.
TG: తనకు నోటీసులు పంపిస్తానన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ <<14431823>>వ్యాఖ్యలపై<<>> కేటీఆర్ స్పందించారు. ‘బండి సంజయ్ నాకు లీగల్ నోటీసు ఇస్తే నేను ఆయనకు మళ్లీ లీగల్ నోటీస్ పంపిస్తా. రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ లీగల్ నోటీసు ఇవ్వలేదా? లీగల్ నోటీసుల విషయంలో నరేంద్ర మోదీ బాటలో నడుస్తా’ అని అన్నారు.
భారీ విజయం అందుకున్న ‘సలార్’కు సీక్వెల్‌గా రాబోతున్న ‘సలార్-2’ షూటింగ్ స్టార్ట్ అయినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. దాదాపు 20 రోజుల పాటు కొనసాగే ఈ షెడ్యూల్‌లో ప్రభాస్ పాల్గొంటున్నారని, బర్త్ డే సందర్భంగా ఈ న్యూస్ అభిమానుల్లో మరింత జోష్ నింపుతుందని తెలిపాయి. ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా ప్రభాస్ సరసన శ్రుతి, ప్రధాన పాత్రలో పృథ్విరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు.
AP: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) ఛైర్మన్‌గా రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అనురాధ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో అనురాధ ఇంటెలిజెన్స్ చీఫ్, హోంశాఖ సెక్రటరీగా పని చేశారు.
భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఐదేళ్ల తర్వాత తొలిసారిగా ద్వైపాక్షిక భేటీలో పాల్గొననున్నారు. బ్రిక్స్ సదస్సు కోసం ఇరు దేశాధినేతలు రష్యాలో ఉన్న సంగతి తెలిసిందే. ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు ఇరువురూ అక్కడ సమావేశం కానున్నారు. తూర్పు లద్దాక్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఒప్పందానికి వచ్చామని చైనా, భారత్ ఇటీవలే ప్రకటించాయి.
విమానాలకు ఫేక్ బాంబు బెదిరింపుల విషయంలో సోషల్ మీడియాపై కేంద్రం తీవ్రంగా మండిపడింది. బెదిరింపులు ఎక్కువగా X, Fb వంటి ప్లాట్‌ఫాంల ద్వారానే జరగడం, వ్యాప్తి చెందడంతో నియంత్రణ చర్యలపై కేంద్రం ప్రశ్నల వర్షం కురిపించింది. కట్టడికి తీసుకున్న చర్యలు వివరించాలంది. విమానయాన, సోషల్ మీడియా సంస్థలతో భేటీలో కేంద్ర IT శాఖ ఉన్నతాధికారి సంకేత్ ‘మీరు నేరాల్ని ప్రోత్సహిస్తున్నట్లు అన్పిస్తోంది’ అని Xపై ధ్వజమెత్తారు.
IPL మెగా వేలంలోకి DC కెప్టెన్ పంత్ వచ్చే అవకాశముందని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. పంత్‌ను కెప్టెన్‌గా కొనసాగించాలని DC మేనేజ్‌మెంట్ అనుకోవట్లేదని, దీంతో వేలంలోకి రావాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. వేలంలోకి వస్తే ఆయన్ను తీసుకోవాలని RCB భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కేఎల్ రాహుల్‌ను LSG, శ్రేయస్‌ను KKR వదులుకోనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరో వారంలో స్పష్టత రానుంది.
AP: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 3 సిలిండర్లు కాకుండా 4 నెలలకొకటి ఇవ్వాలని నిర్ణయించింది. సిలిండర్‌కు డబ్బు చెల్లిస్తే 48 గంటల్లో ఆ సబ్సిడీ మొత్తం ఖాతాల్లో డిపాజిట్ కానుంది. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.రూ.876 ఉండగా కేంద్రం సబ్సిడీ రూ.25 పోను మిగిలిన రూ.851 చొప్పున 3 సిలిండర్లకు ఏడాదికి రూ.2,553 ఖాతాల్లో జమ కానున్నాయి.
Sorry, no posts matched your criteria.