news

News October 22, 2024

UPSC-ESE-2025 నోటిఫికేషన్ విడుదల

image

ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్-2025కు UPSC నోటిఫికేషన్ ఇచ్చింది. దేశంలోని రైల్వే, టెలికం, డిఫెన్స్ లాంటి కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 457 పోస్టులను భర్తీ చేయనుంది. బీఈ/బీటెక్ పూర్తైన 21-30 ఏళ్లలోపు వారు దరఖాస్తుకు అర్హులు. నవంబర్ 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 23 నుంచి 29 వరకు దరఖాస్తుల సవరణ చేసుకోవచ్చు. వచ్చే ఏడాదిలో ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News October 22, 2024

ఇండియన్ ఎకానమీకి పెద్ద సవాల్ ‘ఉపాధి’: నిర్మల

image

భారత ఆర్థిక వ్యవస్థ ముందు ఉపాధి కల్పన రూపంలో అతి పెద్ద సవాల్ ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల అన్నారు. చాలామంది విద్యార్థులు యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్లతో బయటికి వస్తున్నా, ఆ సర్టిఫికెట్లకు తమకు కావాల్సిన నైపుణ్యాలకు చాలా వ్యత్యాసం ఉన్నట్లు కంపెనీలు భావిస్తున్నాయని ఆమె అన్నారు. అందుకే యువతకు స్కిల్స్ నేర్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసిందని న్యూయార్క్‌లో అన్నారు.

News October 22, 2024

ఈరోజు సాయంత్రం కేరళకు సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్‌రెడ్డి ఈరోజు సాయంత్రం కేరళకు వెళ్లనున్నారు. రేపు వయనాడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంకా గాంధీ నామినేషన్ దాఖలు చేయనున్న విషయం తెలిసిందే. ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రేవంత్ కేరళ వెళ్తున్నారు. ఇదే కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు. కాగా ఇక్కడ గెలిచిన రాహుల్ రాజీనామా చేయడంతో ఉపఎన్నిక జరుగుతోంది.

News October 22, 2024

ఏపీలో మందుబాబులకు మరో శుభవార్త

image

APలో మందుబాబులకు ఎక్సైజ్ శాఖ మరో శుభవార్త చెప్పింది. రూ.99కే క్వార్టర్ మద్యం ఉత్పత్తి పెంచినట్లు తెలిపింది. ఈ నెలాఖరు నాటికి 2.4 లక్షల మద్యం కేసులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. పలుచోట్ల రూ.99 మద్యం లభించక మందుబాబులు అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో ఉత్పత్తిని పెంచాలని కంపెనీలను ఆదేశించింది. కాగా 4 కంపెనీలు తమ 7 రకాల బ్రాండ్లను రూ.99 MRPపై అమ్మేందుకు అనుమతి పొందాయి.

News October 22, 2024

STOCK MARKETS: మిడ్, స్మాల్ షేర్లు క్రాష్

image

బెంచ్‌మార్క్ సూచీలు ఫ్లాట్‌గా చలిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిక్స్‌డ్ సిగ్నల్స్ అందాయి. నెగటివ్ సెంటిమెంటు వల్ల ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ 81,133 (-24), నిఫ్టీ 24,770 (-10) వద్ద ట్రేడవుతున్నాయి. స్మాల్, మిడ్‌క్యాప్ షేర్లు క్రాష్ అవుతున్నాయి. రియల్టీ, మీడియా, మెటల్ రంగాలపై సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువగా ఉంది. టాటా స్టీల్, టాటా మోటార్స్, M&M, మారుతీ టాప్ లూజర్స్.

News October 22, 2024

ఈ ఉద్యోగుల ఆదాయం రూ.100-500 కోట్లు!

image

గత పదేళ్లలో రూ.500Cr పైగా Taxable Income చూపిన 23 మంది వ్యాపారులేనని TOI రిపోర్ట్ పేర్కొంది. రూ.100-500Cr బ్రాకెట్లో 262 మంది ఉండగా అందులో 19 మంది ఉద్యోగులు. ఇక AY2013-14లో రూ.500Cr+ పైగా ఆదాయం వస్తున్నట్టు ఒక్కరే ITR ఫైల్ చేశారు. AY2022-23తో పోలిస్తే గత అసెస్‌మెంట్ ఇయర్లో రూ.25Cr సంపాదనా పరులు 1812 నుంచి 1798కి తగ్గారు. రూ.10Cr కేటగిరీలో ఉద్యోగులు 1656 నుంచి 1577కు తగ్గారు. దీనిపై మీ కామెంట్.

News October 22, 2024

‘INDIA’లో కాంగ్రెస్ మాట చెల్లడం లేదా!

image

హరియాణా, JK ఫలితాలతో కాంగ్రెస్‌ పెద్దరికానికి పెనుముప్పు ఏర్పడింది! మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, UPలో మిత్రపక్షాలు దాని మాటే వినడం లేదని తెలుస్తోంది. మహాలో శివసేన UBT కాంప్రమైజ్ కావడమే లేదు. PCC చీఫ్ నానా పటోలేను లెక్కచేయడమే లేదు. JHAలో సీట్లు తక్కువిస్తే సొంతంగా పోటీచేస్తామని RJD బెదిరిస్తోంది. కూటమి పోటీ లెక్క తేలలేదు. UP ఉప ఎన్నికల్లో SP అసలు INCని పట్టించుకోవడమే లేదన్న వార్తలపై మీ అభిప్రాయం ఏంటి?

News October 22, 2024

కాబోయే ‘సచిన్’ అన్నారు.. కానీ!

image

యంగ్ ఓపెనర్ పృథ్వీ షాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సచిన్‌, సెహ్వాగ్‌ల క్వాలిటీలున్నాయని, రాబోయే తరానికి మంచి బ్యాటర్‌ అని విశ్లేషణలు విన్పించాయి. కాగా ఇప్పటికే టీమ్ ఇండియాలో చోటు దక్కించుకోలేకపోతున్న షాను తాజాగా రంజీ ట్రోఫీలో ముంబై జట్టు సైతం ఫిట్నెస్, క్రమశిక్షణ వంటి కారణాలతో తొలగించింది. షా 5 టెస్టులు, 6 వన్డేలు, ఒక T20 ఆడారు. తొలి టెస్టులోనే సెంచరీ చేసి MOMగా నిలిచి రికార్డు సృష్టించారు.

News October 22, 2024

BREAKING: కొండా సురేఖపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా

image

TG: తన క్యారెక్టర్‌‌పై చేస్తున్న నిరాధార ఆరోపణలకు అడ్డుకట్ట వేసేందుకు ఓ నిర్ణయానికి వచ్చినట్లు మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కొండా సురేఖ అభ్యంతరకర <<14254371>>వ్యాఖ్యలపై<<>> రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసినట్లు పేర్కొన్నారు. గత కొంత కాలంగా తన క్యారెక్టర్‌ను దిగజార్చేందుకు సోషల్ మీడియాలో చేసే ప్రయత్నాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందన్నారు. కోర్టులో నిజం గెలుస్తుందని నమ్ముతున్నట్లు తెలిపారు.

News October 22, 2024

OTTలోకి వచ్చేస్తున్న కొత్త సినిమా

image

తమిళ నటుడు కార్తీ, అరవింద స్వామి కలిసి నటించిన ‘సత్యం సుందరం’ మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ నెల 27 నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుందని నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. దేవరతో పాటు విడుదలైన ఈ మూవీ ఫీల్ గుడ్ కథతో తెరకెక్కింది. ప్రేమ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళంలో మంచి టాక్ తెచ్చుకుంది.

error: Content is protected !!