news

News October 21, 2024

23న ప్రియాంకా గాంధీ నామినేషన్

image

వ‌య‌నాడ్ ఉపఎన్నికలో UDF కూటమి తరఫున కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంకా గాంధీ అక్టోబ‌ర్ 23న(బుధ‌వారం) నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు. దానికి ముందు కాల్పెట్ట‌లో రాహుల్ గాంధీతో క‌ల‌సి ఆమె రోడ్ షో నిర్వ‌హిస్తార‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు తెలిపాయి. నామినేష‌న్ దాఖ‌లు సంద‌ర్భంగా సోనియా గాంధీ, ఖ‌ర్గే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు స‌హా కీల‌క నేత‌లు హాజ‌ర‌వుతార‌ని తెలుస్తోంది.

News October 21, 2024

మహారాష్ట్రలో మహాయుతి ‘మోదీ ఫ్యాక్టర్’!

image

మ‌హారాష్ట్రలో CM అభ్యర్థి ఎవ‌ర‌న్న‌ది ప‌క్క‌న‌పెట్టి ఈసారి అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను PM మోదీ పేరుతోనే ఎదుర్కొన‌బోతున్న‌ట్టు మ‌హాయుతి నేత‌లు చెబుతున్నారు. NDA కూట‌మిలోని BJP, శివ‌సేన‌, NCPల ప‌ర‌స్ప‌ర అజెండాలు ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌కుండా మోదీ ఫ్యాక్ట‌ర్ మాత్ర‌మే కనిపించేలా జాగ్రత్త పడుతున్నారు. 3 పార్టీల్లో ఎవ‌రికి CM హామీ ఇచ్చినా మిగిలిన పార్టీల క్యాడ‌ర్ ప‌నిచేయ‌ద‌నే భావ‌న‌లో నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.

News October 21, 2024

జగన్ హయాంలో మహిళలపై 2 లక్షల నేరాలు: వర్ల రామయ్య

image

AP: ఆడబిడ్డల రక్షణ గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు. ఆయన హయాంలో మహిళలపై 2 లక్షల నేరాలు జరిగాయని ఆరోపించారు. అప్పుడు శాంతిభద్రతలు ఏమయ్యాయని నిలదీశారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో తిరోగమించిందన్నారు. గంజాయి, డ్రగ్స్‌తో యువత భవిష్యత్తును నాశనం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో స్త్రీలపై దారుణాలు జరుగుతున్నాయని ఇటీవల జగన్ విమర్శించిన విషయం తెలిసిందే.

News October 21, 2024

యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు సీఎం రేవంత్ శంకుస్థాపన

image

TG: రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటుకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని పోలీస్, ఎక్సైజ్, ఫైర్, ఎస్‌పీఎఫ్ ఉద్యోగుల పిల్లలకు ఈ స్కూలులో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను ప్రభుత్వం అందించనుంది.

News October 21, 2024

ఇండియాలో మాత్రమే కనిపించే డాగ్ బ్రీడ్స్ ఇవే

image

☛ రాజపాలయం: తమిళనాడులో కనిపించే వీటిని ఇండియన్ సైట్ హౌండ్ డాగ్స్ అని కూడా అంటారు. ఇవి తెలివైనవని చెబుతుంటారు.
☛ ముధోల్ హౌండ్: కర్ణాటకకు చెందిన ఈ జాతి కుక్కలకు వేగం ఎక్కువ. వీటిని ఆర్మీ ఉపయోగిస్తుంటుంది.
☛ చిప్పిపరై: ఇవి TNకు చెందినవి. పూర్వం రాజ కుటుంబాలు పెంచుకునేవి. చాలా విశ్వాసంగా ఉంటాయి.
☛ ఇండియన్ పారియా: ఇవి దేశమంతటా కనిపిస్తాయి.
☛ బఖర్వాల్: J&Kలో ఉండే ఈ శునకాలు భయమెరుగనివి అని అంటారు.

News October 21, 2024

రుషికొండ ప్యాలెస్‌లో పవన్ కళ్యాణ్

image

విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మించిన ప్యాలెస్‌లను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. స్థానిక ఎంపీ భరత్‌తో పాటు ఎమ్మెల్యేలతో కలిసి భవన సముదాయాల్లో కలియతిరిగారు. కొండ పైనుంచి బీచ్ అందాలను చూస్తూ ఫొటోలు తీసుకున్నారు. ప్యాలెస్ వద్ద పనిచేస్తోన్న కార్మికులతో ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను జనసేన ట్విటర్‌లో షేర్ చేసింది.

News October 21, 2024

అలాంటి మెసేజ్‌లకు స్పందించకండి: TRAI

image

మొబైల్ నంబర్ వెరిఫికేషన్ / డిస్ కనెక్షన్ కోసం యూజర్లకు కాల్స్/మెసేజ్‌లు విపరీతంగా వస్తున్నాయి. తాజాగా దీనిపై TRAI స్పందించింది. ఇలాంటి మెసేజ్‌లు తాము పంపించమని స్పష్టం చేసింది. అలాంటి మోసపూరితమైన కాల్స్, మెసేజ్‌లకు స్పందించవద్దని కోరింది. అలాంటి వాటిని https://sancharsaathi.gov.inకు తెలపాలంది. ఎవరైనా మోసపోతే వెంటనే 1930 / cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని సూచించింది.

News October 21, 2024

తీవ్ర తుఫాన్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు: APSDMA

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ఈ నెల 25న తీవ్రతుఫానుగా ఒడిశా, బెంగాల్ తీరాల సమీపంలో తీరం దాటుతుందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లోని కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

News October 21, 2024

ఉద్యోగి పెళ్లికి 2 రోజుల సెలవు ఇవ్వని సీఈవో.. నెటిజన్ల ఫైర్

image

ఓ మార్కెటింగ్ కంపెనీ(UK) CEO లారెన్ టిక్నర్ తమ ఉద్యోగి పెళ్లి కోసం 2 రోజుల లీవ్ ఇవ్వలేదు. ఈ విషయాన్ని ఆమెనే సోషల్ మీడియాలో వెల్లడించారు. అతనికి ఇంతకు ముందే రెండున్నర వారాలు సెలవు ఇచ్చానని, అయితే రీప్లేస్‌మెంటయ్యే ఉద్యోగికి ట్రైనింగ్ ఇవ్వనందున ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ‘సెలవు తీసుకుంటే మరో ఉద్యోగికి శిక్షణ ఇవ్వాలా? ఇదెక్కడి రూల్? ఇలాంటి విధానాన్ని ఉపేక్షించకూడదు’ అని నెటిజన్లు ఫైరవుతున్నారు.

News October 21, 2024

అందుకే జగన్ అసెంబ్లీకి రావట్లేదు: స్పీకర్ అయ్యన్నపాత్రుడు

image

AP: నవంబర్ 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెప్పారు. నర్సీపట్నం నియోజకవర్గ పర్యటనలో ఆయన మాట్లాడారు. 5 రోజుల పాటు జరిగే సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడతామన్నారు. అయితే తనకు నమస్కారం పెట్టాల్సి వస్తుందని మాజీ సీఎం జగన్ సభకు రావట్లేదన్నారు. అయితే ఈ సమావేశాలకు ఆయన వస్తారని వేచి చూస్తున్నట్లు పేర్కొన్నారు.

error: Content is protected !!