India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రీఛార్జ్ ప్లాన్స్ ధరలు పెంచిన తర్వాత రిలయన్స్ జియోకు యూజర్లు షాక్ ఇచ్చారు. రెండవ త్రైమాసికంలో 1.07కోట్ల మంది జియోకు గుడ్ బై చెప్పినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే 5G సబ్ స్క్రైబర్స్ బేస్ మాత్రం 17మిలియన్లు పెరిగి 147 మిలియన్లకు చేరింది. ఒక్కో యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం రూ.181.7 నుంచి రూ.195.1కి పెరిగింది. వినియోగదారుల్ని కోల్పోవడం తమ లాభాలపై పెద్దగా ప్రభావం చూపదని కంపెనీ పేర్కొంది.
బెదిరింపు కాల్స్‌తో విమానాలకు అంతరాయాలు కలగకుండా కేంద్రం రూల్స్ మారుస్తోంది. ప్యాసింజర్, కార్గో సహా సెకండరీ లాడార్ పాయింట్ల వద్ద హ్యాండ్ బ్యాగుల చెకింగ్ ముమ్మరం చేయనుంది. మెసేజులు పెడుతున్న వారిని పట్టుకొనేందుకు VPN ప్రొవైడర్లతో కలిసి పనిచేయనుంది. SMలో ఒకే అకౌంట్ నుంచి ఎక్కువ మెసేజెస్ పెట్టి గంటల్లోనే డిలీట్ చేయడాన్ని గమనించిన సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) సైబర్ టీమ్స్‌ను అలర్ట్ చేసింది.
TG: వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు, కొత్త రహదారుల నిర్మాణాలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 1,320KM మేర మరమ్మతులు చేయాల్సి ఉండగా రూ.1,375 కోట్లు అవసరమని అంచనా వేసింది. R&B పరిధిలో 2,555KM రోడ్లు ధ్వంసం కాగా రూ.2,500 కోట్లు కావాలని తేల్చింది. నియోజకవర్గాల వారీగా ఆ నిధులను త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అందుకు కేంద్ర సహకారమూ కోరనుంది.
AP: వైసీపీ నేత నందిగం సురేశ్‌ను ఈరోజు పోలీసులు కోర్టులో హాజరుపర్చనున్నారు. 2020లో జరిగిన ఘర్షణల విషయంలో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఉదయం 10గంటలకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆ తర్వాత మంగళగిరి కోర్టులో హాజరుపరుస్తారు. రెండు రోజుల పోలీసుల కస్టడీ ముగియడంతో ఆయనను కోర్టుకు తీసుకొస్తున్నారు. కాగా విచారణలో తేలిన అంశాల ఆధారంగా త్వరలోనే ఛార్జ్‌షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది.
బెంచ్‌మార్క్ సూచీలు లాభాల్లో మొదలవ్వొచ్చు. ఆసియా మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్స్ వస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ, నిక్కీ, తైవాన్, కోస్పీ, జకార్తా సూచీలు మెరుగ్గా ట్రేడవుతున్నాయి. చైనా, హాంకాంగ్ సూచీలు నష్టాల్లో ఉన్నాయి. OCTలో FIIలు రూ.80,217 కోట్లను వెనక్కి తీసుకున్నారు. DIIలు రూ.74,176 కోట్లు పెట్టుబడి పెట్టారు. అంటే నెట్ లాస్ తక్కువగానే ఉంది. కంపెనీల రిజల్ట్స్‌ను బట్టి సూచీల కదలిక ఉంటుంది.
AP: డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు డయేరియా బాధితులను పరామర్శించనున్నారు. విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడ కలుషిత నీటి వల్ల వాంతులు, విరేచనాలతో నాలుగు రోజుల వ్యవధిలోనే ఏడుగురు మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే ఆయన బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అక్కడి పరిస్థితులపై సమీక్షిస్తారు.
దేవుడిని బలంగా నమ్మితే సమస్యలకు దారి చూపిస్తాడని CJI DY చంద్రచూడ్ అన్నారు. అయోధ్య కేసు విచారణ టైమ్‌లో రోజూ దేవుడి ముందు ప్రార్థించేవాడినని పేర్కొన్నారు. వందల ఏళ్ల సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకున్నట్టు తెలిపారు. తన నేటివ్ విలేజ్ కనేర్‌సర్‌లో సన్మానం తర్వాత మాట్లాడారు. ‘కొన్నిసార్లు పరిష్కరించలేని కేసులు వస్తుంటాయి. అయోధ్య వివాదం ఇలాంటిదే’ అని అన్నారు. ఈ తీర్పు రాసిన ఐదుగురు జడ్జిల్లో DYC ఒకరు.
దీపావళి సందర్భంగా ‘మూరత్’ ట్రేడింగ్‌ను నవంబర్ 1న సా.6-7 గంటల మధ్య నిర్వహించనున్నట్లు బీఎస్ఈ, ఎన్‌ఎస్ఈ ప్రకటించాయి. హిందూ కాలమానం ప్రకారం ఆరోజు నుంచి ‘సంవత్ 2081’ ప్రారంభం అవుతుంది. మదుపరులు, బ్రోకర్లకు మూరత్ ట్రేడింగ్ భోగభాగ్యాలు ప్రసాదిస్తుందని విశ్వాసం. అందుకే చాలామంది ఆరోజు కనీసం ఒక్క షేర్ అయినా కొనుగోలు చేయాలని చూస్తారు. అంతకుముందు రోజు(దీపావళి-అక్టోబర్ 31)న ప్రీఓపెనింగ్ సెషన్ ఉంటుంది.
TG: రాష్ట్ర ప్రజలంతా ఐక్యంగా ఉద్యమిస్తేనే తెలంగాణ స్వరాష్ట్రం వచ్చిందని, KCR ఒక్కడి వల్లే రాలేదని MLC కోదండరాం అన్నారు. నిజామాబాద్ TNGOs భవన్‌లో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. ‘తెలంగాణ కోసం ఎన్నో సంఘాలు ఉద్యమించాయి. ఎందరో బలిదానాలు చేయడంతో రాష్ట్రం సిద్ధించింది. KCR తన స్వలాభం కోసం ఉద్యమ చరిత్రను వక్రీకరిస్తున్నారు. పదేళ్ల పాలనలో నిరుద్యోగ సమస్యలను BRS తీర్చలేదు’ అని ఆయన విమర్శించారు.
TG: రేషన్ కార్డుల్లో అర్హుల పేర్లు చేర్చడంపై ప్రభుత్వం త్వరలోనే తీపికబురు అందించనుంది. కుటుంబంలో పిల్లలు, కోడలు, కొత్త సభ్యుల పేర్లు నమోదు కోసం లక్షల మంది ఎదురుచూస్తున్నారు. దాదాపు 10 లక్షల మందికి పైగా పేర్లు చేర్చాలని దరఖాస్తు చేశారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల అంశం పూర్తయ్యాక పేర్లు నమోదు చేసే కార్యక్రమం ప్రారంభం కానుంది. ఆ తర్వాత కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.