India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG:’కాజీపేటలో కోచ్‌ఫ్యాక్టరీ’ కోసం వరంగల్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. నిన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి <<14406395>>ప్రకటనతో<<>> వారి కల త్వరలోనే నెరవేరనుంది. ఈ కోచ్ ఫ్యాక్టరీలో వందేభారత్, స్లీపర్ కోచ్‌లు తయారీ కానున్నాయి. ఇటీవలే దీనిపై RVNL, రైల్వే బోర్డు మధ్య చర్చలు జరిగాయి. ఇప్పటికే వ్యాగన్ మాన్యుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ ఇక్కడ సిద్ధం అవుతుండగా, కోచ్ ఫ్యాక్టరీ కూడా వస్తే ఓరుగల్లు రూపురేఖలే మారిపోతాయి.
AP: 2024-25 రబీ సాగుకు సంబంధించిన ప్రణాళికలను వ్యవసాయశాఖ సిద్ధం చేసింది. రబీలో సాధారణ సాగు విస్తీర్ణం 56.58లక్షల ఎకరాలు కాగా ఈసారి 57.65లక్షల ఎకరాలు లక్ష్యంగా నిర్దేశించింది. ప్రధానంగా 19.87లక్షల ఎకరాల్లో వరి, 11.17లక్షల ఎకరాల్లో శనగ, 8.44లక్షల ఎకరాల్లో మినుము, 5.23లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటను రైతులు సాగు చేయనున్నారు. రబీకి సబ్సిడీతో 3.85లక్షల క్వింటాళ్ల విత్తనాలను ప్రభుత్వం ఇవ్వనుంది.
TG: అభ్యర్థుల ఆందోళనలు, ప్రభుత్వ పట్టుదల నడుమ మరికొన్ని గంటల్లో గ్రూప్-1 మెయిన్స్ ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం 30 నిమిషాల ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. మ.12.30 నుంచి 1.30 గంటల వరకు అనుమతిస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత వచ్చేవారిని అనుమతించబోమని స్పష్టంచేశారు. పరీక్షలకు సంబంధించి అనుమానాలపై 040-23452185, 040-23452186 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
సమాజం కోసం ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తుంటారు పోలీసులు. అరాచక శక్తులను ఎదుర్కొనే క్రమంలో ఒక్కోసారి అమరులవుతుంటారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఉద్యోగాలు చేస్తూ సంఘ విద్రోహ శక్తుల నుంచి సమాజాన్ని కాపాడుతారు. విధి నిర్వహణలో అమరులైన వారి గౌరవార్థం, వారి జీవితాలను యువ పోలీసులు ఆదర్శంగా తీసుకునేలా ఏటా OCT 21న దేశంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తుంటారు.
☘ వీరులారా.. వందనం
AP: వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గత ప్రభుత్వం తనపై పెట్టిన కేసు కొట్టివేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను Dy.CM పవన్ కళ్యాణ్ ఉపసంహరించుకున్నారు. చట్టపరంగా ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించేందుకు వీలు కల్పిస్తూ పిటిషన్ వెనక్కి తీసుకునేలా అనుమతివ్వాలని పవన్ లాయర్ కోరగా హైకోర్టు ఓకే చెప్పింది. వాలంటీర్లు సేకరించిన సమాచారం అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లి మహిళలను అపహరిస్తున్నారని పవన్ గతంలో అన్నారు.
TG: గ్రూప్-1 పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు, అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. జీవో 29పైనే ప్రధానంగా ఇవాళ న్యాయస్థానంలో వాదనలు జరుగుతాయని, తమకు న్యాయం జరుగుతుందని పిటిషనర్లు ఆశలు పెట్టుకున్నారు. ఓ వైపు విద్యార్థులు ఆందోళనలు, మరో వైపు ప్రభుత్వం ఇవాళ్టి నుంచి పరీక్షలు నిర్వహిస్తుండటంతో కోర్టు తీర్పు ఎలా వస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్ వద్ద ఏర్పడ్డ ఆవర్తనం మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 23నాటికి తుఫానుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో భారీ, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. సముద్రంలో ఈదురుగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
క్యారెట్లు మరీ ఎక్కువగా తింటే మనిషి చర్మం స్వల్పంగా ఆరెంజ్ కలర్‌లోకి మారుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని కెరోటెనీమియాగా వ్యవహరిస్తారు. క్యారెట్లలో ఉండే బీటా కెరోటిన్ అనే పిగ్మెంట్ మనిషి శరీరంలో విటమిన్-ఏగా మారుతుంది. పిగ్మెంట్ స్థాయి మోతాదుకి మించితే రక్త ప్రసరణలోకి చేరుతుంది. అది ఇంకా పెరిగితే దేహం ఆరెంజ్ కలర్‌లో కనిపించొచ్చని, కానీ ప్రమాదకరమేమీ కాదని నిపుణులు తెలిపారు.
అత్యంత కష్టమైన అమెరికా అధ్యక్ష పదవిలో పనిచేసేంత ఫిట్‌గా ట్రంప్ ఉన్నారా అంటూ కమలా హారిస్ తాజాగా ప్రశ్నించారు. అలసిపోవడం వల్ల పలు ఇంటర్వ్యూలను ట్రంప్ రద్దు చేసుకుంటున్నారన్న వార్తల నేపథ్యంలో ఆమె స్పందించారు. ‘ప్రచారంలోనే అలసిపోయే మీరు అధ్యక్ష పదవికి అర్హులేనా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి’ అని విమర్శించారు. మరోవైపు.. కమలకు కనీసం కుందేలుకున్న ఎనర్జీ కూడా లేదంటూ ట్రంప్ ఎద్దేవా చేశారు.
తెలంగాణలో 563 గ్రూప్-1 పోస్టులకు నేటి నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. పరీక్షను వాయిదా వేయాలంటూ కొందరు అభ్యర్థులు నిరసనలు చేస్తున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ రూమ్, చీఫ్ సూపరింటెండెంట్, పరిసర ప్రాంతాల్లో CC కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల వరకు ఐదుగురికి మించి ఉండకుండా పోలీసులు BNSS 163 సెక్షన్ విధించారు.
Sorry, no posts matched your criteria.