News February 28, 2025
రోజంతా కూర్చొని పనిచేస్తున్నారా?

ప్రస్తుతం చాలా మంది ఒకేచోట 9-12 గంటలు కూర్చొని పనిచేయాల్సి వస్తోంది. అయితే, ఇలా ఎక్కువసేపు కూర్చోవడం ప్రమాదకరమని అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ అధ్యయనంలో వెల్లడైంది. వీరిలో చిత్తవైకల్యం, స్ట్రోక్, ఆందోళన, నిరాశతో పాటు నిద్రలేమి సమస్యలొస్తాయని పేర్కొంది. ఇలాంటి జాబ్స్ చేసేవారు శారీరక వ్యాయామం చేయడం వల్ల ఈ ప్రమాదాల నుంచి బయటపడొచ్చని సూచించింది. ఈ అధ్యయనంలో 73,411 మంది పాల్గొన్నారు.
Similar News
News March 26, 2025
ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతి

TG: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతి ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. తొలి విడతగా 12,500 టన్నుల బియ్యాన్ని పంపించనున్నారు. ఈ మేరకు కాకినాడ పోర్టుకు రైస్ చేరింది. రేపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జెండా ఊపి నౌక ప్రయాణాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. కొద్ది నెలల క్రితం ఆ దేశ ప్రతినిధులతో రైస్ ఎగుమతికి ఒప్పందం జరిగింది. 8లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
News March 26, 2025
BREAKING: మాజీ సీఎం ఇంటిపై సీబీఐ రైడ్స్

లిక్కర్ స్కాం కేసులో ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ ఇంట్లో CBI అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి రాయ్‌పూర్, బిలాయ్‌లోని ఆయన ఇళ్లలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కాగా ఈనెల 10న బఘేల్ ఇంటిపై ED రైడ్స్ జరిగాయి. ఆ సమయంలో అధికారుల వాహనాలపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు కేంద్రం తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బఘేల్ ఆరోపించారు.
News March 26, 2025
చరణ్ అభిమానులకు బర్త్ డే గిఫ్ట్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న ‘RC16’ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ కానుందని సినీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే గ్లింప్స్ పనులు ఆల్రెడీ పూర్తయ్యాయని, రెహమాన్ సాలిడ్ స్కోర్‌ని అందించే పనిలో ఉన్నట్లు పేర్కొన్నాయి. రేపు చరణ్ బర్త్ డే సందర్భంగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే మేకర్స్ ప్రకటన చేయనున్నట్లు సమాచారం.