India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: బద్వేల్ <<14407617>>ఘటన<<>> నిందితుడు విఘ్నేశ్‌ను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ‘నిందితుడు ప్లాన్ ప్రకారమే దాడి చేశాడు. ఐదేళ్లుగా వారికి పరిచయం ఉంది. ప్రేమించుకుని విడిపోయారు. సూసైడ్ చేసుకుంటానని బెదిరించడంతో అమ్మాయి అతడిని కలిసింది. ఇద్దరూ నిర్మానుష్య ప్రాంతంలో శృంగారంలో పాల్గొన్నారు. తర్వాత వాగ్వాదం జరిగింది. పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేయడంతో నిందితుడు నిప్పంటించాడు’ అని SP తెలిపారు.
TG: సీఎం రేవంత్ హిందూ వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నారని కేంద్రమంత్రి, BJP నేత కిషన్‌రెడ్డి ఆరోపణలు చేశారు. హిందూ పండుగల్లో అనేకమందిపై అక్రమ కేసులు పెట్టించారని ఆయన అన్నారు. సికింద్రాబాద్‌లో అమ్మవారి ఆలయ ఘటనపై నిరసన చేస్తున్నవారిపై లాఠీఛార్జ్‌కు సీఎం ఆదేశించారని ఆయన దుయ్యబట్టారు. ప్రస్తుతం ఆయన మరో వర్గాన్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారని కేంద్రమంత్రి ఆరోపించారు.
TG: గ్రూప్-1 మెయిన్స్ వాయిదా, GO29 రద్దు కోసం అభ్యర్థులు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. వారి ఆవేదనను లెక్కచేయని ప్రభుత్వం యథావిధిగా రేపటి నుంచి పరీక్షలు జరుగుతాయని ప్రకటించింది. ఈనేపథ్యంలో కొందరు గ్రూప్-1 అభ్యర్థులు బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడటానికి సిద్ధమయ్యారు. అదేసమయంలో పోలీసులూ అక్కడికి చేరుకోగా అరెస్ట్ చేస్తారేమోనని వారు మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
స్టార్ బ్యాటర్ ఎంఎస్ ధోనీని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రూ.4కోట్లకే చెన్నై సూపర్ కింగ్స్ రిటెయిన్ చేసుకోనుందని టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనంలో తెలిపింది. ధోనీతో పాటు రుతురాజ్, జడేజా, శివమ్ దూబే, పతిరణను ఆ జట్టు రిటెయిన్ చేసుకోవచ్చని పేర్కొంది. గత ఏడాది కెప్టెన్‌గా వ్యవహరించిన రుతురాజ్‌నే కెప్టెన్‌గా కొనసాగించే అవకాశముందని అంచనా వేసింది. సీఎస్కే గత ఏడాది ప్లే ఆఫ్స్‌కు రాకుండానే వెనుదిరిగిన సంగతి తెలిసిందే.
AP: విజయనగరం జిల్లా గుర్లలో సంభవించిన మరణాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అతిసారం ప్రబలడంపై సమీక్షించిన ఆయన గుర్లలో వైద్య శిబిరాలు కొనసాగించాలని సూచించారు. గ్రామంలో మరణాలు సంభవించడంపై ఐఏఎస్ విజయానంద్‌తో విచారణ జరిపించాలని నిర్ణయించినట్లు సమాచారం.
AP: రానున్న 24 గంటల్లో తూర్పు, మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని IMD ప్రకటించింది. ‘ఇది పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి 22న వాయుగుండంగా మారుతుంది. 23న తుఫాన్‌గా మారే ఛాన్స్ ఉంది. వాయవ్య దిశగా పయనించి 24న ఒడిశా-బెంగాల్ తీరాలను ఆనుకొని వాయవ్య బంగాళాఖాతానికి చేరుకుంటుంది. దీని ప్రభావంతో 24, 25న ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది’ అని తెలిపింది.
ఈమధ్య కొందరు గర్భధారణకు దగ్గు, జలుబు మందులు వాడుతుండటంతో ‘ముసినెక్స్ మెథడ్’ SMలో ట్రెండవుతోంది. 40జంటలపై సైంటిస్టులు అధ్యయనం చేస్తే వారిలో 15మంది గర్భం దాల్చారు. ఈ మెథడ్‌తో ఓ పురుషుడిలోనూ స్పెర్మ్ క్వాంటిటీ పెరిగినట్లు తేలిందని ఫెర్టిలిటీ అండ్ స్టెరిలిటీ జర్నల్ ప్రచురించింది. కాగా ఈ మెథడ్ సంతానోత్పత్తికి సహాయపడగలదని రుజువు చేసే శాస్త్రీయ ఆధారాలు చాలా తక్కువని సైంటిస్టులు చెబుతున్నారు.
AP: సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ స్కీమ్ కింద అర్హులకు ఏడాదికి మూడు సిలిండర్లు ఫ్రీగా అందిస్తామని పేర్కొన్నారు. పథకం అమలుకు ఏడాదికి రూ.3,000కోట్ల ఖర్చు అవుతుందని, తదుపరి క్యాబినెట్ భేటీలో దీనికి ఆమోదం తెలపనున్నట్లు వెల్లడించారు.
తేదీలు మాయమవడం ఏంటని అనుకుంటున్నారా? గూగుల్‌లో 1582 నాటి క్యాలెండర్‌ను ఓ సారి చెక్ చేయండి. అక్టోబర్ నెలలో 5 నుంచి 14 వరకు తేదీలు కనపించవు. అప్పటివరకు సోలార్ క్యాలెండర్‌ను బేస్ చేసుకొని రూపొందించిన జూలియన్ క్యాలెండరే చాలా దేశాలు అనుసరించేవి. 1582లో గ్రెగోరియన్ క్యాలెండర్ అందుబాటులోకి రావడంతో 10 రోజులు ముందుకు వెళ్లాల్సి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికీ అదే క్యాలెండర్‌ను అనుసరిస్తున్నాం.
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో టీమ్‌ఇండియా ఓటమికి రోహిత్ శర్మ కెప్టెన్సీనే కారణమని పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు. పిచ్‌ను ఆయన సరిగా అంచనా వేయలేదని, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని పొరపాటు చేశారని అంటున్నారు. NZ సెకండ్ ఇన్నింగ్స్ సమయంలోనూ బౌలర్లను సరిగా వినియోగించుకోలేదని, అశ్విన్‌కు చివర్లో బౌలింగ్ ఇచ్చారని పేర్కొంటున్నారు. ‘CLUELESS CAPTAIN ROHIT’ అని Xలో ట్రెండ్ చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.