news

News October 20, 2024

ఢిల్లీ ఒకప్పటి ముంబైలా తయారైంది: ఢిల్లీ సీఎం

image

రోహిణి ప్రాంతంలోని స్కూల్ బయట బాంబు పేలుడు జరగడంపై ఢిల్లీ సీఎం ఆతిశీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘నగరం పరిస్థితి 90వ దశకంలో ముంబైలా తయారైంది. ఇక్కడి శాంతి భద్రతలు కేంద్రం చేతిలోనే ఉన్నాయి. కానీ ఆ పని వదిలేసి మా ప్రభుత్వాన్ని అడ్డుకోవడంపై దృష్టి పెడుతోంది. సిటీలో ఇష్టానుసారం తూటాలు పేలుతున్నాయి. బ్లాక్‌మెయిల్స్, నేరాలు ఘోరంగా పెరిగిపోయాయి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

News October 20, 2024

MH: MLA అభ్యర్థుల జాబితా విడుదల చేసిన BJP

image

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేేసే అభ్యర్థుల జాబితాను BJP విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలుండగా 99 మందితో ఫస్ట్ లిస్టును రిలీజ్ చేసింది. ఆ పార్టీ నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ నుంచి బరిలో నిలిచారు. కాగా నవంబర్ 20న పోలింగ్ జరగాల్సి ఉంది.

News October 20, 2024

రేపు విజయనగరం జిల్లాలో పవన్ పర్యటన

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో పర్యటించనున్నారు. గుర్లలో అతిసారం ప్రబలిన నేపథ్యంలో ఆ గ్రామానికి వెళ్లి అక్కడి పరిస్థితులపై సమీక్షించనున్నారు. వ్యాధి అదుపులోకి వచ్చే వరకూ గుర్లలో ప్రత్యేక వైద్య శిబిరం కొనసాగుతోందని డీఎంహెచ్‌వో భాస్కరరావు తెలిపారు. భూగర్భ జలాలు కలుషితం కావడం వల్లే వ్యాధి సోకినట్టు ప్రాథమికంగా నిర్ధారించామని పేర్కొన్నారు.

News October 20, 2024

ఇదేమి రాజ్యం చంద్రబాబు గారూ?: జగన్

image

AP: కూటమి ప్రభుత్వంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. పోలీసులు, ప్రభుత్వ వైఫల్యమే బద్వేల్ ఘటనకు కారణమని ఆరోపించారు. నిత్యం ఏదోచోట అత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయని, ఇదేమి రాజ్యం చంద్రబాబు గారూ అని ప్రశ్నించారు. తాము తీసుకొచ్చిన ‘దిశ’ యాప్‌ను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారని, ఇప్పుడు దాని ప్రాధాన్యం తెలుస్తోందని జగన్ అన్నారు.

News October 20, 2024

ప్రాక్టీస్ మొదలుపెట్టిన గిల్

image

న్యూజిలాండ్‌ చేతిలో తొలి టెస్టు ఓటమి అనంతరం టీమ్ ఇండియా బ్యాటర్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. చిన్న గాయం వల్ల అతడు ఈ టెస్టు ఆడలేదు. అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. దీంతో 2వ టెస్టులో గిల్‌ను జట్టులోకి తీసుకునేందుకు ఎవరిని తొలగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అటు KL.రాహుల్ 2 ఇన్నింగ్సుల్లోనూ ఫెయిల్ కావడంతో అందరి వేళ్లు అతడివైపే చూపిస్తున్నాయి.

News October 20, 2024

APPLY NOW: 732 ఉద్యోగాలకు రేపే లాస్ట్

image

తెలంగాణ వైద్యారోగ్య శాఖ ప్రకటించిన 732 ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 పోస్టులకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. ఫార్మసీ పూర్తిచేయడంతో పాటు రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నవారు అప్లికేషన్‌కు అర్హులు. వయసు ఈ ఏడాది జులై నాటికి 46 ఏళ్లకు మించరాదు. అభ్యర్థులు <>mhsrb.telangana.gov.in<<>> వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 30న ఫార్మాసిస్ట్ పరీక్ష జరగనుంది.

News October 20, 2024

VIRAL: కస్టమర్లకు క్యాబ్ డ్రైవర్ హెచ్చరిక

image

కారులోనే కస్టమర్లు రొమాన్స్ చేసుకుంటూ ఇబ్బంది కలిగిస్తుండటంతో ఓ క్యాబ్ డ్రైవర్ విసిగిపోయాడు. ఇలాంటివి పునరావృతం అవ్వకుండా ఉండేందుకు క్యాబ్‌లో ఓ పోస్టర్‌ను ఏర్పాటు చేశాడు. ‘హెచ్చరిక.. క్యాబ్‌లో రొమాన్స్ చేయకండి. ఇదేమీ మీ ప్రైవేటు ప్లేస్ కాదు. ఓయో రూమ్ అంతకన్నా కాదు. కాబట్టి కారులో డిస్టెన్స్ మెయింటేన్ చేస్తూ సైలెంట్‌గా ఉండండి’ అని అందులో రాసుకొచ్చాడు.

News October 20, 2024

మహిళా నిర్మాతలపై పోక్సో కేసు

image

సీరియల్స్, వెబ్ సిరీస్‌లు నిర్మించే ‘బాలాజీ టెలీఫిలిమ్స్’ నిర్మాతలు శోభా కపూర్, ఏక్తా కపూర్‌పై ముంబై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ‘ఆల్ట్ బాలాజీ’ సంస్థ నిర్మాణంలో వీరు ‘ఏ’ రేటెడ్ వెబ్‌సిరీస్‌లను రూపొందిస్తున్నారు. 2021లో స్ట్రీమ్ అయిన ‘గందీ బాత్’ అనే సిరీస్‌లో బాలికల్ని అశ్లీలంగా చూపించారంటూ వారిపై అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలోనే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News October 20, 2024

CSKలో సాధన టెస్టుల్లో ఉపయోగపడింది: రచిన్

image

బెంగళూరు మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఉన్న సమయంలో చేసిన సాధన, భారత పరిస్థితులకు అలవాటు పడేందుకు ఉపకరించిందని ఆయన మ్యాచ్ అనంతరం తెలిపారు. ‘CSKలో ఉన్నప్పుడు వివిధ రకాల పిచ్‌లపై సాధన చేసేవాడిని. విభిన్నమైన నెట్ బౌలర్లు అందుబాటులో ఉండేవారు. ఆ సాధన నాకు ఉప ఖండపు పిచ్‌లపై ఎలా ఆడాలో నేర్పించింది’ అని వివరించారు.

News October 20, 2024

ఆప్కో షోరూమ్స్@ ఆన్‌లైన్ అమ్మకాలు

image

AP: ఆప్కో షోరూముల్లో ఆన్‌లైన్ అమ్మకాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. విజయవాడలోని 3 షోరూముల్లోని వస్త్రాలను పైలట్ ప్రాజెక్టు కింద తొలుత ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. ఆ తర్వాత రాష్ట్రంలోని మిగతా షోరూములను అందుబాటులోకి తెస్తారు. ఇందుకోసం పలు కొరియర్ సంస్థలతో చర్చలు జరిపారు. తక్కువ దూరమైతే ఉచితంగానే అందించే ఛాన్సుంది.

error: Content is protected !!