India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వయనాడ్ MP స్థానంలో ప్రియాంకా గాంధీ(INC)పై BJP నుంచి <<14401386>>నవ్యా హరిదాస్(39)<<>> పోటీ చేయనున్నారు. బీటెక్ పూర్తిచేసిన ఈమె రాజకీయాలపై ఆసక్తితో BJPలో చేరారు. కోజికోడ్ కార్పొరేషన్‌లో 2సార్లు కౌన్సిలర్‌గా గెలిచారు. 2021లో కోజికోడ్ సౌత్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. ఇప్పుడు MPకి పోటీ చేసే అవకాశాన్ని అధిష్ఠానం కల్పించింది. ఈమె భర్త శోభిన్ శ్యామ్ మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.
AP: బద్వేల్ ఘటనలో యువతి <<14403526>>చనిపోవడంపై <<>>సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థి ఒక దుర్మార్గుడి దుశ్చర్యకు బలికావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ‘విచారణ పూర్తి చేసి, నిందితుడికి మరణశిక్ష పడేలా చేయాలి. మహిళలు, ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేసేవారికి ఈ ఘటనలో పడే శిక్ష ఒక హెచ్చరికలా ఉండాలి. ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ విధానంలో కేసు విచారణ పూర్తి చేయాలి’ అని ఆయన అధికారులను ఆదేశించారు.
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి సరోజా సంజీవ్ కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా ఆమె వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. తన తల్లి అంటే తనకెంతో ఇష్టమని బిగ్‌బాస్, ఇతర ఇంటర్వ్యూలు & వేదికలపై ఆయన చెప్తుండేవారు. ‘ఈగ’, విక్రాంత్ రోణ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
AP: తిరుమల వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను అమ్ముకున్నట్లు ఓ భక్తుడు చేసిన ఫిర్యాదుతో వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ సిఫార్సు లేఖలతో 6 టికెట్లను రూ.65వేలకు అమ్ముకున్నట్లు బెంగళూరుకు చెందిన సాయికుమార్ ఆరోపించారు. అయితే తాను టీడీపీలో చేరుతుండటంతో వైసీపీ నేతలే కుట్ర చేశారని జకియా ఖానమ్ విమర్శించారు. మైనార్టీ మహిళలకు ఆ పార్టీలో గౌరవం లేదన్నారు.
TG: చట్టపరమైన అనుమతులున్న వెంచర్లు, భవనాల విషయంలో ఎలాంటి భయం అవసరం లేదని హైడ్రా పేర్కొంది. చెరువుల వద్ద అనుమతులున్న నిర్మాణాలను కూల్చివేస్తారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. అన్ని పర్మిషన్లు ఉన్న నిర్మాణాలను కూల్చివేయబోమన్న సీఎం ఆదేశాలకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కిక్కిచ్చే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పవన్ కుమారుడు అకీరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సుజీత్ తెరకెక్కిస్తోన్న ‘OG’ సినిమా ద్వారా ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. అకీరా తన తండ్రితో కలిసి నటించనున్నారని తెలియడంతో అభిమానులు ఈ విషయాన్ని నెట్టింట షేర్ చేస్తున్నారు.
AP: వైఎస్సార్ జిల్లాలో ఉన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించడంతో బాలిక <<14403526>>మరణించడం<<>> దిగ్భ్రాంతికి గురిచేసిందని హోంమంత్రి అనిత చెప్పారు. విద్యార్థినిపై దాడి అనంతర దృశ్యాలు, పరిస్థితులు తీవ్రంగా కలచివేశాయన్నారు. నిందితుడు విఘ్నేశ్, అతనికి సహకరించిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. బాధితురాలి కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
TG: హైదరాబాద్ అశోక్‌నగర్‌లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయాలని, జీవో 29ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు రోడ్డెక్కారు. వారికి మద్దతుగా ప్రతిపక్ష నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా రేపటి నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.
AP: ఎమ్మెల్యేల పనితీరుని పర్యవేక్షించడానికి పంచ సభ్య కమిటీ వేస్తున్నట్లు CM చంద్రబాబు ప్రకటించినట్లు తెలుస్తోంది. ‘MLAలు చేస్తున్న తప్పులను ఈ కమిటీ గమనిస్తుంటుంది. పంచ సభ్య కమిటీ చెప్పిన తర్వాత కూడా తీరు మారకపోతే నేను పిలవాల్సి ఉంటుంది. అయినా మార్పు రాకపోతే తీవ్ర చర్యలు ఉంటాయి. కొత్త ఎమ్మెల్యేలు, సీనియర్లు అందరికీ ఇది వర్తిస్తుంది’ అని నేతలతో సమావేశంలో CBN చెప్పినట్లు సమాచారం.
AP: ఉన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో యువతి(17) <<14403526>>మృతి <<>>చెందడంపై YCP మండిపడింది. ‘చంద్రబాబు చేతకాని పాలనకి మరో యువతి బలైపోయింది. బద్వేలులో ఇంటర్ విద్యార్థినిపై శనివారం అత్యాచారం చేసి, పెట్రోల్ పోసి విఘ్నేశ్ అనే వివాహితుడు నిప్పంటించి పరారయ్యాడు. ఇవాళ ఆ అమ్మాయి మృతి చెందింది. APలో కామాంధులు ఇష్టారీతిన రెచ్చిపోతుంటే.. సీఎం చంద్రబాబు, హోంమంత్రి, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?’ అని ప్రశ్నించింది.
Sorry, no posts matched your criteria.