India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: నిన్న గ్రూప్-1 అభ్యర్థులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్న బండి సంజయ్ పాత రోజులను గుర్తు చేశారు. తాను కేంద్ర హోంశాఖ సహాయమంత్రిని అన్న విషయాన్ని పక్కనపెట్టి రోడ్డుపై ఒకప్పటి రాష్ట్ర BJP అధ్యక్షుడిలా బైఠాయించారు. విద్యార్థులపై లాఠీఛార్జ్‌ను నిరసిస్తూ ‘ఛలో సెక్రటేరియట్’కు పిలుపునివ్వగా, పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత GO 29 రద్దు చేయాలని, గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేశారు.
TG: కొందరు వాహనదారులు తమ పాత వాహనాల నంబర్ ప్లేట్లపై TSతో ఉన్న అక్షరాలను తొలగించి TGగా మార్చేస్తున్నారు. దీనిపై రవాణా శాఖ అధికారులు స్పందించారు. ‘TG సిరీస్ అమల్లోకి వచ్చిన తర్వాత కొన్న వాహనాలకు మాత్రమే ఆ కోడ్ వర్తిస్తుంది. TS ఉన్న వాళ్లకు TGగా మారదు. ఎవరైనా సొంతంగా నంబర్ ప్లేట్‌పై స్టేట్ కోడ్ మారిస్తే ట్యాంపరింగ్‌గా భావించి నేరంగా పరిగణిస్తాం. అలాంటి వారిపై చర్యలు ఉంటాయి’ అని హెచ్చరించారు.
నేపాల్, యూఎస్ఏ మధ్య జరిగిన రెండో టీ20 ఊహించని మలుపులు తిరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది. ఛేదనలో యూఎస్ఏ 170 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. ఈ క్రమంలో సూపర్ ఓవర్లో USA 2 పరుగులు చేయగా నేపాల్ నాలుగు బంతుల్లోనే విజయాన్ని సొంతం చేసుకుంది.
AP: తమను రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్ట్ లెక్చరర్ల JAC రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కాలేజీల్లో దాదాపు 5వేల మంది ఉద్యోగులు క్రమబద్ధీకరణకు అర్హులని పేర్కొంది. ఎన్నికల కోడ్‌తో నిలిచిన క్రమబద్ధీకరణ ప్రక్రియను కూటమి ప్రభుత్వం పూర్తి చేయాలని విన్నవించింది. ఎన్నికల ప్రచారంలో తమకు న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తుచేసింది.
వర్షం కారణంగా ఇండియా, న్యూజీలాండ్ మ్యాచ్ ఆలస్యమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం చిన్నస్వామి స్టేడియం వద్ద వర్షం నిలిచిపోవడంతో మ్యాచ్‌ను 10.15 గంటలకు స్టార్ట్ చేయనున్నారు. తొలి సెషన్ 10.15 నుంచి 12.30 వరకు జరగనుంది. 12.30-1.10 వరకు లంచ్ బ్రేక్ ఉండనుండగా తిరిగి 1.10కి సెకండ్ సెషన్, 3.30కి మూడో సెషన్ జరగనుంది. ఈరోజు మొత్తం 91 ఓవర్లు ఆడనున్నారు.
రాజస్థాన్‌లోని ధోల్‌పుర్ హైవేపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిన్న అర్ధరాత్రి టెంపోను స్లీపర్ బస్సు ఢీకొన్న ఘటనలో 12 మంది మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని మృతుల బంధువులు ఆరోపించారు. వీరంతా వివాహ వేడుకకు హాజరై వస్తున్నట్లు తెలిపారు. బస్సు వేగానికి ఆటో నుజ్జునుజ్జయింది.
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. నిన్న రాత్రి ఉత్తర గాజాపై జరిపిన దాడుల్లో 73 మంది మరణించినట్లు హమాస్ సంస్థ పేర్కొంది. వీరిలో చిన్నారులు, మహిళలు ఉన్నట్లు తెలిపింది. అయితే మరణాల సంఖ్యపై క్లారిటీ లేదని ఇజ్రాయెల్ పేర్కొంది. తాము హమాస్ ఉగ్రవాదులనే లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడినట్లు స్పష్టం చేసింది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటి సమీపంలో డ్రోన్ దాడి కలకలం రేపింది.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని, దీనికి ఆ పార్టీలోని అంతర్గత సమస్యలే కారణమవుతాయని కేంద్ర మంత్రి కుమారస్వామి జోస్యం చెప్పారు. 2028లోపు తాను మళ్లీ సీఎం పీఠం ఎక్కడం ఖాయమన్నారు. తానేమీ జ్యోతిషుడిని కాకపోయినా ఈ మాట కచ్చితంగా చెబుతున్నానని పేర్కొన్నారు. ఈసారైనా ఐదేళ్లు సీఎం పదవిలో ఉండే అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈయన FEB 2006-OCT 2007, మే 2018- జులై 2019 మధ్య రెండుసార్లు CMగా పనిచేశారు.
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ‘వార్-2’. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు తెలుగులో ‘యుద్ధ భూమి’ టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇదే పేరును చిత్రయూనిట్ రిజిస్టర్ చేయించినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
AP: రాష్ట్రంలో బీ ఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో సీట్ల భర్తీకి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది. దీంతో ఫార్మసీ విద్యా సంస్థల్లో సీట్ల భర్తీకి ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 92 విద్యాసంస్థల్లో సీట్లను భర్తీ చేసేందుకు సాంకేతిక విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేయనుంది. కాగా రాష్ట్రంలో సుమారు 12 వేల ఫార్మా సీట్లు అందుబాటులో ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.