news

News October 19, 2024

గ్రూప్-1పై రేపు ప్రభుత్వం కీలక ప్రకటన?

image

TG: గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లపై రాష్ట్ర మంత్రులు చర్చిస్తున్నారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు, జీవో 29 తదితర అంశాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం రేపు కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

News October 19, 2024

రేపు బెంగళూరులో వర్షం వస్తుందా..?

image

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో గట్టెక్కడం భారత్‌కు దాదాపు అసాధ్యమే. కివీస్ విజయలక్ష్యం కేవలం 107 పరుగులు మాత్రమే. ఈ నేపథ్యంలో వరుణుడు ఎంటర్ అయితేనే టీమ్ ఇండియా కనీసం డ్రాతో బయటపడేందుకు అవకాశం ఉంటుంది. ఆక్యువెదర్ అంచనాల ప్రకారం రేపు 30 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడుతుంది. మరి 107 రన్స్‌ను NZ ఛేజ్ చేస్తుందా లేక టీమ్ ఇండియా బౌలింగ్‌తో ఏమైనా అద్భుతం సృష్టించగలదా అన్నది చూడాలి మరి.

News October 19, 2024

ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసిన నిందితుడు అరెస్ట్

image

AP: YSR జిల్లా బద్వేల్ <<14399353>>ఘటనలో <<>>పోలీసులు పురోగతి సాధించారు. ఇంటర్ చదువుతున్న అమ్మాయిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన విఘ్నేశ్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విఘ్నేశ్ కొన్నేళ్లుగా ప్రేమ పేరుతో తన కూతురిని వేధిస్తున్నాడని బాధితురాలి పేరెంట్స్ తెలిపారు.

News October 19, 2024

రైతుల జీవితాలను మారుస్తోన్న బాలిక

image

వ్యవసాయం గురించి పూర్తిగా తెలియని వయసులోనూ విత్తనాలను భద్రపరుస్తున్నారు 8వ తరగతి చదివే హర్షిత ప్రియదర్శిని. ఒడిశాలోని కోరపట్‌లో నివసించే ఈ ‘సీడ్ గర్ల్’.. 2023లో సీడ్ బ్యాంక్‌ను స్టార్ట్ చేశారు. ఇందులో 180 రకాల వరి, 80 రకాల మిల్లెట్స్‌ను భద్రపరిచారు. ప్రతి రకాన్ని 250gms లేదా 100gms సేకరిస్తూ రైతులకు ఉచితంగా సీడ్స్ ఇస్తున్నారు. పద్మశ్రీ కమలా పూజారి నుంచి ప్రేరణ పొందినట్లు హర్షిత తెలిపారు.

News October 19, 2024

APPLY NOW.. 8,113 ఉద్యోగాలు

image

రైల్వేలో 8,113(గూడ్స్ ట్రైన్ మేనేజర్-3144, టికెట్ సూపర్ వైజర్-1736, టైపిస్ట్-1507, స్టేషన్ మాస్టర్-994, సీనియర్ క్లర్క్-732) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ రేపటితో ముగియనుంది. డిగ్రీ అర్హతతో 18-36 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేయవచ్చు. రిజర్వేషన్ బట్టి వయోసడలింపు ఉంటుంది. SCRలో 478, ECoRలో 758 పోస్టులున్నాయి. ఫీజు: రూ.500(ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైతే రూ.400 రీఫండ్). మరిన్ని వివరాలకు <>క్లిక్ <<>>చేయండి.

News October 19, 2024

INDvsPAK: భారత్ స్కోర్ ఎంతంటే?

image

ఏసీసీ మెన్స్ టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2024లో భాగంగా పాక్-Aతో మ్యాచులో ఇండియా-A 183/8 స్కోర్ చేసింది. భారత బ్యాటర్లలో తిలక్ వర్మ 44, ప్రభ్‌సిమ్రాన్ 36, అభిషేక్ 35, వధేరా 25 రన్స్ చేశారు. ఈ మ్యాచులో పాక్ గెలవాలంటే 20 ఓవర్లలో 184 రన్స్ చేయాలి.

News October 19, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

APలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, గోదావరి జిల్లాల్లో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. TGలోనూ పలు జిల్లాల్లో రేపు మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణశాఖ పేర్కొంది.

News October 19, 2024

వయనాడ్ బీజేపీ అభ్యర్థిగా నవ్య హరిదాస్

image

కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నికకు బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. నవ్య హరిదాస్ పేరును ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ స్థానానికి కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. వయనాడ్ ఎంపీ అభ్యర్థితో పాటు అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్‌లో జరిగే అసెంబ్లీ ఉపఎన్నికలకూ బీజేపీ తమ అభ్యర్థుల పేర్లను వెల్లడించింది.

News October 19, 2024

శోభితతో నాగచైతన్య.. కొత్త ఫొటో వైరల్

image

నటి శోభితతో కలిసి తీసుకున్న ఓ ఫొటోను హీరో అక్కినేని నాగచైతన్య తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘Everything everywhere all at once’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఏడాది ఆగస్టులో వీరి ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చైతూ ‘తండేల్’ సినిమాతో బిజీగా ఉన్నారు. చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నారు. రిలీజ్ డేట్‌పై ప్రకటన రావాల్సి ఉంది.

News October 19, 2024

‘OG’ కవర్ పిక్ చూశారా?

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘OG’ నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. ఫ్యాన్స్ కోసం మేకర్స్ తాజాగా కవర్ పిక్‌ను రిలీజ్ చేశారు. ‘ఈ వీధులు మళ్లీ ఎప్పుడూ ఇలా ఉండవు’ అని క్యాప్షన్ ఇచ్చారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మి తదితరులు నటిస్తున్నారు.

error: Content is protected !!