India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ఉచిత ఇసుకపై సీఎం చంద్రబాబు మరో కీలక ప్రకటన చేశారు. సీనరేజ్ ఛార్జ్ వసూళ్లు కూడా ఎత్తివేస్తున్నట్లు చెప్పారు. లారీల్లో 40 టన్నులకు మించి ఉన్నా అధిక లోడ్ జరిమానాలు ఉండవని స్పష్టం చేశారు. టీడీపీ ప్రజాప్రతినిధుల భేటీలో సీఎం ఈమేరకు ప్రకటించారు. కాగా ఇప్పటికే రీచ్‌ల నుంచి ట్రాక్టర్లలో ఉచితంగా ఇసుక తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఇవాళ సాయంత్రం <<14392031>>అనుమతి<<>> ఇచ్చింది.
తమ దేశంలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనేలా చేయడానికి PCB శతవిధాలా ప్రయత్నిస్తోంది. తాజాగా BCCI ముందు కొత్త ప్రతిపాదన పెట్టింది. పాక్‌లో ఉండటానికి భద్రతాపరమైన కారణాలు అడ్డొస్తున్నాయనుకుంటే IND ఆడే ప్రతి మ్యాచ్ తర్వాత తిరిగి చండీగఢ్ లేదా ఢిల్లీకి వెళ్లిపోవచ్చని చెప్పినట్లు cricbuzz తెలిపింది. కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ పాక్ వెళ్లేది లేదని అంటున్న BCCI, PCB ప్రతిపాదనపై ఎలా స్పందిస్తుందో?
ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతులపై ఆంక్షలు విధించాలని కేంద్రం యోచిస్తోందని రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. ఆ కథనం ప్రకారం.. భారత్‌లోనే కంప్యూటర్ల తయారీని ప్రోత్సహించాలని కేంద్రం భావిస్తోంది. దేశంలో ఉత్పత్తిని పెంచాలని భావిస్తోంది. మరోవైపు ఈ నిర్ణయం వల్ల భారత ఐటీ హార్డ్‌వేర్ పరిశ్రమ ఇబ్బంది పడొచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దిగుమతులపైనే హార్డ్‌వేర్ పరిశ్రమ ప్రధానంగా ఆధారపడింది.
TG: స్థానిక సంస్థల్లో కల్పించాల్సిన రిజర్వేషన్లను ఖరారు చేయడంపై BC కమిషన్ ప్రజల నుంచి అభ్యర్థనలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరిస్తోంది. ఈ నెల 28న ADB, 29న NZB, 30న SRD, నవంబర్ 1న KRMR, 2న WGL, 4న NLG, 5న ఖమ్మం, 7న RR, 8న MBNR, 11న HYDలో జిల్లా కలెక్టరేట్/ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల్లో విచారణలు చేయనుంది. నవంబర్ 11న ప్రత్యేకంగా NGOలు, సంస్థలు మరియు కుల/సంక్షేమ సంఘాలతో భేటీ కానుంది.
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ జీవితంపై వెబ్ సిరీస్ తీయనున్నట్లు నోయిడాకు చెందిన వ్యాపారవేత్త అమిత్ జానీ ప్రకటించారు. దానికి ‘లారెన్స్-ఎ గ్యాంగ్‌స్టర్ స్టోరీ’ అని టైటిల్ పెట్టినట్లు తెలిపారు. దీనికి భారత చలనచిత్ర సంఘం నుంచి అనుమతి కూడా తీసుకున్నామని, ఫైర్ ఫాక్స్ ఫిల్మ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కిస్తామని పేర్కొన్నారు. దీపావళి అనంతరం పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు స్పష్టం చేశారు.
బిగ్ బాస్-8 కంటెస్టెంట్, ఆర్జే శేఖర్ బాషాను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూట్యూబర్ హర్షసాయి బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ఆయనను 3 గంటలుగా ప్రశ్నిస్తున్నారు. శేఖర్ బాషా తనపై నిరాధార ఆరోపణలు చేశారని బాధితురాలు పేర్కొన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
AP: రీచ్‌ల నుంచి ట్రాక్టర్లలో ఉచితంగా ఇసుక తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం, స్థానిక అవసరాలకు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో ఇసుక తీసుకెళ్లవచ్చని పేర్కొంది. గతంలో రీచ్‌ల నుంచి ఇసుక తీసుకెళ్లేందుకు ఎడ్లబండ్లకు మాత్రమే అనుమతి ఉండగా, తాజాగా ట్రాక్టర్లకూ వర్తింపచేసింది. పలుచోట్ల ట్రాక్టర్లపై పోలీసులు కేసులు నమోదు చేస్తుండటంతో ప్రభుత్వం తాజాగా GO ఇచ్చింది.
AP: ఈ నెల 26వ తేదీ నుంచి TDP సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు CM చంద్రబాబు తెలిపారు. గతంలో మాదిరి రూ.100 కట్టినవారికి సాధారణ సభ్యత్వం కల్పిస్తామని, ₹లక్ష కట్టిన వారికి శాశ్వత సభ్యత్వం ఇస్తామని వెల్లడించారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ₹5లక్షల ప్రమాద బీమా కల్పిస్తామని, చనిపోయిన కార్యకర్తకు మట్టి ఖర్చుల కింద అదనంగా ₹10వేలు ఇస్తామని ఆ పార్టీ MLA, MP, MLCలతో జరిగిన భేటీలో వెల్లడించారు.
సావర్కర్, ఎంఎస్ గోల్వాల్కర్ ఇద్దరూ రాజ్యాంగాన్ని వ్యతిరేకించారని కర్ణాటక సీఎం సిద్దరామయ్య రాష్ట్ర పీసీసీ కార్యాలయంలో వ్యాఖ్యానించారు. ‘రాజ్యాంగాన్ని గౌరవించకుండా గోల్వాల్కర్ 3 దశాబ్దాల పాటు ఆర్ఎస్ఎస్‌ను నడిపారు. మహాత్మాగాంధీ హత్య కేసు నిందితుల్లో సావర్కర్ కూడా ఒకరు. వీరిద్దరూ రాజ్యాంగంలోని ప్రతి పేజీని తీవ్రంగా వ్యతిరేకించారు. వారి గురించి అందరూ తెలుసుకోవాలి’ అని పేర్కొన్నారు.
AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, మన్యం, అల్లూరి, తూ.గో, ప.గో, ఏలూరు, NTR, గుంటూరు, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వాన కురవొచ్చని పేర్కొంది. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షం కురుస్తుందని వెల్లడించింది.
Sorry, no posts matched your criteria.