news

News March 1, 2025

100 రోజుల్లోపే శిక్ష పడేలా పనిచేయాలి: హోంమంత్రి అనిత

image

AP: నేరం చేసిన వంద రోజుల్లోపే శిక్షలు పడేలా పనిచేయాలని ట్రైనింగ్ పూర్తి చేసుకున్న SIలకు హోంమంత్రి అనిత సూచించారు. నిజాయితీగా ప్రజల రక్షణకు ముందుకెళ్లాలన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సైల పాసింగ్ పరేడ్‌లో ఆమె పాల్గొన్నారు. మొత్తం 395 మంది ఎస్సైలుగా శిక్షణ పూర్తి చేసుకోగా వీరిలో 97 మంది మహిళలు ఉన్నారు. మహిళలు ఇంత సంఖ్యలో ఉండటం గర్వకారణమని అన్నారు. ఈ పరేడ్‌కు డీజీపీ హరీశ్ గుప్తా హాజరయ్యారు.

News March 1, 2025

జెలెన్‌స్కీ కోసం ట్రంప్‌ను ఎదిరించే సీన్ EUకు ఉందా?

image

పీస్‌డీల్ తిరస్కరించిన జెలెన్‌స్కీకి EU మద్దతు ప్రకటించింది. దానికి ట్రంప్‌ను ధిక్కరించే సీనుందా? అంటే కష్టమే అంటున్నారు విశ్లేషకులు. కూటమిలో సగం దేశాలకు యుద్ధమే ఇష్టం లేదు. గ్యాస్, ఆయిల్ కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. జర్మనీలో కల్లోలం, ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్నాయి. UK పరిస్థితి దారుణం. NATO, UN నుంచి వైదొలగుతానన్న ట్రంప్ వేసే టారిఫ్స్‌ను వారు తట్టుకొనే స్థితిలో లేనే లేరన్నది అసలు నిజం.

News March 1, 2025

ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో అరెస్టు!

image

AP: పోసాని కృష్ణమురళికి మరో షాక్ ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఒక కేసులో అరెస్టై, 14 రోజుల రిమాండ్‌లో ఉన్నారు. దీనిపై ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సోమవారం కోర్టులో విచారణ జరగనుంది. అయితే పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా 14 కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో బెయిల్ దొరికితే మరో కేసులో అరెస్టు చేయడానికి పోలీసులు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

News March 1, 2025

మరోసారి తండ్రైన మస్క్.. మొత్తం 14 మంది పిల్లలు

image

అపరకుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి తండ్రయ్యారు. తన ప్రేయసి, న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ శివోన్ జిలిస్‌ నాల్గో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ 14వ సంతానానికి సెల్డన్ లైకుర్గస్ అనే పేరు పెట్టినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. కాగా, మొదటి భార్య జస్టిన్ విల్సన్‌తో ఆరుగురు, మాజీ లవర్ గ్రిమ్స్‌తో ముగ్గురు, రచయిత ఆష్లే సెయింట్‌తో ఒక్కరు, శివోన్ జిలిస్‌తో నలుగురు పిల్లలు ఉన్నారు.

News March 1, 2025

కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెండ్

image

TG: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఇటీవల బీసీ సభలో ఓ వర్గంపై మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు హైకమాండ్ గుర్తించింది. ఆ వ్యాఖ్యలపై ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వాలని FEB 5న షోకాజ్ నోటీసులు ఇచ్చింది. మల్లన్న స్పందించకపోవడంతో పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.

News March 1, 2025

డిప్యూటీ సీఎంగా విజయ్? ప్రశాంత్ కిశోర్ స్ట్రాటజీ

image

టీవీకే అధినేత విజయ్‌తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్ కీలక చర్చలు జరిపారు. రానున్న ఎన్నికల్లో AIDMKతో పొత్తు ఉంటే బాగుంటుందని తెలిపారు. సీఎంగా పళనిస్వామి, డిప్యూటీగా విజయ్ ఉండాలన్నారు. ఈ ఫార్ములాతోనే APలో ఎన్డీయే కూటమి విజయం సాధించిందన్నారు. ఏఐడీఎంకేకు 25శాతం ఓటుబ్యాంకు ఉందని, టీవీకేకు 20 శాతం రావచ్చని అంచనా వేశారు. ఈ రెండు పార్టీలు కలిసి పోటీచేస్తే ప్రభుత్వ ఏర్పాటు సులభమన్నారు.

News March 1, 2025

ఫస్ట్ షోరూమ్‌ను టెస్లా ఎక్కడ ఓపెన్ చేస్తోందంటే..

image

భారత్‌కు టెస్లా మరింత చేరువైంది. ముంబై బాంద్రాకుర్లా కాంప్లెక్స్‌లో షోరూమ్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసింది. ఓ కమర్షియల్ కాంప్లెక్సులోని అండర్‌గ్రౌండులో 4000 sft స్పేస్‌ను ఐదేళ్లు లీజుకు తీసుకుంది. ఒక sftకి రూ.900 చొప్పున నెలకు ₹35లక్షల రెంటు చెల్లించనుంది. రెండో షోరూమ్‌ను ఢిల్లీలోని ఏరోసిటీ కాంప్లెక్స్‌లో ఆరంభిస్తుందని సమాచారం. టెస్లా ఇప్పటికే ఉద్యోగుల హైరింగ్ ప్రాసెస్ చేపట్టడం గమనార్హం.

News March 1, 2025

అలాగైతే.. TDP వాళ్లంతా జైల్లో ఉండేవారు: అమర్నాథ్

image

AP: అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిని అరెస్ట్ చేసినట్లు TDP చెబుతోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. YCP అధికారంలో ఉన్నప్పుడు TDP వారు తమపై చేసిన వ్యాఖ్యలను పట్టించుకొని ఉంటే, వాళ్లంతా జైల్లో ఉండేవారని చెప్పారు. కేసులకు భయపడి వైసీపీ నేతలు ఇంట్లో కూర్చునే పరిస్థితి లేదన్నారు. ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు కక్ష సాధింపులపై కాకుండా పరిపాలన మీద, హామీల అమలుపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.

News March 1, 2025

మీ జీతం కూడా ఇండియా వల్లే: సునీల్ గవాస్కర్

image

దుబాయ్‌లో ఆడటం భారత్‌కు కలిసివచ్చిందన్న ఇంగ్లండ్ మాజీల వ్యాఖ్యలను సునీల్ గవస్కర్ తిప్పికొట్టారు. ఓటమి అక్కసు తమ టీమ్‌పై చూపకూడదన్నారు. భద్రతాలోపాలతోనే దుబాయ్‌లో ఆడుతున్నట్లు బీసీసీఐ ముందే ప్రకటించిందన్నారు. ఐసీసీకి భారత్ ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తోందని, మీడియా హక్కుల ద్వారా ఆదాయం వస్తుందని చెప్పారు. వారికొచ్చే జీతం కూడా పరోక్షంగా(నాజర్ హుస్సేన్, మైక్ అథర్టన్) భారత్ ద్వారానే అందుతుందన్నారు.

News March 1, 2025

ఆశా వర్కర్లకు CM గుడ్ న్యూస్

image

ఏపీలోని 42వేల మంది ఆశా వర్కర్లకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. మొదటి 2 ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేశారు. రిటైర్మెంట్ వయోపరిమితి 62 ఏళ్లకు పెంచారు. అందరికీ ప్రయోజనం చేకూర్చేలా గ్రాట్యుటీ చెల్లిస్తామన్నారు. ప్రస్తుతం వారికి నెలకు రూ.10వేల జీతం వస్తోంది. సర్వీస్ ముగింపులో గ్రాట్యుటీ కింద రూ.1.50 లక్షలు పొందే అవకాశం ఉంది. వీటిపై త్వరలో ఉత్తర్వులు విడుదల కానున్నాయి.