India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రాష్ట్రాన్ని, నగరాన్ని బాగుచేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తనకు ఇప్పటికే ఆస్తి, అంతస్తులు, పదవి అన్నీ వచ్చాయని చెప్పారు. ఈ సమయంలో ఎవ్వరినో మోసం చేయాల్సిన అవసరం లేదన్నారు. మూసీ ప్రాజెక్టుకు వెచ్చించే రూ.1.50 లక్షల కోట్లలో తాము ఒక్క రూపాయి కూడా ఆశించట్లేదని సీఎం తెలిపారు. తమ మంత్రులు కూడా ప్రజలకు మేలు చేసేందుకే పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
యూపీలోని బిజ్నోర్ జిల్లాలో రైతు తగ్వీర్ సింగ్(60) తనపై దాడి చేసిన చిరుతను కొట్టి చంపారు. కలాఘర్ ప్రాంతంలోని భిక్కవాలా గ్రామంలో తగ్వీర్ తన పొలంలో పని చేస్తుండగా ఓ చిరుత అకస్మాత్తుగా దాడి చేసింది. అతడిని పొదల్లోకి తీసుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అయితే తన దగ్గరున్న కర్రతో చిరుత తలపై బాదడంతో అది మృతి చెందింది. తగ్వీర్ పరిస్థితి సైతం విషమంగా ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకునే నేతలు మూడు నెలలు ఆ పరీవాహక ప్రాంతంలో ఉండాలని CM రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. KTR,హరీశ్, ఈటల మూసీ ఒడ్డున ఇళ్లలో ఉంటే తానే కిరాయి చెల్లిస్తానన్నారు. లేదంటే ఖాళీ చేయించిన ఇళ్లలో అయినా ఉండొచ్చన్నారు. ఆ టైంలో వారికి ఆహారం సహా ఇతర సౌకర్యాలూ చెల్లించాలని కమిషనర్ దానకిషోర్‌ను ఆదేశిస్తున్నట్లు చెప్పారు. వారు ఉండలేరని, ఉంటే ఈ ప్రాజెక్టు వెంటనే ఆపేస్తానని CM ఛాలెంజ్ విసిరారు.
ఇండియాలోని యూజర్లకు షాకిచ్చేందుకు అమెజాన్ ప్రైమ్ సిద్ధమైంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు వచ్చే ఏడాది నుంచి తమ ప్లాట్‌ఫామ్‌లో యాడ్స్‌ను జోడించనున్నట్లు ప్రకటించింది. యాడ్ ఫ్రీ కంటెంట్ కోసం మరింత ధర వెచ్చించి సబ్‌స్క్రిప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటి రేట్ల వివరాలను త్వరలోనే వెల్లడించనుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా, కెనడా, US, UK తదితర దేశాల్లోని యూజర్లకు యాడ్స్‌తో కూడిన కంటెంట్‌ను ప్రైమ్ అందిస్తోంది.
అడ్వాన్స్ బుకింగ్ రిజర్వేషన్ పీరియడ్‌ను 120 నుంచి 60 రోజులకు తగ్గిస్తూ ఇండియన్ రైల్వే తీసుకున్న నిర్ణయం <<14380594>>IRCTC<<>>పై నెగటివ్ ఇంపాక్ట్ చూపించింది. నేడు ఆ షేర్లు 2.3% అంటే రూ.21.70 నష్టపోయి రూ.870 వద్ద క్లోజయ్యాయి. ఈ సంస్థకు 80-85% ఆదాయం ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా వస్తుండటమే ఇందుకు కారణం. రైల్వే నిర్ణయంతో రెవెన్యూ తగ్గొచ్చని ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు. లైఫ్‌టైమ్ హై నుంచి IRCTC షేర్లు 25% నష్టపోయాయి.
TG: చెరువుల్లో అక్రమంగా నిర్మించుకున్న భవనాలనే హైడ్రా కూలుస్తోందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. మూసీ పరీవాహకంలో ఎవరి ఇళ్లను హైడ్రా కూల్చలేదన్నారు. కొందరు మెదడులో మూసీ మురికి కంటే ఎక్కువ విషం నింపుకొని దుష్ప్రచారం చేస్తున్నారని రేవంత్ ధ్వజమెత్తారు. తాము ఉన్నపళంగా, నిర్దయగా ఎవరినీ ఖాళీ చేయించడం లేదని, నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించి, రూ.25వేలు ఇచ్చామని వెల్లడించారు.
AP: కూటమి ప్రభుత్వం తమ పార్టీ నేతలను టార్గెట్ చేసిందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వైసీపీ వాళ్లపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని అన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనను పోలీసులు గంటన్నర పాటు విచారించారు. అయితే విచారణ పేరుతో అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడుగుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. దాడి జరిగిన రోజు తాను మంగళగిరిలోనే లేనని వెల్లడించారు.
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ గాయపడ్డారు. మోకాలికి బంతి తాకడంతో నొప్పి భరించలేక మైదానం వీడారు. అతడి స్థానంలో ధృవ్ జురెల్ వికెట్ కీపింగ్‌కు వచ్చారు. గాయం తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై జట్టు నుంచి అప్డేట్ రావాల్సి ఉంది. ఒకవేళ పంత్ గాయంతో దూరమైతే సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత బ్యాటింగ్ లైనప్ కాస్త బలహీన పడే ఛాన్స్ ఉంది.
TG: రాష్ట్ర భవిష్యత్‌ను నిర్దేశించే ‘మూసీ’ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం చేపట్టిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘33 బృందాలు మూసీ పరీవాహకంపై అధ్యయనం చేశాయి. అక్కడ నివసిస్తున్నవారు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. వారికి మెరుగైన జీవితం అందించాలని మేం భావిస్తున్నాం. విద్యావంతుల నుంచి నిరక్షరాస్యుల వరకు అందరికీ హైదరాబాద్ ఉపాధి కల్పించాలి అన్నదే మా లక్ష్యం’ అని మూసీ ప్రాజెక్ట్ ప్రణాళిక సందర్భంగా అన్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ తమ హెడ్ కోచ్‌గా హేమాంగ్ బదానీని, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా మాజీ క్రికెటర్ వేణుగోపాల్ రావును నియమించింది. ట్విటర్‌లో ఈ విషయాన్ని ప్రకటించింది. ఆ జట్టుకు 2018 నుంచి రికీ పాంటింగ్ హెడ్ కోచ్‌గా ఉండగా ఈ ఏడాది ఆయన స్థానంలో బదానీకి అవకాశం దక్కింది. బదానీ గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచింగ్ స్టాఫ్‌లో పనిచేశారు.
Sorry, no posts matched your criteria.