News March 1, 2025
దేశానికి రోల్ మోడల్‌లా పోలీస్ స్కూల్: సీఎం

TG: యంగ్ ఇండియా పోలీస్ స్కూలులో పోలీస్ అమరుల కుటుంబాల పిల్లలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు. HYD మంచిరేవులలోని గ్రేహౌండ్స్ క్యాంపస్ సమీపంలోని ఈ స్కూలులో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. సైనిక్ స్కూల్ తరహాలో పోలీస్ స్కూల్‌ను దేశానికి రోల్ మాడల్‌గా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. స్కూల్ <
Similar News
News March 24, 2025
21 బంతుల్లో హాఫ్ సెంచరీ

ఢిల్లీతో జరుగుతున్న మ్యాచులో లక్నో బ్యాటర్ మిచెల్ మార్ష్ వీర విహారం చేశారు. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశారు. ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదారు. మరోవైపు పూరన్ సైతం ధాటిగా ఆడుతున్నారు. 7 ఓవర్లలో స్కోరు 89/1.
News March 24, 2025
రాత్రి భోజనం తర్వాత ఇలా చేయండి!

కొన్ని అలవాట్లు రాత్రి తిన్న తర్వాత జీర్ణక్రియను వేగవంతం చేయడంలో సహాయపడతాయని వైద్యులు చెబుతున్నారు. ‘తిన్న తర్వాత ఓ 10 ని.లు నడిస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గోరు వెచ్చని నీళ్లు తాగితే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. తిన్న తర్వాత ఓ 30 ని.లు పడుకోకుండా ఉంటే ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు ఉండవు. సోంపు లేదా వాము నమిలితే బాగా జీర్ణమై మలబద్ధకం తగ్గుతుంది. కొద్దిసేపు నిటారుగా కూర్చున్నా మంచిదే’ అని తెలిపారు.
News March 24, 2025
నాడు మోదీ చెప్పారు.. నేడు అమరావతిలోనూ అదే దోపిడీ: YCP

AP: అమరావతిలో రూ.27,159 కోట్ల విలువైన కాంట్రాక్టులను 3.94-4.34% అధిక ధరకు సొంత మనుషులకు CBN కేటాయించారని YCP ఆరోపించింది. ‘పోలవరాన్ని చంద్రబాబు ATM మాదిరి వాడుకుంటున్నారని మోదీ ఏ క్షణాన అన్నారో కానీ నేడు అమరావతిలోనూ అదే జరుగుతోంది. అప్పు తెచ్చిన డబ్బంతా అమరావతిలో పోసి 59 ప్యాకేజీల పనులను తమవాళ్లకు ఇచ్చుకున్నారు. అందులో కమీషన్లు నొక్కుతూ చంద్రబాబు సంపన్నుడు అవుతున్నారు’ అని ట్వీట్ చేసింది.