news

News March 1, 2025

OTT & టీవీల్లోకి బ్లాక్ బస్టర్ మూవీ!

image

ఇంటిల్లిపాదిని నవ్వించేందుకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా మీ ముందుకు వచ్చేసింది. ఈ చిత్రం జీ తెలుగు ఛానల్‌లో ప్రసారం అవుతోంది. సినీ చరిత్రలో తొలిసారి ఈ మూవీ (జీ5)OTTతో పాటు TVల్లో ఒకేసారి రిలీజ్ అయింది. విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికే థియేటర్లలో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా చూస్తున్నారా? COMMENT

News March 1, 2025

భూమిపై ఎక్కువ మంది మాట్లాడే భాషలివే!

image

ప్రపంచంలోని దాదాపు 58 దేశాల్లో 150 కోట్ల మంది ఇంగ్లిష్ మాట్లాడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. 2023 లెక్కల ప్రకారం.. చైనీయులు మాట్లాడే మండరిన్ భాషను 110 కోట్ల మంది, ఇండియన్స్ ఎక్కువగా మాట్లాడే హిందీని 60.9 కోట్ల మంది వినియోగిస్తున్నారు. తర్వాతి స్థానాల్లో స్పానిష్‌ (55 కోట్లు), ఫ్రెంచ్‌ (30.98 CR), అరాబిక్‌ (27.40 CR), బెంగాలీ (27.2 CR), పోర్చుగీసు (26.36 కోట్లు), రష్యన్ (25.50 కోట్లు) ఉన్నాయి.

News March 1, 2025

ఢిల్లీలో ఆ వాహనాలకు పెట్రోల్, డీజిల్ బంద్

image

కాలుష్య నివారణకు ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లు పైబడిన వాహనాలకు మార్చి 31 తర్వాత బంకుల్లో ఇంధనం పోయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ వాహనాలను గుర్తించేందుకు పెట్రోల్ బంకుల్లో ప్రత్యేక పరికరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి పబ్లిక్ CNG బస్సుల్లో 90% బస్సులు తొలగిస్తామని, వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది.

News March 1, 2025

మున్నూరు కాపులకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్

image

TG: మున్నూరు కాపులకు మంత్రి పదవి ఇవ్వాలని ఆ కులం నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు నివాసంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్, BJP, BRSకు చెందిన కాపు నేతలు పాల్గొన్నారు. కులగణనలో కాపుల సంఖ్యను తగ్గించారని, ప్రభుత్వ/నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వడం లేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్నూరు కాపు సభ, మంత్రి పదవి ఇస్తేనే కులగణనపై కృతజ్ఞత సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.

News March 1, 2025

ఫిబ్రవరి GST కలెక్షన్స్ @ రూ.1.84లక్షల కోట్లు

image

ఫిబ్రవరిలో స్థూల GST వసూళ్లు 9.1% పెరిగి రూ.1.84లక్షల కోట్లుగా ఉన్నాయి. స్థానిక రాబడి 10.2% ఎగిసి రూ.1.42లక్షల కోట్లు, దిగుమతులపై రాబడి 5.4% ఎగిసి రూ.41,702కోట్లుగా నమోదయ్యాయి. ఇందులో CGST రూ.35,204 కోట్లు, SGST రూ.43,704 కోట్లు, IGST రూ.90,870 కోట్లు, సెస్ రూ.13,868 కోట్లు. ఇక రూ.20,889 కోట్లు రీఫండ్ చెల్లించగా నికర GST రూ.1.63లక్షల కోట్లుగా తేలింది. 2024 FEBలో ఇది రూ.1.50 లక్షల కోట్లే.

News March 1, 2025

నేనెవ్వరినీ బెదిరింపులకు గురిచేయట్లేదు: కిషన్ రెడ్డి

image

TG: కాంగ్రెస్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు సీఎం రేవంత్ <<15611310>>తనపై ఎదురుదాడి<<>> చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తానెవ్వరినీ బెదిరింపులకు గురి చేయట్లేదని స్పష్టం చేశారు. రేవంత్ మాటల్లో పార్టీ నేతల్లోని అసంతృప్తి, అంతర్గత కుమ్ములాటలు కనిపిస్తున్నాయని చెప్పారు. మోదీ హయాంలో రూ.10 లక్షల కోట్ల విలువైన పనులు రాష్ట్రంలో చేపట్టినట్లు పేర్కొన్నారు.

News March 1, 2025

ప్రజల వద్దే రూ.6,471 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు

image

దేశంలోని ప్రజల నుంచి 98.18% ₹2,000 నోట్లు తిరిగి బ్యాంకులకు చేరినట్లు RBI వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ఇంకా 1.82%(₹6,471కోట్లు) నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని తెలిపింది. 2023 మే 19న ₹3.56 లక్షల కోట్ల విలువైన ₹2వేల నోట్లను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆ నోట్లను RBI రీజినల్ కార్యాలయాల వద్ద ఎక్స్‌ఛేంజ్/డిపాజిట్ చేసుకోవచ్చు.

News March 1, 2025

ఈ నెలలో విడుదలయ్యే చిత్రాలివే..

image

మార్చి నెలలో టాలీవుడ్‌లో బిగ్ హీరోల సినిమాల రిలీజ్ లేకపోయినా పలు ఆసక్తికర చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ నెల 7న ఛావా(తెలుగు డబ్), 14న కిరణ్ అబ్బవరం ‘దిల్‌రూబా’, 28న నితిన్ ‘రాబిన్ హుడ్’, 29న ‘మ్యాడ్ స్క్వేర్’ విడుదల కానున్నాయి. వీటితో పాటు అనువాద చిత్రాలు కింగ్ స్టన్, ఆఫీసర్ ఆన్ డ్యూటీ, వీర ధీర శూరన్ 2(విక్రమ్), L2:ఎంపురాన్ ఇదే నెలలో రిలీజ్ కానున్నాయి. మీరు ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు?

News March 1, 2025

కడప రిమ్స్‌కు పోసాని

image

AP: సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన నటుడు పోసాని కృష్ణమురళికి జైలులో అస్వస్థతకు గురవ్వగా రాజంపేటలోని ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన గుండె సంబంధిత సమస్యతో బాధపడుతుండగా ఈసీజీ పరీక్షలో వైద్యులు స్వల్ప తేడాలు గుర్తించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు.

News March 1, 2025

పథకాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

image

AP: తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇంట్లో ఎందరు పిల్లలుంటే అందరికీ మే నెలలో రూ.15,000 చొప్పున ఇస్తామని ప్రకటించారు. GD నెల్లూరులో మాట్లాడుతూ.. పిల్లల ఖర్చుల బాధలు తగ్గించే బాధ్యత తామే తీసుకుంటామన్నారు. ‘త్వరలోనే ఒక్కో రైతుకు రూ.20వేలు ఆర్థిక సాయం చేస్తాం. మత్స్యకార కుటుంబాలకు రూ.20వేల చొప్పున అందజేస్తాం. జూన్‌ నాటికి DSC ప్రక్రియ పూర్తి చేస్తాం’ అని పునరుద్ఘాటించారు.