news

News October 15, 2024

భారీ వర్షాలు.. వైద్యశాఖ అప్రమత్తం

image

AP: దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆయా జిల్లాల్లో ఎపిడెమిక్ సెల్‌లు 24 గంటలూ అందుబాటులో ఉంటాయని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు పద్మావతి వెల్లడించారు. పునరావాస కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, ప్రసవానికి వారం ముందే గర్భిణులను ఆస్పత్రులకు తరలించాలన్నారు. ఏదైనా సమస్య ఎదురైతే రాష్ట్ర ఎపిడెమిక్ నంబర్(9032384168)కు ఫోన్ చేయాలన్నారు

News October 15, 2024

యువతిపై అత్యాచారం.. ప్రభుత్వం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి: హరీశ్

image

TG: హై సెక్యూరిటి ప్రాంతంగా చెప్పుకునే <<14360357>>గచ్చిబౌలిలో ఉద్యోగినిపై అత్యాచార<<>> ఘటన వల్ల ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పాలనలో అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యం అయ్యాయని విమర్శించారు. శాంతిభద్రతలు క్షీణిస్తున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని దుయ్యబట్టారు. బాధితురాలికి భరోసా కల్పించి, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

News October 15, 2024

ఆటగాడిని కొట్టిన బంగ్లా హెడ్ కోచ్.. తొలగింపు!

image

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ తమ హెడ్ కోచ్ చండికా హతురుసింఘాను సస్పెండ్ చేసింది. ఓ ఆటగాడిపై అతడు చేయి చేసుకోవడమే దీనిక్కారణంగా తెలుస్తోంది. 48 గంటల పాటు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని, ఆ తర్వాత అతడిని పూర్తిగా తప్పిస్తామని బీసీబీ వర్గాలు తెలిపాయి. అతడి స్థానంలో వెస్టిండీస్ మాజీ క్రికెటర్ ఫిల్ సిమన్స్ బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించాయి. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ వరకూ సిమన్సే కొనసాగుతారని పేర్కొన్నాయి.

News October 15, 2024

రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

AP: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రేపు చిత్తూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. అన్ని విద్యాసంస్థలు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ఆదేశించారు. అటు శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో ఈ నెల 17 వరకు సెలవులు ఇచ్చారు.

News October 15, 2024

పవన్ కళ్యాణ్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు

image

AP: ‘పల్లె పండుగ’ కార్యక్రమం విజయవంతంగా సాగుతుండటం ఆనందం కలిగిస్తోందని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. 13,326 గ్రామాలలో రూ.4,500 కోట్ల ఖర్చుతో 30 వేల అభివృద్ధి పనులు చేపట్టాలనే సంకల్పాన్ని డిప్యూటీ సీఎం పవన్ కార్యరూపంలోకి తీసుకువచ్చారని కొనియాడారు. ఇందుకు ఆయనకు అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేపట్టి పల్లెల్లో సంతోషాలు నింపేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

News October 15, 2024

రేపు బీఆర్ఎస్ కీలక భేటీ!

image

TG: హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు కీలక సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. GHMC పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రేపు ఉదయం 10 గంటలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కానున్నారని సమాచారం. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించే అవకాశముంది. కాగా చెరువుల సమగ్ర సర్వే చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం కూల్చివేతలకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చింది.

News October 15, 2024

వయనాడ్.. ప్రియాంకా గాంధీ పోటీ చేసేనా?

image

కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాలకే పరిమితమైన ప్రియాంకా గాంధీ పోటీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాహుల్ గాంధీ రాజీనామాతో NOV 13న వయనాడ్(కేరళ) పార్లమెంట్‌కు <<14363811>>బైపోల్<<>> జరగనుండగా, ఇక్కడ ఆమె బరిలో దిగే ఛాన్స్ ఉంది. INC చీఫ్ ఖర్గే, సీనియర్ నేతలు ఆమె పోటీ చేస్తారని పలుమార్లు ప్రకటించారు. అయితే ప్రియాంక స్పందించలేదు. ఒకవేళ ఆమె పోటీ చేసి గెలిస్తే ఆ సెగ్మెంట్‌లో గెలిచిన తొలి మహిళా ఎంపీగా చరిత్ర సృష్టించనున్నారు.

News October 15, 2024

దీపావళి పండుగ తేదీపై వివాదం

image

AP: ఈ ఏడాది దీపావళి పండుగ తేదీపై పంచాంగకర్తల మధ్య వివాదం నెలకొంది. అక్టోబర్ 31న జరుపుకోవాలని రేలంగి తంగిరాల పంచాంగకర్తలు, నవంబర్ 1 అసలు తేదీ అని కోనసీమ ధృక్ సిద్ధాంత పంచాంగకర్తలు చెబుతున్నారు. రేలంగి పంచాంగాన్ని TTD అనుసరిస్తుండటంతో ప్రభుత్వం కూడా 31నే సెలవు ఇచ్చింది. అయితే వారు సరైన పద్ధతిలో గణించలేదని, సూర్యోదయం ఉన్న తిథినే ప్రామాణికంగా తీసుకోవాలని ధృక్ పంచాంగకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు.

News October 15, 2024

ఎల్లుండి కొమురంభీం జిల్లావ్యాప్తంగా సెలవు

image

TG: ఆదివాసీ పోరాట యోధుడు కొమురంభీం 84వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 17న కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు సెలవు ఇవ్వాలని పేర్కొంటూ కలెక్టర్ వెంకటేశ్ ఉత్తర్వులిచ్చారు. వచ్చే నెల 9న(రెండో శనివారం) వర్కింగ్ డేగా నిర్ణయించారు.

News October 15, 2024

క్యాట్ తీర్పుపై హైకోర్టుకు ఐఏఎస్‌లు!

image

ఏపీకి వెళ్లాలని DOPT ఉత్తర్వులపై క్యాట్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్‌లు హైకోర్టును ఆశ్రయించనున్నారు. <<14364444>>క్యాట్ తీర్పు<<>> నేపథ్యంలో రేపు లంచ్ మోషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఐఏఎస్‌లు వాకాటి అరుణ, అమ్రపాలి, వాణీప్రసాద్, రొనాల్డ్ రోస్ ఏపీకి వెళ్లాలని DOPT ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!