news

News October 15, 2024

నాటకీయం ‘మహా’ రాజకీయం (2/2)

image

ఉద్ధ‌వ్ ప్ర‌భుత్వం Nov 28, 2019న ఏర్ప‌డింది. కాంగ్రెస్, NCPలు అధికారంలో భాగ‌స్వామ్యం అయ్యాయి. అయితే, జూన్ 29, 2022న‌, అంటే ఉద్ధ‌వ్ CM ప‌ద‌వి చేప‌ట్టిన 31 నెల‌ల‌కు BJP రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌కు శివ‌సేన, NCP చీలిపోయాయి. 40 మంది MLAల‌తో ఏక్‌నాథ్ శిండే వ‌ర్గం శివసేన పార్టీని క్లైం చేసుకొని BJP వెంట న‌డిచింది. దీంతో MVA కూట‌మి ప్ర‌భుత్వం కూలిపోయింది. BJP అండ‌తో ఏక‌నాథ్ శిండే CM ప‌ద‌వి దక్కించుకున్నారు.

News October 15, 2024

ఝార్ఖండ్ రాజకీయ ముఖచిత్రం

image

2019 ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 81 స్థానాల్లో JMM(30)-కాంగ్రెస్ (16) కూట‌మి 46 సీట్లు గెలిచి అధికారాన్ని చేపట్టింది. BJP 25 సీట్లు గెలిచింది. JMM నేత హేమంత్ సోరెన్ CM అయ్యారు. అయితే మ‌నీ లాండ‌రింగ్ కేసులో ఈ ఏడాది Jan 31న ED ఆయ‌న్ను అరెస్టు చేయ‌డంతో శిబు సోరెన్ స‌న్నిహితుడు చంపై సోరెన్ CM అయ్యారు. Jun 28న జైలు నుంచి విడుద‌లైన హేమంత్ మ‌ళ్లీ CM ప‌ద‌వి చేప‌ట్ట‌డంతో చంపై పార్టీని వీడి BJPలో చేరారు.

News October 15, 2024

మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఓటర్ల వివరాలు

image

* MH అసెంబ్లీ సీట్ల సంఖ్య: 288 (జనరల్-234, ST-25, SC-29)
* మొత్తం ఓటర్ల సంఖ్య: 9.63 కోట్లు
* పురుషులు-4.97 కోట్లు, స్త్రీలు: 4.66 కోట్లు
* తొలిసారి ఓటు హక్కు పొందిన వారు: 20.93 లక్షలు
* ఝార్ఖండ్ సీట్ల సంఖ్య: 81 (జనరల్ -44, ST-28, SC-09)
* మొత్తం ఓటర్లు-2.6 కోట్లు
* పురుషులు-1.29 కోట్లు, స్త్రీలు-1.31 కోట్లు
* తొలిసారి ఓటు హక్కు పొందిన వారు: 11.84 లక్షలు

News October 15, 2024

ట్రెండింగ్‌లో అఖండ-2!

image

బాలయ్య, బోయపాటి కాంబోలో ‘BB4’ ప్రకటన రావడంతో ట్విటర్‌లో అఖండ-2 హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. వీరిద్దరి కాంబినేషన్లో 2021లో విడుదలైన అఖండ మూవీ సెన్సేషనల్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో దాని సీక్వెల్‌నే వీరు తెరకెక్కించనున్నారని బాలయ్య ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి ‘BB4’గా పిలుస్తున్న ఈ మూవీ ముహూర్తపు షాట్‌ను రేపు చిత్రీకరించనుండగా.. టైటిల్‌ను కూడా రేపే అనౌన్స్ చేస్తారని సమాచారం.

News October 15, 2024

కూటమి ప్రభుత్వం ఉండేది మూడేళ్లే: కాకాణి

image

AP: 2027లో జమిలి ఎన్నికలు వస్తే కూటమి ప్రభుత్వం మరో మూడేళ్లే అధికారంలో ఉంటుందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. TDP నేతల మాటలు వినే అధికారులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. నూతన మద్యం పాలసీలో అనేక అక్రమాలు జరిగాయని, 90% షాపులు TDP నేతలకే దక్కాయని ఆరోపించారు. ఇసుక, గ్రానైట్, విద్య, వైద్యంలో సిండికేట్ రాజ్యం కొనసాగుతోందని మండిపడ్డారు. దోచుకోవడంలో CM చంద్రబాబు దిట్ట అని దుయ్యబట్టారు.

News October 15, 2024

మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

image

మ‌హారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ నగారా మోగింది. MHలో NOV 20న ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తామని CEC రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఇక ఝార్ఖండ్‌లో 2 దశల్లో (NOV 13న, రెండో దశ 20న) ఎన్నికలు ఉంటాయన్నారు. అటు 15 రాష్ట్రాల్లో 48 MLA, 2 MP స్థానాల బైపోల్ షెడ్యూల్‌నూ వెల్లడించారు.
47 AC, వయనాడ్ MP సెగ్మెంట్‌కు 13న, కేదార్‌నాథ్ MP, ఓ MLA స్థానానికి 20న ఓటింగ్ ఉంటుంది. NOV 23న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

News October 15, 2024

వైస్ కెప్టెన్‌గా బుమ్రానే ఎందుకంటే..: రోహిత్ శర్మ

image

భారత టెస్టు జట్టులో KL, అశ్విన్, జడేజా వంటి సీనియర్లున్నా వైస్ కెప్టెన్‌గా బుమ్రానే నియమించడం వెనుక కారణాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘బుమ్రాతో కలిసి నేను చాలా మ్యాచులు ఆడాను. చాలా తెలివిగా ఆలోచిస్తారు. ఎన్నోసార్లు తను ఇచ్చిన సలహాలు జట్టుకు లాభించాయి. కెప్టెన్సీ అనుభవం లేనప్పటికీ ఎప్పుడు ఏం చేయాలో అతడికి తెలుసు. భారత జట్టు నాయకత్వ బృందంలో తను కీలకం’ అని పేర్కొన్నారు.

News October 15, 2024

ఆపరేషన్ తర్వాత తొలిసారి కనిపించిన రజినీకాంత్

image

హార్ట్ ఆపరేషన్ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ తొలిసారి కనిపించారు. ఆయన నటించిన వేట్టయన్ చిత్రం సక్సెస్ కావడంతో చిత్రబృందం రజినీని కలిసింది. ఆయనతో దిగిన ఫొటోను యూనిట్ సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో ఫ్యాన్స్ ఆ ఫొటోను షేర్ చేస్తున్నారు. కాగా అనారోగ్యంతో గత నెల 30న రజినీకాంత్ ఆస్పత్రిలో చేరారు. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడటంతో వైద్యులు ఆయనకు స్టెంట్ వేశారు.

News October 15, 2024

ఇతర దేశాలకు సబ్జెక్టుగా భారత్ ప్రయాణం: మోదీ

image

మొబైల్, టెలికాం విభాగాల్లో భారత్ ప్రయాణం ఇతర దేశాలు అధ్యయనం చేసేందుకు ఓ సబ్జెక్టుగా మారిందని PM మోదీ చెప్పారు. దేశంలో మొబైల్ తయారీ యూనిట్లు వేగంగా విస్తరిస్తున్నాయని, ఈ మొబైల్స్‌లో దేశీయంగా తయారు చేసిన చిప్‌లను వాడుతామని తెలిపారు. అంతర్జాతీయ టెలి కమ్యూనికేషన్ యూనియన్ సమావేశంలో (WTSA-2024) ఆయన మాట్లాడారు. ప్రపంచంలో జరిగే 40% రియల్ టైమ్ డిజిటల్ ట్రాన్సాక్షన్లు దేశంలోనే జరుగుతున్నాయన్నారు.

News October 15, 2024

ఏపీలో మందుబాబులకు షాక్

image

ఏపీలో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. మద్యంపై 2 శాతం సెస్ విధిస్తూ జీవో జారీ చేసింది. డ్రగ్ రిహాబిలిటేషన్ సెస్ కింద దీన్ని వసూలు చేస్తుండగా, రూ.100 కోట్ల వరకు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. నిన్న మద్యం షాపులను లాటరీ ద్వారా కేటాయించగా, రేపటి నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది.

error: Content is protected !!