news

News October 11, 2024

రేపే ‘విశ్వంభర’ టీజర్ విడుదల!

image

మెగాఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ టీజర్‌ను రేపు ఉదయం 10.49కి విడుదల చేయనున్నట్లు ఆ సినిమా డైరెక్టర్ వశిష్ఠ అనౌన్స్ చేశారు. సినీప్రియులు వేడుక చేసుకునేలా మూవీ ఉంటుందని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, త్రిష కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజయ్యే అవకాశం ఉంది.

News October 11, 2024

నెట్స్‌లో చెమటోడ్చుతున్న హిట్‌మ్యాన్

image

న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ కోసం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. గంటలపాటు ఆయన బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. కాగా ఈ నెల 16 నుంచి న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొలి టెస్టు జరగనుంది. రెండో టెస్టు పుణే, మూడో టెస్టు ముంబైలో జరగనున్నాయి.

News October 11, 2024

ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్‌ల మధ్య హెచ్చరికలు, విజ్ఞ‌ప్తులు

image

ఇజ్రాయెల్ దురాక్ర‌మ‌ణ‌ల‌కు దిగితే క‌ఠిన చ‌ర్య‌ల‌కు సిద్ధమని ఇరాన్ హెచ్చరించింది. ఇక లెబ‌నాన్ నుంచి ప్ర‌యోగించిన‌ 25 రాకెట్లలో కొన్నింటిని ఇంట‌ర్సెప్ట్ చేసినట్టు ఇజ్రాయెల్ ప్ర‌క‌టించింది. మరోవైపు పౌరులు, జ‌నావాసాల‌పై ఇజ్రాయెల్ దాడులు నిలిపివేయాల‌ని లెబ‌నాన్ కోరింది. గురువారం జ‌రిగిన దాడుల్లో 139 పౌరులు మృతి చెందిన‌ట్టు తెలిపింది. UN తీర్మానం మేరకు కాల్పుల విర‌మ‌ణ‌కు క‌ట్టుబ‌డి ఉండాల‌ని కోరింది.

News October 11, 2024

ఆ రూ.లక్షన్నర కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు: కిషన్ రెడ్డి

image

TG: పేదల ఇళ్ల కూల్చివేతల విషయంలో హైడ్రా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తగదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హితవు పలికారు. ‘ఇళ్లను కూల్చివేస్తే బ్యాంకు రుణాలు ఎవరు చెల్లిస్తారు? పేదలతో చర్చించి, వారికి ప్రత్యామ్నాయం చూపించాకే ముందుకు వెళ్లాలి. డ్రైనేజీ వ్యవస్థకు ప్రత్యామ్నాయం లేకుండా మూసీ సుందరీకరణ ఎలా సాధ్యం? మూసీ సుందరీకరణకు రూ.లక్షన్నర కోట్లను ప్రభుత్వం ఎక్కడి నుంచి సమీకరిస్తుంది’ అని ప్రశ్నించారు.

News October 11, 2024

APPLY NOW.. 2050 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు

image

TG: 2050 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు అక్టోబర్ 14వ తేదీతో ముగియనుంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 16, 17 తేదీల్లో సవరణలు చేసుకోవచ్చు. నవంబర్ 23వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌లో అత్యధికంగా 1576 ఖాళీలున్నాయి. ఎంపికైన వారికి పేస్కేల్ రూ.36,750-రూ.1,06,990 ప్రకారం జీతాలు చెల్లిస్తారు. మరిన్ని వివరాలకు ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News October 11, 2024

సురేఖను తప్పిస్తారనేది ప్రత్యర్థుల ప్రచారమే: TPCC చీఫ్

image

TG: కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తప్పిస్తారనేది ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారమేనని TPCC చీఫ్ మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. సమంత, నాగార్జున ఫ్యామిలీపై ఆమె చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని చెప్పారు. ఆ వ్యవహారం అప్పుడే ముగిసిందని అన్నారు. AICC నేతలంతా బిజీగా ఉండటం వల్లే మంత్రి వర్గం, PCC కార్యవర్గం ఆలస్యమైందని తెలిపారు. దీపావళిలోపు రెండో విడత కార్పొరేషన్ పదవుల నియామకాలు పూర్తి చేస్తామన్నారు.

News October 11, 2024

ముల్తాన్‌లో మూడు డాట్స్ ఆడితే ఔటివ్వాలి: నాసిర్

image

ముల్తాన్ పిచ్‌పై ఇంగ్లండ్ మాజీ ఆటగాడు నాసిర్ హుసేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి పిచ్‌పై వికెట్లు పడవని, గల్లీ క్రికెట్ తరహాలో వరసగా మూడు డాట్ బాల్స్ ఆడితే ఔట్ అన్నట్లుగా రూల్స్ పెట్టుకోవాలని సెటైర్ వేశారు. ‘టెస్టు క్రికెట్‌కు ఇలాంటి పిచ్ అసలు అక్కర్లేదు. తొలి 3 రోజుల పాటు మరీ ఫ్లాట్‌గా ఉంది. టెస్టుల్లో బ్యాట్‌కు, బంతికి మధ్య సమతూకం ఉండాలి’ అని పేర్కొన్నారు.

News October 11, 2024

జేసీ ప్రభాకర్‌తో నాకు ప్రాణహాని: కేతిరెడ్డి

image

AP: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డితో తనకు ప్రాణహాని ఉందని తాడిపత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. ‘2006లో మా అన్న సూర్యప్రతాప్‌ను చంపారు. నన్నూ అలాగే హత్య చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ఎస్పీ జగదీశ్ సహకరిస్తున్నారు. ప్రస్తుతం నాపై మూడు మర్డర్ కేసులు నమోదు చేశారు. నియోజకవర్గంలో జేసీ ముఠా ఆగడాలు ఎక్కువయ్యాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News October 11, 2024

ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ ఇదే: ఏకంగా కి.మీపైనే!

image

సౌదీలోని జెడ్డాలో ‘జెడ్డా ఎకనమిక్ టవర్స్’ పేరుతో 1,007 మీటర్ల ఎత్తైన భవనం నిర్మిస్తున్నారు. ఇందులో 157 అంతస్తులు, 59 లిఫ్ట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. లగ్జరీ అపార్ట్‌మెంట్లు, హోటళ్లు, ఆఫీసులు నిర్మిస్తున్నారు. దీని కోసం రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇది ఈఫిల్ టవర్‌, లోఖండ్‌వాలా మినర్వాకు 3 రెట్లు, అంపైర్ స్టేట్ బిల్డింగ్‌కు రెట్టింపు ఎత్తు ఉండనుంది. గతంలో పనులు ఆగిపోగా మళ్లీ ప్రారంభమయ్యాయి.

News October 11, 2024

పాకిస్థాన్ సెలక్షన్ బోర్డులోకి మాజీ అంపైర్!

image

సొంత గడ్డపై వరుసగా మ్యాచులు ఓడిపోతుండటంతో పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెలక్షన్ బోర్డులోకి మాజీ అంపైర్ అలీమ్ దార్‌ను పీసీబీ చేర్చుకున్నట్లు సమాచారం. ఆయనతోపాటు మరో నలుగురిని కూడా నియమించినట్లు తెలుస్తోంది. అఖీబ్ జావెద్, అసద్ షఫీఖ్, అజహర్ అలీ, హసన్ చీమాలను తీసుకున్నట్లు టాక్. కాగా అలీమ్ దార్ ఇటీవల అంపైరింగ్‌కు వీడ్కోలు పలికారు.

error: Content is protected !!