news

News October 9, 2024

కోడికి ఈత నేర్పిస్తూ ఇద్దరి మృతి.. మరో వ్యక్తి గల్లంతు

image

AP: ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవ్వగుంట గ్రామంలో పందెం కోడిని ఈత కొట్టిస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందగా మరొకరు గల్లంతయ్యారు. తండ్రి, ఓ కుమారుడి మృతదేహం లభ్యం కాగా మరో కుమారుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News October 9, 2024

Haryana: జిల్లాలకు జిల్లాలే క్లీన్‌స్వీప్ చేసిన BJP

image

హరియాణాలో BJP చాలా జిల్లాల్లో క్లీన్‌స్వీప్, కొన్నింట్లో ఒకటి మినహా అన్ని స్థానాలూ గెలిచింది. కర్నాల్‌ 5/5, పానిపత్‌ 4/4, భివానీ 3/3, ఛర్ఖీదాద్రీ 2/2, రెవారి 3/3, గుర్గావ్‌ 4/4తో ప్రత్యర్థిని ఖాతా తెరవనివ్వలేదు. సోనిపత్‌ 4/5, జింద్‌ 4/5, మహేంద్రగఢ్ 3/4, పల్వాల్ 2/3, ఫరీదాబాద్‌లో 5/6తో అదరగొట్టింది. రోహ్‌తక్ 4/4, జాజర్ 3/4, ఫతేబాద్ 3/3, కురుక్షేత్ర 3/4, కతియాల్ 3/4లో కాంగ్రెస్ సత్తా చాటింది.

News October 9, 2024

భారీ వరదలు.. రూ.5.50 కోట్లు విరాళమిచ్చిన L&T

image

తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖుల నుంచి విరాళాలు కొనసాగుతున్నాయి. ఈరోజు L&T కంపెనీ ఛైర్మన్ సుబ్రమణ్యం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టిని కలిసి రూ.5.50 కోట్ల చెక్‌ను విరాళంగా అందించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి ఖమ్మం& వరంగల్ జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే.

News October 9, 2024

వరద సాయంపై జగన్ విష ప్రచారం: లోకేశ్

image

AP: వరద బాధితులకు ప్రభుత్వ సహాయక చర్యలపై జగన్ విష ప్రచారం చేస్తున్నారని మంత్రి లోకేశ్ మండిపడ్డారు. అగ్గిపెట్టెలు, కొవ్వత్తులకు రూ.23 లక్షలు సైతం ఖర్చు కాకున్నా రూ.23 కోట్లు అయినట్లు ఫేక్ ప్రచారం చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. తమ పాలనలో ప్రతి లెక్క పారదర్శకంగా ఉంటుందని ట్వీట్‌లో పేర్కొన్నారు. అటు వరద బాధితులకు జగన్ ప్రకటించిన రూ.1 కోటిలో ఇంతవరకు ఒక్క రూపాయైనా ఇవ్వలేదని లోకేశ్ చురకలంటించారు.

News October 9, 2024

హైదరాబాద్‌లో ఉద్రిక్తత.. MRPS ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

image

TG: HYDలోని పార్శీగుట్ట ఎమ్మార్పీఎస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్సీ వర్గీకరణ చేయకుండా డీఎస్సీ ఉద్యోగాలను భర్తీ చేయడంపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణతో పాటు నేతలు నిరసనకు దిగారు. పార్శీగుట్ట నుంచి ట్యాంక్ బండ్ వరకు ర్యాలీగా బయలుదేరగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.

News October 9, 2024

ఆ వార్డులో YCPకి ఒక్క ఓటు.. ఇదెలా సాధ్యం: VSR

image

AP: హరియాణా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో APని ప్రస్తావిస్తూ MP విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ‘లోక్‌సభ ఎన్నికల ఫలితాలప్పుడు తొలి 4దశల్లో జరిగిన పోలింగ్‌లో BJPకి ఎదురుగాలి వీచింది. ఐదు, ఆరు దశల్లో, APలో జరిగిన ఎన్నికల్లో EVMల ట్యాంపరింగ్ చేశారు. CBN కుట్ర ఇది. హిందూపురంలో ఓ వార్డులో YCPకి ఒక్క ఓటు వచ్చింది. ఇది సాధ్యమా? ఈ మోసాలను కప్పిపుచ్చడానికి తిరుమల లడ్డూ వివాదం తెరపైకి తెచ్చారు’ అని ఆరోపించారు.

News October 9, 2024

యూపీఐ వాలెట్, ట్రాన్సాక్షన్ లిమిట్ పెంపు

image

డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ను మరింత ప్రోత్సహించేలా UPI వాలెట్ పరిమితిని రూ. 2000 నుంచి రూ.5వేలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ప్రతి లావాదేవీకి UPI పరిమితిని రూ.500 నుంచి రూ.1000కి, UPI 123పే లావాదేవీల లిమిట్‌ను రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. పిన్ అవసరం లేకుండా పేమెంట్స్ చేసేందుకు UPI వాలెట్, ఫీచర్ ఫోన్లు వాడే వారి కోసం యూపీఐ123పే ఉపయోగపడుతుంది.

News October 9, 2024

నేను BRS ఛైర్మన్‌ను కాదు: గుత్తా

image

TG: తాను ఇప్పుడు BRS ఛైర్మన్‌ను కాదని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. శాసనమండలిలో చీఫ్ విప్‌గా పట్నం మహేందర్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న సందర్భంగా గుత్తా మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ఉద్యోగాల మీద మాట్లాడుతున్న బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. MLAల ఫిరాయింపుల అంశంలో గత ప్రభుత్వం ఏం చేసిందో గుర్తు చేసుకుంటే మంచిదని హితవు పలికారు.

News October 9, 2024

సెంచరీ దాటిన టమాటా ధర.. మందుబాబుల సెటైర్లు!

image

తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధర సెంచరీ దాటింది. పలు ప్రాంతాల్లో కేజీ టమాటా రూ.100 లేదా అంతకంటే ఎక్కువ ధరకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో పలువురు మందుబాబులు ఫన్నీగా సెటైర్లు వేస్తున్నారు. కేజీ టమాటా కొనే కంటే రూ.99కి ఒక క్వార్టర్ మద్యాన్ని కొనుక్కోవచ్చని కామెంట్స్ చేస్తున్నారు. క్వార్టర్ మద్యాన్ని రూ.99కే విక్రయించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

News October 9, 2024

ధాన్యం కొనుగోళ్లపై క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు

image

TG: ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా ఉన్నారు. గోడౌన్లు, మిల్లర్లకు బ్యాంక్ గ్యారంటీలు, మిల్లింగ్ ఛార్జీలపై ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.

error: Content is protected !!