India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హరియాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి హ్యాట్రిక్ విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. ఇక్కడ BJP-కాంగ్రెస్ మధ్య 11 సీట్ల తేడా ఉన్నప్పటికీ ఓటు షేర్‌లో రెండింటికీ 39% వచ్చింది. 2019లో కాంగ్రెస్‌కు 28.08% ఓట్లు రాగా, ప్రస్తుతం గణనీయంగా ఆదరణ పెరిగింది. BJP గత ఎన్నికల్లో 36.49% ఓటు బ్యాంక్‌తో 40సీట్లు గెలుచుకుంది. జననాయక్ జనతా పార్టీకి 2019లో 14.80% ఓట్లతో 10సీట్లలో విజయఢంకా మోగించింది.
అక్టోబర్ పాలసీ మీటింగ్‌లోనూ రెపోరేట్లపై ఆర్బీఐ స్టేటస్ కో ప్రకటించింది. వడ్డీరేట్లను తగ్గించడం లేదని గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. రెపోరేటును 6.5% వద్ద యథాతథంగా ఉంచుతున్నామని పేర్కొన్నారు. న్యూట్రల్ వైఖరినే అవలంబిస్తున్నామని చెప్పారు. ఇన్‌ఫ్లేషన్ తగ్గుదల ఇంకా నెమ్మదిగా, అసాధారణంగానే ఉందన్నారు. యూఎస్ ఫెడ్ 50 బేసిస్ పాయింట్ల మేర కత్తిరించినా ఆర్బీఐ ఆచితూచి వ్యవహరిస్తోంది.
AP: కోటి కలలతో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన ఆ ప్రేమ జంట ఆనందం ఎక్కువ కాలం నిలువలేదు. విధి ఇద్దరినీ బలి తీసుకుంది. విజయవాడకు చెందిన నాగరాజు(29), ఉష(22) ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి 18నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. సోమవారం రోడ్డు ప్రమాదంలో నాగరాజు చనిపోయాడు. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని రక్తపు మడుగులో చూసి ఉష గుండె తల్లడిల్లింది. ప్రాణసఖుడు లేని లోకంలో తాను ఉండలేనంటూ ఉరి వేసుకుంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా సంక్రాంతికి రిలీజయ్యే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొన్నాయి. క్రిస్మస్‌కి బదులు సంక్రాంతికి రిలీజ్ చేస్తే సెలవులు కలిసొస్తాయని మేకర్స్ అనుకుంటున్నట్లు తెలిపాయి. జనవరి 10న ఈ చిత్రం రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఇక వెంకటేశ్-అనిల్ రావిపూడి మూవీ జనవరి 14న విడుదలవనుండగా, మెగాస్టార్ ‘విశ్వంభర’ ఉగాదికి వచ్చే అవకాశం ఉంది.
TG: రాష్ట్రంలో 15ఏళ్లు దాటిన వాహనాలను తప్పనిసరిగా తుక్కుగా మార్చాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ‘వాలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ’ని అమల్లోకి తెచ్చింది. ఆ వాహనాలు ఫిట్‌గా ఉన్నాయనిపిస్తే నడుపుకోవచ్చు. అయితే తదుపరి 5ఏళ్లకు ₹5K, మరో పదేళ్లకు ₹10K గ్రీన్ ట్యాక్స్ చెల్లించాలి. పాత వాహనాన్ని తుక్కుగా మార్చాలా వద్దా అనేది యజమాని నిర్ణయించుకుంటారు. మారిస్తే తర్వాతి వాహనానికి రాయితీ వస్తుంది.
స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. Infy, ICICI, SBI, Airtel వంటి హెవీవెయిట్స్ సూచీలకు అండగా నిలిచాయి. ప్రీమార్కెట్లో 25,300ను టచ్ చేసిన నిఫ్టీ ప్రస్తుతం 73 పాయింట్ల లాభంతో 25,086 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 235 పాయింట్లు ఎగిసి 81,854 వద్ద చలిస్తోంది. శ్రీరామ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, Trent, బజాజ్ ఫైనాన్స్, TECH M టాప్ గెయినర్స్. ONGC, ITC, బ్రిటానియా, నెస్లే, HUL టాప్ లూజర్స్.
AP: బీడీఎస్ కోర్సులో తొలిదశ కన్వీనర్ కోటా ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రారంభమైంది. విద్యార్థులు శుక్రవారం రాత్రి 9 గంటల్లోగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో 819 కన్వీనర్ కోటా సీట్లు ఉన్నాయంది. ఇటు సెకండ్ కౌన్సెలింగ్‌లో మేనేజ్‌మెంట్ కోటాలో MBBS సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబర్ 9లోపు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలని పేర్కొన్నారు.
హరియాణాలో వరుసగా మూడోసారి BJP గెలిచి హ్యాట్రిక్ కొట్టింది. త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే గత క్యాబినెట్‌లోని 10 మంది మంత్రుల్లో ఎనిమిది మంది ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ స్పీకర్ జియాన్ చంద్ గుప్తా కూడా ఓడిపోయారు. దీంతో అక్కడ మంత్రివర్గంలోకి కొత్తముఖాలు కనిపించనున్నాయి.
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఏడోరోజు మూలా నక్షత్రం, సరస్వతి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు. చదువులతల్లి జన్మనక్షత్రం కావడంతో పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయిస్తే విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయంటారు. ఇవాళ ‘సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా, పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణినీ, నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతీ’ శ్లోకాన్ని పఠిస్తూ అమ్మవారిని పూజించండి.
TG: రాష్ట్ర ప్రభుత్వం కులగణనకు సిద్ధమైంది. నెల రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేలా సన్నాహాలు చేస్తోంది. దీని కోసం రేవంత్ సర్కారు రూ.150 కోట్లు కేటాయించగా గైడ్ లైన్స్ ఖరారు కావాల్సి ఉంది. 30 రోజుల్లో 90వేల మంది సిబ్బందితో ఈ గణన పూర్తి చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. మూడు, నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు ఫైనల్ చేసి ప్రకటన చేసే అవకాశం ఉంది.
Sorry, no posts matched your criteria.