India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
NDA నిర్ణయాలపై జమ్మూ, కశ్మీర్ ప్రజలు భిన్నంగా స్పందించినట్టు ఫలితాల సరళి స్పష్టం చేస్తోంది. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా విభజించడం, LGకి అపరిమిత అధికారాలపై కశ్మీర్ వ్యాలీ ఓటర్లు ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే జమ్మూలో మాత్రం BJP మెజారిటీ సీట్లు సాధించడం గమనార్హం. ఆ స్థాయిలో కశ్మీర్‌లో పోటీ చేసిన కొన్ని స్థానాల్లో BJP ఆశించిన ఫలితాల్ని రాబట్టలేకపోయింది.
TG: కులగణనపై 2, 3 రోజుల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి విధివిధానాలపై కసరత్తు జరుగుతోందన్నారు. కుల గణన ప్రక్రియను నెల రోజుల్లోనే పూర్తి చేయనున్నామని తెలిపారు. రిపోర్ట్ పారదర్శకంగా ఉండడానికి జీఏడీ లేదా పంచాయతీ రాజ్, రెవెన్యూ శాఖల్లో దేని ద్వారా కులగణన సర్వే చేయించాలనే దానిపై 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు.
AP: రాష్ట్రంలోని 22 జిల్లాల్లో ఫుడ్ టెస్టింగ్ ల్యాబులు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు ఇవాళ ఢిల్లీలో FSSAIతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆహార భద్రతా ప్రమాణాలు బలోపేతం చేసేందుకే రూ.88 కోట్ల ఎంఓయూ కుదుర్చుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మరోవైపు రూ.20 కోట్ల వ్యయంతో తిరుమల, కర్నూలులో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ ల్యాబ్‌లు కూడా నెలకొల్పుతామని చెప్పారు.
జమ్మూకశ్మీర్‌లో ఓట్ల లెక్కింపు ముగిసింది. పదేళ్ల తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్-సీపీఎం కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఎన్సీ 42, కాంగ్రెస్ 6, సీపీఎం 1 స్థానంలో గెలుపొందాయి. 90 స్థానాలున్న అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను కూటమి పార్టీలు చేరుకున్నాయి. ఇక BJP 29 స్థానాల్లో, పీడీపీ 3, జేపీసీ, ఆప్ చెరో స్థానంలో గెలుపొందాయి.
మంత్రి కొండా సురేఖపై క్రిమినల్, పరువు నష్టం కింద చర్యలు తీసుకోవాలని నాగార్జున కోర్టులో వాంగ్మూలం ఇచ్చినట్లు ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. ఇవాళ నాగార్జునతో పాటు మొదటి సాక్షిగా సుప్రియ వాంగ్మూలం రికార్డు చేశారని, ఈనెల 10న మరో సాక్షి వాంగ్మూలం తీసుకుంటారని చెప్పారు. నేరం రుజువైతే సురేఖపై కోర్టు చర్యలు తీసుకుంటుందని, ఆమెకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు.
JKలో కాంగ్రెస్‌తో పొత్తు NCకి కలిసొచ్చింది. ఆర్టికల్ 370 సహా రాష్ట్ర హోదా పునరుద్ధరణపై ప్రజలకు NC హామీ ఇచ్చింది. ఈ హామీల అమలు స్థానిక ప్రభుత్వ పరిధిలో లేని అంశాలు. కాంగ్రెస్‌తో పొత్తు వల్ల ఎప్పటికైనా NC వీటిని అమలు చేయవచ్చని ప్రజలు భావించినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో కశ్మీర్‌లో కూటమి మెజారిటీ సాధించింది. అయితే, ఆర్టికల్ 370 పునరుద్ధరణపై కాంగ్రెస్ ఎన్నడూ స్పందించలేదు.
మంత్రి కొండా సురేఖపై నటుడు నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ కోర్టులో నిలబడేలా లేదని ఆమె తరఫు న్యాయవాది తిరుపతి వర్మ అన్నారు. ‘ఈ కేసు విచారణలో ముగ్గురు వ్యక్తుల వాంగ్మూలాల్లో తేడాలు ఉన్నాయి. నాగార్జున పిటిషన్‌లో ఒకటి, వాంగ్మూలంలో మరొకటి చెప్పారు. ఆయన కోడలు సుప్రియ ఇంకొకటి చెబుతున్నారు. మరో సాక్షి వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేస్తుంది. ఒకవేళ నోటీసులు వస్తే చట్టపరంగా ఎదుర్కొంటాం’ అని ఆయన చెప్పారు.
JKలో ఆర్టికల్ 370, 35(A) రద్దు తరువాత మొదటిసారిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఎంతో ప్రత్యేకం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారీగా నమోదైన ఓటింగ్ ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్ని ప్రదర్శించిందన్నారు. పార్టీ పనితీరుపై హర్షం వ్యక్తం చేసిన మోదీ ఓటువేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. JK ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పని చేస్తామన్నారు. మెరుగైన ఫలితాలు సాధించిన NCని అభినందించారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ హరియాణాలో బీజేపీ సంచలన విజయం సాధించింది. వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుని హ్యాట్రిక్ కొట్టింది. తొలుత కాంగ్రెస్ భారీ ఆధిక్యంలో దూసుకెళ్లినా క్రమంగా కమలం రేసులోకి వచ్చింది. ఇక అప్పటినుంచి వరుసగా సీట్లు గెలుస్తూ మ్యాజిక్ ఫిగర్ (46) దాటింది. EC లెక్కల ప్రకారం 90 సీట్లకు గాను BJP 46, కాంగ్రెస్ 35 చోట్ల గెలిచాయి. చెరో 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
ఎన్నికలకు 200 రోజుల ముందు హరియాణా CMగా బాధ్యతలు చేపట్టిన నాయబ్ సింగ్ సైనీ BJPని అనూహ్యంగా విజయతీరాలకు చేర్చారు. డమ్మీ CM అని ఎన్ని విమర్శలు వచ్చినా BJP ఎన్నికల ప్రచారం మొత్తం ఆయన చుట్టూనే తిరిగింది. ఫలితాలపై ముందుగానే బాధ్యత వహించిన సైనీ ప్రభుత్వ వ్యతిరేకతలోనూ పార్టీని ముందుండి నడిపారు. అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ హ్యాట్రిక్ విజయానికి కారణమయ్యారు.
Sorry, no posts matched your criteria.