India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రస్తుతం టమాటా ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పుడిదే రైతులు, వ్యాపారస్థుల పాలిట శాపంగా మారింది. కర్ణాటకలోని ములుబాగల్‌కు చెందిన ఓ ట్రక్ డ్రైవర్ హైదరాబాద్‌లో టమాటాలు విక్రయించి తిరుగుపయనమయ్యాడు. కర్నూలు సమీపంలో టీ తాగేందుకు ట్రక్ ఆపగా ఓ దొంగల ముఠా టమాటా విక్రయించి వస్తున్న విషయం తెలుసుకుంది. 250 కి.మీ వెంబడించి సోమందేపల్లి వద్ద ట్రక్‌ను ఆపి రూ.5 లక్షలతోపాటు సెల్ ఫోన్ కూడా లాక్కెళ్లిపోయారు.
TG: హుస్సేన్ సాగర్, మూసీ పాపాలకు కాంగ్రెస్ కారణమని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ‘చెరువులపై చర్చకు భట్టి విక్రమార్క సిద్ధమా? గూగుల్ మ్యాప్స్ మొదలైనప్పటి నుంచి చెరువుల పరిస్థితేంటో చూద్దాం. ప్రకటించిన లిస్ట్ ప్రకారం అక్రమ నిర్మాణాలు కూల్చే దమ్ముందా? కూల్చివేతలతో ఇప్పటికే ₹1000కోట్లకు పైగా ప్రజల ఆస్తులకు నష్టం జరిగింది. ₹వందల కోట్లు దోచుకోవాలనేదే కాంగ్రెస్ ఆలోచన’ అని ప్రెస్‌మీట్‌లో ఆరోపించారు.
AP: వరదల సమయంలో ప్రజలను చంద్రబాబు ఆదుకున్న తీరు దేశానికే ఆదర్శమని TDP నేత బుద్దా వెంకన్న అన్నారు. వరదలను అడ్డుపెట్టుకుని దోపిడీ చేశారంటూ YCP నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. దమ్ముంటే ఈ అంశంపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. వరదలప్పుడు ఏసీ గదిలో కూర్చున్న జగన్ ఇప్పుడు పేదల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన ప్రకటించిన రూ.కోటి సాయం ఎవరికి ఖర్చు పెట్టారో చెప్పాలన్నారు.
ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ఎగ్జిట్ పోల్స్ పూర్తి అపోజిట్‌గా ఉండటంతో వాటిపై నమ్మకం పోతోందని నెటిజన్లు అంటున్నారు. సోషల్ మీడియాలో వాటిని విమర్శిస్తూ మీమ్స్ షేర్ చేస్తున్నారు. కొద్ది తేడా ఉంటే ఫర్వాలేదు మరీ ఇంత ఘోరమేంటని ప్రశ్నిస్తున్నారు. వాటిలో సైంటిఫిక్ వాలిడేషన్, డేటా శాంపుల్ తీరును సందేహిస్తున్నారు. లోక్‌సభ ఫలితాల్లో బీజేపీకి 330+, హరియాణాలో 20+ వస్తాయన్న ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా తలకిందులయ్యాయి.
2019 హరియాణా ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా నిలిచిన JJP ఈ ఎన్నికల్లో కనీసం ప్రభావం చూపలేకపోయింది. దుశ్యంత్ చౌతాలా సారథ్యంలోని ఈ స్థానిక పార్టీ జాట్ వర్గాల అండతో గత ఎన్నికల్లో 14.80% ఓట్లతో 10 సీట్లు గెల్చుకొని BJP ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించింది. దుశ్యంత్‌ను DyCM పదవి వరించింది. అయితే ఈ ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవలేదు. ఉచన కలన్‌లో దుశ్యంత్ 5వ స్థానానికి పరిమితమయ్యారు.
ఈ నెల 10న ప్రధాని నరేంద్ర మోదీ లావోస్ పర్యటనకు వెళ్తారు. అక్కడ ఆయన రెండు రోజులపాటు పర్యటిస్తారని విదేశాంగశాఖ తెలిపింది. 21వ ఆసియాన్-ఇండియా సమ్మిట్, 19వ ఈస్ట్ ఆసియా సదస్సులో ఆయన ప్రసంగిస్తారు. ఈ సమ్మిట్‌లో వివిధ దేశాలతో భాగస్వామ్య ప్రాంతీయ ప్రాముఖ్యంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు లావోస్‌తోనూ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం.
TG: వెహికల్ స్క్రాపింగ్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చి, అదే కేటగిరీలో కొత్త వాహనం కొంటే రాయితీ కల్పించనుంది. టూ వీలర్స్ ధర ₹లక్షలోపు ఉంటే ₹1000, ₹1-2లక్షలు అయితే ₹2,000, ₹2-3లక్షలకు ₹3,000, 4 వీలర్స్‌కు ధర ₹0-5లక్షలు ఉంటే ₹10,000, ₹5-10Lకు ₹20,000, ₹10-15Lకు ₹30,000, ధర ₹20లక్షలకు పైన ఉంటే ₹50,000 రాయితీ ఇవ్వనుంది.
AP: ఈనెల 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘పల్లె పండుగ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు Dy.CM పవన్ తెలిపారు. గ్రామ సభల్లో ఆమోదించిన పనులను పల్లె పండుగ సందర్భంగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం ద్వారా ₹4500 కోట్ల నిధులను కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేసిందని, గ్రామాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా మొదలుపెట్టాలని సూచించారు. 3000kms మేర సీసీ రోడ్లు, 500 kms మేర తారు రోడ్లు వేయాలన్నారు.
జమ్మూకశ్మీర్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ డకౌట్ అయ్యింది. ఆ పార్టీ అభ్యర్థులు కనీసం ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయారు. దీంతో హరియాణాలో కాంగ్రెస్‌తో చేతులు కలపకపోవడమే పెద్ద తప్పిదమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పొత్తు పెట్టుకొని ఉంటే అధికార బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా ఉండేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
హరియాణా ఎన్నికల్లో BJP అనూహ్యంగా పుంజుకోవడం వెనుక RSS కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. గత 4 నెలల్లో క్షేత్రస్థాయిలో 16 వేలకుపైగా సమావేశాలు నిర్వహించింది. సంఘ్ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం ద్వారా జాట్‌యేతర ఓట్లను BJPకి చేరువ చేసినట్టు ఫలితాల సరళి స్పష్టం చేస్తోంది. పైగా అభ్యర్థుల ఎంపికలో BJP-RSS ఈసారి కలిసి పనిచేశాయి. హిందూ సమాజం సంఘటితంపై మోహన్ భాగవత్ పిలుపు ఫలితాన్నిచ్చింది.
Sorry, no posts matched your criteria.