news

News October 8, 2024

ఒమర్ అబ్దుల్లానే సీఎం: ఫరూక్ అబ్దుల్లా

image

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఆధిక్యంలో ఉంది. ఈనేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా జమ్మూకశ్మీర్ తదుపరి సీఎం అని ప్రకటించారు.

News October 8, 2024

రామ్ చరణ్ అభిమానులకు BAD NEWS

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి ఈ దసరాకి టీజర్ విడుదలయ్యేలా కనిపించట్లేదు. టీజర్ విడుదలవకపోతే నిరాశపడవద్దని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అభిమానులకు సూచించారు. ‘వీడియోను ఫైనల్ చేసేందుకు టీమ్ కృషి చేస్తోంది. CG VFX షాట్స్ ఎడిటింగ్, డబ్బింగ్ జరుగుతోంది. అన్ని సాంగ్స్ లిరికల్ వీడియోల పనులను పూర్తి చేస్తున్నాం. DEC 20 లేదా క్రిస్మస్‌కి విడుదలవుతుంది’ అని ట్వీట్ చేశారు.

News October 8, 2024

రేపు రాష్ట్రవ్యాప్త నిరసనకు MRPS పిలుపు

image

TG: రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని MRPS అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ప్రభుత్వం వర్గీకరణ లేకుండానే 11వేల టీచర్ పోస్టుల భర్తీ చేస్తోందని ఆయన అన్నారు. దీన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రాల్లో అంబేడ్కర్ విగ్రహాల నుంచి కలెక్టరేట్ల వరకు ర్యాలీ నిర్వహించి ధర్నాలు చేపట్టాలని అన్నారు. కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని సూచించారు.

News October 8, 2024

చంద్రబాబు నైజం ఇదే: విజయసాయి రెడ్డి

image

ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి విమర్శలకు దిగారు. ‘సూపర్ సిక్స్ ఇస్తే ఏమి, ఇవ్వకపోతే ఏమి. నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగితే మనకేంటి, పెరగకపోతే మనకేంటి. మరో నాలుగేళ్ల తర్వాత ప్రజలకి దొంగ హామీలిచ్చి, మభ్యపెట్టి, మోసగించి ఓట్లు వేయించుకోవచ్చు. మనకి కావాల్సింది రాష్ట్రాన్ని దోచుకోవడం. కులం, మతం అంటూ అగ్గి రాజేసి అందులో చలి కాచుకోవడమే ఆయన నైజం’ అని ట్వీట్ చేశారు.

News October 8, 2024

APPLY NOW: రైల్వేలో 14,298 ఉద్యోగాలు

image

రైల్వేలో 14,298 గ్రేడ్-1, గ్రేడ్-3 టెక్నీషియన్ పోస్టులకు ఈ నెల 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాలను బట్టి టెన్త్, సంబంధిత విభాగంలో ఐటీఐ, అప్రెంటిస్‌షిప్ పూర్తిచేసుకుని, జులై 1, 2024 నాటికి 18-33 ఏళ్ల వయసున్నవారు అర్హులు. రిజర్వేషన్ ప్రకారం సడలింపు ఉంటుంది. డిసెంబర్ 11 నుంచి 26 వరకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.
వెబ్‌సైట్: rrbapply.gov.in

News October 8, 2024

OBC, అగ్రకులాల అండతో జాట్ల వ్యతిరేకతను న్యూట్రలైజ్ చేసిన BJP

image

ఉత్తరాదిలో రాజకీయాలను శాసించేది కుల సమీకరణాలే! అభివృద్ధికి తోడు BJP ఇదే వ్యూహంతో హరియాణాలో గెలుస్తోందని విశ్లేషకుల అంచనా. ఇక్కడ 27% ఉన్న జాట్లు ఎవరికి ఓటేస్తే వారిదే అధికారం. పార్టీ ఏదైనా CM ఆ వర్గం నుంచే ఎంపికవుతారు. BJP OBCలనే సీఎంలుగా నియమించి జాట్ల ఆగ్రహానికి గురైంది. దాంతో ఓటమి ఖాయం అనుకున్నారు. 50% ఉన్న OBCలు, అగ్రకులాలు, గిరిజనులకు ఎక్కువ సీట్లిచ్చి కాంగ్రెస్ వ్యూహాన్ని BJP ఛేదించింది.

News October 8, 2024

కొత్త టీచర్లకు పోస్టింగ్ ఎప్పుడంటే?

image

TG: డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు రేపు ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ నియామక పత్రాలను అందజేయనున్నారు. నియామక పత్రాలు అందజేసిన తర్వాత అధికారులు కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపికైన వారికి ఏ పాఠశాలలో పనిచేయాలో డీఈవోలు ఉత్తర్వులు ఇస్తారు. ఈ నెల 14తో దసరా సెలవులు ముగియనుండగా ఆలోపే వారికి పోస్టింగులు ఇచ్చే అవకాశమున్నట్లు సమాచారం.

News October 8, 2024

ఘోరం.. కేక్ తిని ఐదేళ్ల బాలుడు మృతి

image

కర్ణాటకలోని బేకరీల్లో లభించే కేకుల్లో క్యాన్సర్ కారకాలు గుర్తించిన ఘటన మరువకముందే బెంగళూరులో ఐదేళ్ల బాలుడు కేక్ తిని చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. స్విగ్గీ డెలివరీ బాయ్ బాలరాజ్ ఆర్డర్ క్యాన్సిల్ అవడంతో సదరు కేక్‌ను ఇంటికి తీసుకొచ్చారు. దానిని ఎవరికీ పంచకుండా ఇంట్లోని భార్య, కుమారుడితో తినగా కొద్ది సేపటికే వీరు అనారోగ్యం పాలయ్యారు. కొడుకు ధీరజ్ చనిపోగా భార్యాభర్తలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

News October 8, 2024

హరియాణా: బీజేపీ లేదంటే కాంగ్రెస్.. లోకల్‌ పార్టీలకు ఓటర్లు నై.. నై!

image

హరియాణా ఓటర్లు ఈసారి సుస్పష్టమైన తీర్పునిచ్చారు. రాజకీయ సమీకరణాల్లో స్థానిక పార్టీలకు చోటివ్వలేదు. జాతీయ పార్టీలకే పట్టం కట్టారు. గందరగోళానికి తావులేకుండా ఏదో ఒకవైపే క్లియర్ స్టాండ్ తీసుకున్నారు. అయితే బీజేపీ లేదంటే కాంగ్రెస్‌కు ఓటేశారు. EC ప్రకారం ఈ 2 పార్టీలే 81% ఓట్‌షేర్, 84 సీట్లను పంచుకున్నాయి. INLD, BSP చెరోసీటు, ఇండిపెండెంట్లు 10% ఓట్‌షేర్‌తో 4 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. JJP జాడే లేదు.

News October 8, 2024

BREAKING: వినేశ్ ఫొగట్ విజయం

image

భారత మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగట్ హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. జులానా అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి ఆమె పోటీ చేశారు. రెండో స్థానంలో BJP అభ్యర్థి యోగేశ్ కుమార్, మూడో స్థానంలో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అభ్యర్థి సురేందర్ లాథర్ నిలిచారు.

error: Content is protected !!