India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హరియాణా ప్రజలు ఇప్పటి వరకు వరుసగా మూడోసారి ఎవరికీ పట్టం కట్టిన చరిత్ర లేదు. గరిష్ఠంగా రెండుసార్లే ఒక పార్టీకి అధికారం అప్పజెప్పారు. 1968, 72లో; 2005, 09లో కాంగ్రెస్‌ను గెలిపించారు. 2014, 19లో బీజేపీని అందలమెక్కించారు. దీనికి బ్రేక్ చేసి హ్యాట్రిక్ అందుకోవాలన్న బీజేపీ కల నెరవేరేలా లేదు. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కే తీర్పునిచ్చాయి. JJP ఓటు బ్యాంకు వారికే బదిలీ అయినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
టమాటా రేటు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని సామాన్యులకు కేంద్రం ఉపశమనం కలిగించింది. అక్కడ కిలో టమాటా ₹100-₹120 పలుకుతోంది. దీంతో హోల్‌సేల్ మార్కెట్ నుంచి కొనుగోలు చేసి ఢిల్లీ సహా శివారులోని 56 ప్రాంతాల్లో ₹65కే ప్రజలకు అందిస్తోంది. ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా టమాటా పండించే ప్రధాన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లో దిగుబడి బాగా తగ్గింది. దీంతో ధరలు పెరిగాయి.
దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గామాత మండపాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈరోజు విజయవాడ దుర్గమ్మ మహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. మంగళప్రదమైన దుర్గమ్మను దర్శించుకున్న వారికి ఐశ్వర్యప్రాప్తి, విజయం లభిస్తుందని ప్రతీతి. మూడు శక్తుల్లో ఒకరైన శ్రీ మహాలక్ష్మీ అమితమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసుడిని సంహరించిన విషయం తెలిసిందే.
AP: ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న PM మోదీతో సమావేశమైన CM చంద్రబాబు ఇవాళ పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. వరద నష్టం, నిధుల విడుదలపై హోంమంత్రి అమిత్‌షాతో, సెయిల్‌లో విశాఖ స్టీల్‌ప్లాంట్ విలీన ప్రతిపాదనలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చిస్తారు. అలాగే రాష్ట్రంలో రోడ్ల నిర్మాణంపై నితిన్ గడ్కరీతో సమాలోచనలు చేస్తారు. పీయూష్ గోయల్, హర్దీప్ సింగ్‌తో ఆయన భేటీ కానున్నారు.
భారత మహిళా క్రికెటర్ అరుంధతి రెడ్డిని ఐసీసీ మందలించింది. పాకిస్థాన్‌తో మ్యాచులో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఒక డీమెరిట్ పాయింట్ పెనాల్టీని విధించింది. పాక్ ప్లేయర్ నిదా దార్‌ని ఔట్ చేసిన క్రమంలో అరుంధతి పెవిలియన్ వైపు చూపిస్తూ సైగ చేసింది. దీంతో ఐసీసీ పెనాల్టీతో పాటు భారత క్రికెటర్‌కు మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించింది.
TG: బైపీసీ విద్యార్థులు బీఫార్మసీ, ఫార్మా డి, బీటెక్ బయోటెక్నాలజీ, బయో మెడికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరేందుకు ఈ నెల 19 నుంచి కౌన్సెలింగ్ జరగనుంది. 22 వరకు ఫీజు చెల్లించి సర్టిఫికెట్ల పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. 21 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, 28న సీట్ల కేటాయింపు ఉంటుంది. 30వ తేదీలోపు విద్యార్థులు కాలేజీల్లో చేరాలి. నవంబర్ 4 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది.
AP: గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం తలపెట్టిన పల్లె పండుగ కార్యక్రమాన్ని ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు ప్రభుత్వం నిర్వహించనుంది. ఇవాళ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. మొత్తంగా రూ.2,500 కోట్ల ఉపాధి హామీ పథకం మెటీరియల్ నిధులతో 20 వేల పనులకు స్థానిక ప్రజాప్రతినిధులు శంకుస్థాపనలు చేయనున్నారు. రోడ్ల నిర్మాణాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
TG: మూసీ సుందరీకరణలో భాగంగా నదీ గర్భంలోని నిర్మాణాలనే తొలగిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. బఫర్ జోన్‌లో ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. మూసీ పరిరక్షణ, చెరువుల ఆక్రమణలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో ఆయన మాట్లాడారు. గత పదేళ్లలో పూర్తిగా 44, పాక్షికంగా 127 చెరువులు కబ్జాకు గురైనట్లు వెల్లడించారు. మూసీ ప్రక్షాళనకు రూ.1.50లక్షల కోట్లు అనే వార్తలను ఆయన కొట్టిపారేశారు.
AP: సెంచరీ దాటిన టమాటా, ఉల్లి ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నేరుగా రైతుల నుంచి పంటను కొనుగోలు చేసి రైతు బజార్లకు తరలించాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఇవాళ్టి నుంచి 13 జిల్లాల్లోని రైతు బజార్లలో కిలో టమాటా రూ.50, ఉల్లి రూ.40-45 చొప్పున విక్రయించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆధార్ కార్డుతో వెళితే కుటుంబానికి కిలో చొప్పున ఇస్తామన్నారు.
AP: గత టీడీపీ ప్రభుత్వంలో ప్రజలను పోలవరం ప్రాజెక్టుకు సందర్శనకు ఆర్టీసీ బస్సుల్లో తీసుకెళ్లి ఉచితంగా భోజనాలు పెట్టేవారు. దీనికి సంబంధించి 2018 డిసెంబర్ నుంచి 2019 మార్చి వరకు ఖర్చు చేసిన నిధులను కాంట్రాక్టర్లకు వైసీపీ ప్రభుత్వం చెల్లించలేదు. వారు హైకోర్టును ఆశ్రయించగా 12 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. దీంతో మొత్తం రూ.23.11 కోట్ల నిధుల విడుదలకు జలవనరుల శాఖ తాజాగా ఆమోదం తెలిపింది.
Sorry, no posts matched your criteria.