news

News February 28, 2025

లిరిసిస్టుకు సారీ చెప్పిన స్టార్ హీరోయిన్

image

కంగనా రనౌత్, జావెద్ అక్తర్ వివాదం సమసింది. వీరిద్దరూ పరస్పరం వేసుకున్న పరువు నష్టం దావా కేసులను వెనక్కి తీసుకున్నారు. ‘ఇన్నేళ్ల తర్వాత ఈ వ్యవహారం ముగిసింది. నాకు కలిగించిన అసౌకర్యానికి ఆమె క్షమాపణ చెప్పారు’ అని అక్తర్ బాంద్రా కోర్టు వద్ద మీడియాకు తెలిపారు. 2016లో Email అంశంపై హృతిక్ రోషన్‌తో కంగనా బహిరంగంగా గొడవపడ్డారు. దీనిపై రోషన్ కుటుంబానికి సారీ చెప్పాలని అక్తర్ కోరడంతో ఈ వివాదం మొదలైంది.

News February 28, 2025

బ్యారక్ మార్చాలని వంశీ పిటిషన్

image

AP: తన బ్యారక్ మార్చాలని వైసీపీ నేత వల్లభనేని వంశీ విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టును కోరారు. ఈమేరకు ఆయన తరఫు లాయర్లు పిటిషన్ వేశారు. బ్యారక్‌ను మార్చడం కుదరకపోతే, కొందరు ఖైదీలను తన గదిలో ఉంచాలని విన్నవించారు. తనకు 6-4 సైజ్ బ్యారక్ ఇచ్చారని, అందులో మంచం కూడా పట్టడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా తనకు ఆస్తమా ఉందని, సెల్‌లో తనకు తోడుగా మరొకరని ఉంచాలని నిన్న జడ్జిని వంశీ కోరిన సంగతి తెలిసిందే.

News February 28, 2025

వీటిల్లో తక్కువ ధరకే విమాన ప్రయాణం!

image

విమానంలో ప్రయాణించడం ఖర్చుతో కూడుకున్నదని చాలా మంది భావిస్తుంటారు. అయితే, విమానయాన సంస్థలను బట్టి టికెట్ ధరలుంటాయి. ప్రపంచంలో అతి తక్కువ ధరకే విమాన ప్రయాణం అందిస్తోన్న సంస్థగా Air Asiaకి పేరుంది. దీని తర్వాత వోలోటియా, ఫ్లైనాస్, ట్రాన్సావియా ఫ్రాన్స్‌తో పాటు ఐదో స్థానంలో ఇండియాకు చెందిన ఇండిగో ఉంది. ఇక కాస్ట్లీయెస్ట్ ఎయిర్‌లైన్స్‌ జాబితాలో ఖతర్ ఎయిర్‌వేస్, సింగపూర్ ఎయిర్‌లైన్స్, ఎమిరేట్స్ ఉన్నాయి.

News February 28, 2025

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే కాంగ్రెస్ పోరాటం: మంత్రి ఉత్తమ్

image

TG: సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన టీపీసీసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్‌లో విపక్షాలకు గొంతే లేకుండా చేసిందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్‌ పోరాటం చేస్తోందన్నారు. జై బాపు, జై భీమ్‌, జై సంవిధాన్‌ కాంగ్రెస్‌ నినాదాలని చెప్పారు.

News February 28, 2025

ఒక్క పోస్ట్‌తో టూరిస్ట్ ప్లేస్‌గా మారిపోయింది!

image

ఏదైనా కొండను చూసినప్పుడు అది జంతువు లేక మనిషి ఆకారంలో కనిపించడాన్ని గమనిస్తుంటాం. ఓ కొండ అచ్చం కుక్క ముఖం ఆకారంలో కనిపించడంతో అది చూసేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. చైనాలోని షాంఘైకి చెందిన గువో కింగ్‌షాన్ తన వెకేషన్ ఫొటోను షేర్ చేయగా అందులో ప్రత్యేకమైన ఆకారంలో ఉన్న పర్వతంపై అందరి దృష్టీ పడింది. దీనిని ‘పప్పీ మౌంటేన్’ అని ఆమె పిలిచింది. దీంతో ఫొటోగ్రాఫర్లు, టూరిస్టులు ఆ ప్రాంతానికి తరలివస్తున్నారు.

News February 28, 2025

GET READY: రేపు 11AM గంటలకు ‘కన్నప్ప’ టీజర్

image

మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న ‘కన్నప్ప’ సినిమా టీజర్ రేపు విడుదల కానుంది. మార్చి 1వ తేదీన ఉదయం 11 గంటలకు టీజర్ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే రిలీజైన ‘శివ శివ శంకరా’ సాంగ్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ‘టీజర్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో మంచు మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కన్నప్ప’ ఏప్రిల్ 25న విడుదలవనుంది.

News February 28, 2025

ఈశా ఫౌండేషన్ పై చర్యలు తీసుకోవద్దు: సుప్రీంకోర్టు

image

ఈశా ఫౌండేషన్ కేసులో హైకోర్టు తీర్పు సరైనదేనని సుప్రీంకోర్టు తెలిపింది. ఫౌండేషన్‌పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తమిళనాడు వెల్లియంగిరిలోని ఫౌండేషన్‌కు పర్యావరణ అనుమతులు లేవని రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు నోటీసులు జారీచేసింది. దీంతో ఈశా ఫౌండేషన్ హైకోర్టును సంప్రదించింది. నిర్మాణం సక్రమంగానే జరిగిందని హైకోర్టు నోటీసులను కొట్టివేయడంతో బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

News February 28, 2025

నిర్మాత మృతి.. రూ.100 కోట్ల కోసం మాజీ ఎమ్మెల్యేల కంగారు?

image

TG: దుబాయ్‌లో నిర్మాత కేదార్ మృతి వెనుక మిస్టరీ తేలడం లేదు. గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తుండగా పోస్టుమార్టంలోనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి. మరోవైపు కేదార్‌ వద్ద పలువురు మాజీ MLAలు రూ.100 కోట్ల డబ్బు ఉంచినట్లు సమాచారం. ఆయన చనిపోవడంతో ఎలా రాబట్టుకోవాలో తెలియక కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది.

News February 28, 2025

స్టాక్‌మార్కెట్: ₹10L CR బ్లడ్‌బాత్‌కు విరామం!

image

స్టాక్‌మార్కెట్ల పతనంతో ఇన్వెస్టర్లు ₹10L CR నష్టపోయారు. నిఫ్టీ 22,124 (-420), సెన్సెక్స్ 73,198 (-1414) వద్ద ముగిశాయి. Mid, SmallCap సూచీలు 2.5% మేర కుంగాయి. ఆటో, FMCG, IT, మీడియా, మెటల్, ఫార్మా, రియాల్టి, హెల్త్‌కేర్, O&G, PSU బ్యాంకు షేర్లు విలవిల్లాడాయి. శ్రీరామ్ ఫైనాన్స్, HDFC బ్యాంకు, కోల్ ఇండియా, ట్రెంట్, హిందాల్కో టాప్ గెయినర్స్. ఇండస్‌ఇండ్, టెక్ఎం, విప్రో, ఎయిర్‌టెల్, M&M టాప్ లూజర్స్.

News February 28, 2025

ఆప్ హెల్త్‌కేర్ మోడల్ డొల్ల.. డొల్ల: CAG రిపోర్టు

image

CAG నివేదికలు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ డొల్లతనాన్ని బయటపెడుతున్నాయి. ఢిల్లీ Govt ఆస్పత్రుల్లో 50-60% డాక్టర్ల కొరత ఉందని హెల్త్‌కేర్ నివేదిక పేర్కొంది. సర్జరీల కోసం రోగులు 6-8 నెలలు ఎదురుచూడాల్సి వచ్చినట్టు తెలిపింది. 14 ఆస్పత్రుల్లో ICU, 16లో బ్లడ్‌బ్యాంక్స్, ఆక్సిజన్ సరఫరా, అంబులెన్స్, మార్చురీలు లేవంది. కేంద్రమిచ్చిన కొవిడ్ నిధుల్ని ఖర్చు చేయలేదని, మొహల్లా క్లినిక్కుల్లో బాత్రూములు లేవంది.