India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: తన వల్ల కొందరికి ఇబ్బందులు తలెత్తుతాయని ఊహించలేదని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. తన పని తీరు వల్ల క్యాడర్‌లో సమన్వయ లోపం ఏర్పడిందని, ఆ ఇబ్బందులను తానే సరిదిద్దుకుంటానని చెప్పారు. అమరావతిలో టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు పల్లా, ఎంపీ కేశినేని, వర్ల రామయ్యతో ఆయన భేటీ అయ్యారు. కాగా రేపు పార్టీ పెద్దల ఆధ్వర్యంలో తిరువూరులో సమావేశం నిర్వహిస్తున్నారు.
TG: తన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ వెనక్కి తీసుకున్నా సినీ ఇండస్ట్రీ వాళ్లు ఆమెపై కామెంట్స్ చేయడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆమె ఆవేశంలో మాట్లాడారని చెప్పారు. తన తప్పును గ్రహించి, వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారని తెలిపారు. అంతకంటే ముందు సురేఖపై సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్‌పైనా సినిమా వాళ్లు స్పందించి ఉంటే బాగుండేది అని పొన్నం అభిప్రాయపడ్డారు.
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళిని యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిశారు. ఈ ఫొటోలో ఎన్టీఆర్ స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇటీవల విడుదలైన ‘దేవర’తో ఎన్టీఆర్ హిట్ అందుకున్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఓ సెంటిమెంట్‌ను బ్రేక్ చేశారు. రాజమౌళి సినిమాలో నటించిన హీరోల తదుపరి చిత్రాలు ఫెయిల్ అయ్యే సంస్కృతిని ఆయన తిరగరాశారు.
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాను అహిల్యానగర్‌గా మారుస్తూ ఆ రాష్ట్ర సర్కారు ఈ ఏడాది మార్చిలో చేసిన ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. రాష్ట్ర మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ ఈ విషయాన్ని ప్రకటించారు. 18వ శతాబ్దానికి చెందిన మరాఠా రాణి పుణ్యశ్లోక్ అహిల్యా దేవి పేరును ఆ జిల్లాకు పెట్టాలంటూ చాలాకాలంగా డిమాండ్ ఉంది. ఈ ఏడాది సరిగ్గా ఆమె 300వ జయంతి సందర్భంలో పేరు మారడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ సిరీస్‌లో కెప్టెన్ జాక్ స్పారో రోల్‌తో జానీ డెప్ చాలామంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా చిన్నారులకు ఆ పాత్ర బాగా ఇష్టం. ఈ నేపథ్యంలో స్పెయిన్‌లో ఓ ఆస్పత్రిలో ఉన్న పిల్లల్ని ఆయన తాజాగా జాక్ స్పారో గెటప్‌లో వెళ్లి అలరించారు. క్యాన్సర్ బారిన పడ్డ చిన్నారులు కూడా వారిలో ఉన్నారు. వారందరినీ నవ్వించి ఆనందింపచేశారు. ఆయన సహృదయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
తమిళనాట రాజకీయాల్లో కీలక పార్టీ ‘ఏఐఏడీఎంకే’ ఏర్పాటై ఈ నెల 17కు 53ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ వ్యవస్థాపకుడు MGR ఫ్యాన్స్‌కు AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘పురచ్చి తలైవర్’ MGRపై అభిమానం తాను చెన్నైలో ఉన్నప్పుడు మొదలైందని తెలిపారు. పవన్‌ను వ్యతిరేకిస్తున్న డీఎంకే సర్కారుకు చెక్ పెట్టేలా ఏఐఏడీఎంకేకి దగ్గరయ్యేలా పవన్ ట్వీట్ ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
TG: కాలం చెల్లిన వాహనాల్ని తుక్కుగా మార్చే వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వనుంది. ‘వెహికల్ స్క్రాప్ పాలసీ’ కింద బైక్స్‌కు లైఫ్ ట్యాక్స్‌లో ₹1,000-₹7,OOO, 4 వీలర్స్‌కు ₹15,000-₹50,000 రాయితీని కల్పించనుంది. కొత్తగా కొనే వాహనాల విలువను బట్టి డిస్కౌంట్ ఉంటుందని సమాచారం. ఇది వ్యక్తిగత వాహనాలకు, రవాణా వాహనాలకు వేర్వేరు విధాలుగా వర్తించనుంది. 2 రోజుల్లో దీనిపై ఉత్తర్వులు రానున్నాయి.
సెబీ, ట్రాయ్‌ల పనితీరుపై పార్లమెంటు PAC ఈ నెల 24న సమీక్షించనుంది. ఈ మేరకు సెబీ చీఫ్ మాధబీ పురీ, ట్రాయ్ ఛైర్మన్ అనిల్ కుమార్ లాహోటిలకు సమన్లు జారీ చేసింది. అయితే, ఈ సమీక్షకు రెండు సంస్థల నుంచి మాదబీ, లాహోటిల తరఫున సీనియర్ అధికారులు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు కమిటీ పేర్కొంది. ఆర్థిక అవకతవకలపై ఇటీవల మాధబి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ ఈ సమీక్షకు ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా వారసుడు హషీమ్ సఫీద్దీన్ హతమైనట్లు సౌదీ మీడియా అల్ హదత్ పేర్కొంది. సదరన్ బీరుట్‌లోని హెజ్బొల్లా ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై జరిగిన దాడుల్లో ఆయన మరణించినట్లు తెలుస్తోంది. సఫీద్దీన్‌తోపాటు ఆయన అనుచరులు కూడా మరణించినట్లు సమాచారం. కాగా ఇజ్రాయెల్‌పై మిస్సైళ్ల దాడి చట్టబద్ధమేనని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
కర్ణాటకలో సంచలనం సృష్టించిన <<14026281>>రేణుకాస్వామి<<>> హత్య కేసులో నిందితుడు హీరో దర్శన్ బళ్లారి జైలులో ఉన్నారు. ఇటీవల రేణుకాస్వామి ఆత్మ తనని వెంటాడుతోందని, కలలోకి వచ్చి భయపెడుతోందని జైలు అధికారులకు దర్శన్ చెప్పినట్లు తెలుస్తోంది. తనను బెంగళూరు జైలుకు మార్చాలని కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే అర్ధరాత్రులు దర్శన్ గట్టిగా కేకలు వేస్తున్నారని, నిద్రలో కలవరిస్తున్నారని తోటి ఖైదీలు చెప్పినట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.