India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉగ్రవాద సంస్థల జాబితా నుంచి తాలిబన్లను తొలగించాలని రష్యా నిర్ణయించినట్లు తెలుస్తోంది. టాస్ వార్తాసంస్థ కథనం ప్రకారం.. అత్యున్నత స్థాయి సమావేశంలో రష్యా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. చట్టపరంగా దీనికి పలు అడ్డంకులున్నప్పటికీ వాటిని వీలైనంత త్వరగా తొలగించాలని దేశాధ్యక్షుడు పుతిన్ భావిస్తున్నారు. తాలిబన్లతో సహృద్భావ బంధాన్ని ఏర్పరచుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి.
హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ యాచకుడి కూతురు వైద్యురాలిగా మారారు. 2004లో మక్‌లోడ్ గంజ్ వీధుల్లో తన తల్లిదండ్రులతో కలిసి పింకీ హర్యాణ్ బిచ్చమెత్తుకునేది. ఆ సమయంలో బౌద్ధబిక్షువు లాబ్‌సంగ్ జామ్ యాంగ్ కంటపడగా ఆమెను ఓ స్కూల్‌లో చేర్పించారు. పింకీ చదువుల్లో బాగా రాణించి ట్రాంగ్-లెన్ ట్రస్ట్ సాయంతో చైనాలో ఎంబీబీఎస్ పట్టా అందుకున్నారు. ఇటీవల ఆమె ధర్మశాలకు తిరిగి వచ్చి ప్రాక్టీస్‌కు సిద్ధమవుతున్నారు.
TG: హైదరాబాద్‌లోని పలుచోట్ల ప్రస్తుతం వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్, సరూర్ నగర్, బడంగ్‌పేట్, మీర్ పేట, చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా, యాకుత్‌పురా, ఉప్పుగూడ, బార్కస్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, లక్డీకపూల్, లిబర్టీ, హిమాయత్‌నగర్, నారాయణగూడ, మలక్‌పేట, కొత్తపేట, సైదాబాద్‌లో వర్షం కురుస్తోంది.
కెప్టెన్సీ విషయంలో ధోనీకంటే రోహిత్ శర్మ ఏమాత్రం తక్కువ కాదని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ‘వారిద్దరినీ పోల్చి చూడకూడదు. తన సహచరుల్లో గెలవాలన్న స్ఫూర్తి నింపేవాడే నిజమైన నాయకుడు. జట్టుగా ఆడే క్రీడలో అదే ముఖ్యం కూడా. ఈ విషయంలో ధోనీకంటే రోహిత్ ఏం తక్కువ కాదు. గంగూలీ, ధోనీ, కోహ్లీ, రోహిత్.. వీరంతా భారత క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లారు’ అని కొనియాడారు.
సూపర్ నేచురల్ కథాంశాన్ని సస్పెన్స్‌తో ముడిపెట్టి రూపొందించిన ‘తుంబాడ్’ సినిమా రీ-రిలీజ్‌లో దుమ్మురేపుతోంది. ఆరేళ్ల క్రితం తొలి రిలీజ్‌లో దేశవ్యాప్తంగా కేవలం రూ.12.30 కోట్లే కలెక్ట్ చేసిన ఈ మూవీ, సెకండ్ రిలీజ్‌లో ఇప్పటి వరకు ఏకంగా రూ.30 కోట్లు వసూలు చేసింది. దసరా సెలవులు వచ్చిన నేపథ్యంలో రూ.50 కోట్ల మార్కు దాటే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
UPలోని కాన్పూర్‌లో రష్మీ, రాజీవ్ దూబే జంట ‘రివైవల్ వరల్డ్’ పేరుతో ఓ థెరపీ సెంటర్‌ను నెలకొల్పింది. ఇజ్రాయెల్ టైమ్ మెషీన్‌తో ఆక్సిజన్ థెరపీ చేసి వృద్ధులను 25ఏళ్ల వారిగా మారుస్తామంటూ నమ్మించింది. ఒక్కో సెషన్‌కు వారి నుంచి రూ.90వేలు రాబట్టింది. అలా దాదాపు పాతిక మందిని మోసం చేసి వారి నుంచి రూ.35కోట్లు వసూలు చేసింది. మోసాన్ని గుర్తించిన ఓ కస్టమర్ ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు ఈ నెల 6న భారత్ రానున్నారు. ఆదివారం నుంచి ఈ నెల 10 వరకు ఇక్కడ పర్యటిస్తారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోదీతో ఆయన చర్చలు జరపనున్నారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో కూడా సమావేశం అవుతారు. ఢిల్లీతోపాటు ముంబై, బెంగళూరులో మయిజ్జు పర్యటిస్తారు. కాగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మయిజ్జు భారత పర్యటనకు వస్తుండడం విశేషం.
రక్షణ విషయంలో భారత్‌కూ ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ తరహా రక్షణ వ్యవస్థలు కీలకమని వాయుసేన చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అభిప్రాయపడ్డారు. ‘ఇప్పటికే మనం ఐరన్ డోమ్‌వంటివి కొంటున్నా అవి సరిపోవు. దేశంలోని కీలక ప్రాంతాల్లో రక్షణ వ్యవస్థల్ని మోహరించాలి. గగనతల దాడుల్ని తక్కువ అంచనా వేయకూడదు. ఆయుధ సరఫరా గడ్డు పరిస్థితుల్లో ఉన్నా భారత్ మేనేజ్ చేస్తోంది. నిరంతరం యుద్ధ సన్నద్ధతతో ఉండటం మనకు అత్యవసరం’ అని పేర్కొన్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అనంతరం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. తన కుటుంబసభ్యులు, సన్నిహితులు, సహచర నటులు, అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై చూపించిన ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. మీ ప్రార్థనలే తనకు శ్రీరామరక్షగా నిలిచాయని పేర్కొన్నారు. కాగా రజినీ నటించిన ‘వేట్టయన్’ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
TG: రుణమాఫీ గురించి పట్టించుకోని పార్టీలు ఇప్పుడు మాట్లాడుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. రైతులు ఆదరిస్తేనే తాము అధికారంలోకి వచ్చామని మీడియా సమావేశంలో చెప్పారు. అవసరమైతే ఏదైనా పథకాన్ని ఆపి రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. కచ్చితంగా రూ.2 లక్షలవరకు రుణమాఫీ చేస్తామన్నారు. అన్ని సబ్సిడీ పథకాలను పునరుద్ధరిస్తామని తెలిపారు.
Sorry, no posts matched your criteria.