news

News February 28, 2025

లిరిసిస్ట్‌గా మారిన రామ్ పోతినేని

image

తమ సినిమాల కోసం హీరోలు పాటలు పాడటం చూశాం. కానీ, తొలిసారి ఉస్తాద్ రామ్ పోతినేని తన కొత్త సినిమా కోసం రైటర్‌గా మారిపోయారు. ‘RAPO22’లో ఆయన లవ్ సాంగ్‌కు లిరిక్స్ రాస్తున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. మొత్తం ఐదు సాంగ్స్ ఉండనుండగా ఇప్పటికే 4 సాంగ్స్ పూర్తయ్యాయని తెలుస్తోంది. ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్సే నటిస్తుండగా పి.మహేశ్ బాబు తెరకెక్కిస్తున్నారు.

News February 28, 2025

అమిత్ షా మీటింగ్: బంగ్లాదేశీయులు, రోహింగ్యాల ఏరివేతే అజెండా!

image

HM అమిత్ షా అధ్యక్షతన నేడు ఢిల్లీలో హై లెవల్ మీటింగ్ జరగనుంది. CM రేఖాగుప్తా, MoH అధికారులు హాజరవుతారు. శాంతి భద్రతలు, అక్రమ వలసదారుల ఏరివేతే అజెండా అని తెలిసింది. ఢిల్లీ సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో బంగ్లా దేశీయులు, రోహింగ్యాలు అక్రమంగా నివసిస్తున్నారు. వీరిని దేశం నుంచి తరిమేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తారని సమాచారం. ఇప్పటికే పార్లమెంటులో ఇమ్మిగ్రేషన్ బిల్లును ఆమోదించడం గమనార్హం.

News February 28, 2025

ఏపీ బడ్జెట్ కేటాయింపులు ఇలా

image

అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ సమర్పించారు.
* వైద్య, ఆరోగ్య కుటుంబశాఖ: రూ.19,264 కోట్లు
* పంచాయతీరాజ్ శాఖ: రూ.18,847 కోట్లు
* జలవనరులశాఖ: రూ.18,019 కోట్లు
* మున్సిపాలిటీ, పట్టణాభివృద్ధి శాఖ: రూ.13,862 కోట్లు
* పౌరసరఫరాలశాఖ: రూ.3,806 కోట్లు
* పరిశ్రమలు, వాణిజ్యశాఖ: రూ.3,156 కోట్లు
* నైపుణ్యాభివృద్ధి శాఖ: రూ.1,228 కోట్లు
* ఉన్నత విద్యాశాఖ: రూ.2,506 కోట్లు

News February 28, 2025

కుంభమేళాలో మహిళల స్నానం వీడియోలు.. వ్యక్తి అరెస్ట్

image

మహిళల స్నానం వీడియోల కేసులో UP పోలీసులు పురోగతి సాధించారు. బెంగాల్‌కు చెందిన అమిత్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. అతడు మహిళలు స్నానం చేస్తుండగా, దుస్తులు మార్చుకుంటుండగా వీడియోలు, ఫొటోలు తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసినట్లు గుర్తించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని చెప్పారు. కాగా ఇటీవల జరిగిన కుంభమేళాలో మహిళలు స్నానం చేస్తున్న వీడియోలు టెలిగ్రామ్, యూట్యూబ్‌లో కనిపించడం తీవ్ర కలకలం రేపింది.

News February 28, 2025

2027 నాటికి పోలవరం పూర్తి: మంత్రి

image

AP: పోలవరం ప్రాజెక్టు 73% పూర్తయిందని, 2027 నాటికి దాన్ని పూర్తి చేస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఏటా దాదాపు 2వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రం పాలవుతున్నాయని, వీటిని రాయలసీమకు మళ్లిస్తామని చెప్పారు. ఇందుకోసం CM చంద్రబాబు పోలవరం-బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారన్నారు. అలాగే హంద్రీనీవా కాలువ వెడల్పు, వెలిగొండ, చింతలపూడి, వంశధార ఫేజ్-2 పనులు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు.

News February 28, 2025

BITCOIN క్రాష్: ఒక కాయిన్‌పై ₹26లక్షల లాస్

image

క్రిప్టో మార్కెట్లు క్రాష్ అవుతున్నాయి. క్రిప్టో రారాజు బిట్‌కాయిన్ విలవిల్లాడుతోంది. JAN 20న $109,114 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకిన BTC నేడు $79,362కు దిగజారింది. అంటే 40 రోజుల్లోనే $30,000 (రూ.26,10,000) మేర నష్టపోయింది. మార్కెట్ విలువ $2.10T నుంచి $1.59కి తగ్గింది. అంటే ఇన్వెస్టర్లు $50,000 కోట్లను వెనక్కి తీసుకున్నారు. వీలైనంత వరకు చేతిలో క్యాష్ ఉంచుకుంటున్నారు.

News February 28, 2025

BIG BREAKING: ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల బీమా

image

AP: బడ్జెట్ ప్రసంగంలో మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది నుంచి కొత్త పథకం అమల్లోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రూ.25 లక్షల ఆరోగ్య బీమా పథకం అమల్లోకి తెస్తామని వెల్లడించారు. దీనివల్ల మధ్యతరగతి, పేద ప్రజలు ఎలాంటి ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం పొందవచ్చని వివరించారు. అటు ఆరోగ్యశాఖకు రూ.19264 కోట్లు కేటాయించామన్నారు.

News February 28, 2025

ఏపీ బడ్జెట్ కేటాయింపులు ఇవే

image

అసెంబ్లీలో మంత్రి పయ్యావుల బడ్జెట్ ప్రవేశపెట్టారు.
* బీసీల సంక్షేమం: రూ.47,456 కోట్లు
* పాఠశాల విద్యాశాఖ: రూ.31,805 కోట్లు
* ఎస్సీల సంక్షేమం-రూ.20,281 కోట్లు
* ఎస్టీల సంక్షేమం-రూ.8,159
* అల్పసంఖ్యాకులు: రూ.5,434 కోట్లు
* వ్యవసాయ అనుబంధ సంఘాలు-రూ.13,487 కోట్లు
* ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్‌షిప్-రూ.3,377 కోట్లు
* మహిళలు, దివ్యాంగులు, వృద్ధులు-రూ.4,332 కోట్లు

News February 28, 2025

మళ్లీ తగ్గిన బంగారం ధరలు

image

వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గి శుభకార్యాల వేళ సామాన్యుడికి ఉపశమనం కలిగించాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.500 తగ్గి రూ.79,600లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.540 తగ్గడంతో రూ.86,840కు చేరింది. అటు వెండి ధర కూడా కేజీపై రూ.1000 తగ్గి రూ.1,05,000గా ఉంది.

News February 28, 2025

సవాళ్లను అధిగమించడంలో బాబు దిట్ట: పయ్యావుల

image

AP: సవాళ్లను అధిగమించడంలో సీఎం చంద్రబాబు దిట్ట అని ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అసెంబ్లీలో రూ.3.22 లక్షల కోట్లతో పయ్యావుల పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ‘గత ప్రభుత్వ విధ్వంస పాలన కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. జీతాలు కూడా చెల్లించలేని స్థితికి వెళ్లింది. రాష్ట్ర పునర్నిర్మాణం సవాల్‌తో కూడుకుని ఉంది. కానీ దీనిని ఎలా అధిగమించాలో బాబుకు బాగా తెలుసు’ అని ఆయన ప్రసంగించారు.