India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: పోలవరం ప్రాజెక్టు 73% పూర్తయిందని, 2027 నాటికి దాన్ని పూర్తి చేస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఏటా దాదాపు 2వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రం పాలవుతున్నాయని, వీటిని రాయలసీమకు మళ్లిస్తామని చెప్పారు. ఇందుకోసం CM చంద్రబాబు పోలవరం-బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారన్నారు. అలాగే హంద్రీనీవా కాలువ వెడల్పు, వెలిగొండ, చింతలపూడి, వంశధార ఫేజ్-2 పనులు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు.

క్రిప్టో మార్కెట్లు క్రాష్ అవుతున్నాయి. క్రిప్టో రారాజు బిట్‌కాయిన్ విలవిల్లాడుతోంది. JAN 20న $109,114 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకిన BTC నేడు $79,362కు దిగజారింది. అంటే 40 రోజుల్లోనే $30,000 (రూ.26,10,000) మేర నష్టపోయింది. మార్కెట్ విలువ $2.10T నుంచి $1.59కి తగ్గింది. అంటే ఇన్వెస్టర్లు $50,000 కోట్లను వెనక్కి తీసుకున్నారు. వీలైనంత వరకు చేతిలో క్యాష్ ఉంచుకుంటున్నారు.

AP: బడ్జెట్ ప్రసంగంలో మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది నుంచి కొత్త పథకం అమల్లోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రూ.25 లక్షల ఆరోగ్య బీమా పథకం అమల్లోకి తెస్తామని వెల్లడించారు. దీనివల్ల మధ్యతరగతి, పేద ప్రజలు ఎలాంటి ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం పొందవచ్చని వివరించారు. అటు ఆరోగ్యశాఖకు రూ.19264 కోట్లు కేటాయించామన్నారు.

అసెంబ్లీలో మంత్రి పయ్యావుల బడ్జెట్ ప్రవేశపెట్టారు.
* బీసీల సంక్షేమం: రూ.47,456 కోట్లు
* పాఠశాల విద్యాశాఖ: రూ.31,805 కోట్లు
* ఎస్సీల సంక్షేమం-రూ.20,281 కోట్లు
* ఎస్టీల సంక్షేమం-రూ.8,159
* అల్పసంఖ్యాకులు: రూ.5,434 కోట్లు
* వ్యవసాయ అనుబంధ సంఘాలు-రూ.13,487 కోట్లు
* ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్‌షిప్-రూ.3,377 కోట్లు
* మహిళలు, దివ్యాంగులు, వృద్ధులు-రూ.4,332 కోట్లు

వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గి శుభకార్యాల వేళ సామాన్యుడికి ఉపశమనం కలిగించాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.500 తగ్గి రూ.79,600లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.540 తగ్గడంతో రూ.86,840కు చేరింది. అటు వెండి ధర కూడా కేజీపై రూ.1000 తగ్గి రూ.1,05,000గా ఉంది.

AP: సవాళ్లను అధిగమించడంలో సీఎం చంద్రబాబు దిట్ట అని ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అసెంబ్లీలో రూ.3.22 లక్షల కోట్లతో పయ్యావుల పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ‘గత ప్రభుత్వ విధ్వంస పాలన కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. జీతాలు కూడా చెల్లించలేని స్థితికి వెళ్లింది. రాష్ట్ర పునర్నిర్మాణం సవాల్‌తో కూడుకుని ఉంది. కానీ దీనిని ఎలా అధిగమించాలో బాబుకు బాగా తెలుసు’ అని ఆయన ప్రసంగించారు.

డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ దెబ్బకు ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. మునుపెన్నడూ చూడని రీతిలో విలవిల్లాడుతున్నాయి. నిన్న US సూచీలు భారీగా నష్టపోయాయి. నాస్‌డాక్ 2.75, S&P500 1.28, నేడు నిక్కీ 2.94, హాంగ్‌సెంగ్ 2.36, జకార్తా కాంపోజిట్ 2.85, సెట్ కాంపోజిట్ 1.63, నిఫ్టీ 1.6, సెన్సెక్స్ 1.37% మేర పతనమయ్యాయి. అనిశ్చితి పెరగడంతో ఇన్వెస్టర్లకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. నేడు మీ పోర్టుఫోలియో ఎలా ఉంది?

AP: గంజాయి, డ్రగ్స్ స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరిపై PIT-NDPS చట్టం కింద కేసు పెట్టి ఏడాది పాటు జైలు శిక్ష వేస్తోంది. తొలిసారిగా విజయవాడ పోలీసులు ఇద్దరిపై అభియోగాలు మోపారు. జిల్లాల వారీగా గంజాయి, డ్రగ్స్ స్మగ్లర్ల జాబితా తయారు చేస్తున్నారు. ఇక నుంచి అరెస్ట్ అయ్యాక బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ మళ్లీ అవే నేరాలకు పాల్పడటం కుదరదని పోలీసులు వెల్లడించారు.

AP: సినీనటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు రాజంపేట సబ్ జైలుకు తరలించారు. అక్కడ ఆయనకు జైలు అధికారులు 2261 నంబర్ కేటాయించారు. పోసాని కోసం జైలులో ఓ గది ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కాగా పోసానికి కేటాయించిన నంబర్లను కలిపితే 11 వస్తోందంటూ టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. వైసీపీకి ఆ నంబర్ కలిసొచ్చిందంటూ జోకులు వేసుకుంటున్నారు.

దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మెక్సికో, కెనడా, చైనాపై టారిఫ్స్ మార్చి 4 నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ ప్రకటించడం నెగటివ్ సెంటిమెంటుకు దారితీసింది. నిఫ్టీ 22,265 (-280), సెన్సెక్స్ 73,690 (-930) వద్ద ట్రేడవుతున్నాయి. ఆటో, ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్, బ్యాంక్స్, O&G షేర్లు విలవిల్లాడుతున్నాయి. కోల్ ఇండియా, శ్రీరామ్ ఫైనాన్స్, రిలయన్స్, గ్రాసిమ్ టాప్ గెయినర్స్.
Sorry, no posts matched your criteria.