India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: ఫిరాయింపు MLAలపై స్పీకర్ విచారణ కొనసాగుతుండడం తెలిసిందే. వీరిలో దానం నాగేందర్(ఖైరతాబాద్), కడియం శ్రీహరి(ఘన్పూర్) అఫిడవిట్లూ ఇవ్వలేదు. పార్టీ మారినట్లు కడియం చెప్పగా దానం ఏకంగా CONG అభ్యర్థిగా SEC MP ఎన్నికల్లో పోటీచేశారు. తాజాగా WBలో TMCలో చేరిన BJP MLAపై వేటుపడింది. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై వేటు తప్పదని, ఈ 2చోట్ల ఉపఎన్నిక రావొచ్చనే చర్చ మొదలైంది. ఈ 2 స్థానాల్లోనూ గెలుస్తామని CONG చెబుతోంది.

హత్య కేసులో అరెస్టై జైలులో ఉన్న NDA అభ్యర్థి, జేడీ(యూ) నేత అనంత్ కుమార్ సింగ్ MLAగా విజయం సాధించారు. బిహార్ మోకామా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆర్జేడీ అభ్యర్థి వీణా దేవిపై 28,206 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. జన్ సురాజ్ పార్టీ పోల్ వర్కర్ దులార్ చంద్ యాదవ్ మర్డర్ కేసులో నవంబర్ 2న అరెస్టయ్యారు. అనంత్ కుమార్ సింగ్‌కు 91,416, వీణా దేవికి 63,210 ఓట్లు దక్కాయి.

AP: కూటమి అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించినట్లు CII సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇన్వెస్ట్మెంట్స్ రాబట్టగలిగామని వివరించారు. అటు రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు సంబంధించి లులూ గ్రూప్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సీఎం CBN, లులూ ఛైర్మన్ యూసుఫ్ అలీ సమక్షంలో అధికారులు, సంస్థ ప్రతినిధులు అంగీకార పత్రాలు మార్చుకున్నారు.

బిహార్ ఎన్నికల్లో NDA విజయం నేపథ్యంలో BJP, తృణమూల్ కాంగ్రెస్ మధ్య SMలో మాటల యుద్ధం నడుస్తోంది. బిహార్ తర్వాత బెంగాల్ వంతు అని BJP చేసిన ట్వీట్‌కు TMC కౌంటర్ ఇచ్చింది. BJP కలలు కంటూనే ఉండాలనే అర్థం వచ్చేలా మీమ్ పోస్ట్ చేసింది. నీటి అడుగున కుర్చీలో అస్థిపంజరమున్న ఫొటో షేర్ చేస్తూ ‘బెంగాల్లో గెలుపు కోసం BJP ఇంకా ఎదురుచూస్తోంది’ అని ఎద్దేవా చేసింది. 2026లో బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

TG: బిహార్ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పని ఖతమైందని, రాహుల్ గాంధీ ఇక పబ్జీ గేమ్‌కే పరిమితమవుతారని మంత్రి బండి సంజయ్ విమర్శించారు. KTR వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి BRS పతనం కొనసాగుతూనే ఉందన్నారు. దేశంలో రాహుల్, TGలో కేటీఆర్ ఐరన్ లెగ్స్ అని బండి ఎద్దేవా చేశారు. దేశం మొత్తం పోటీ చేస్తామని TRSను BRSగా మార్చిన కేసీఆర్ పత్తా లేకుండా పోయారని, చివరకు ఆ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీగా మారిందన్నారు.

TG: ‘జూబ్లీహిల్స్’ గెలుపు జోష్‌లో ఉన్న CONG అదే ఊపులో లోకల్ బాడీలనూ ఊడ్చేయాలని రెడీ అవుతోంది. త్వరలో రూరల్, అర్బన్ సంస్థల ఎలక్షన్స్ రానున్నాయి. ‘జూబ్లీ’ ఓటమితో నిరాశలో ఉన్న BRSకు ఇవి అగ్ని పరీక్షేనన్న చర్చ ఆ పార్టీలో నెలకొంది. ‘జూబ్లీ’ ప్రభావం స్థానిక ఎన్నికలపై పడుతుందని, ఈ తరుణంలో గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నాయకులు, శ్రేణుల్లో స్థైర్యాన్ని నింపడం సవాలుగా మారుతుందని భావిస్తున్నారు.

బిహార్ ఎన్నికల్లో విజయంపై PM మోదీ స్పందించారు. ‘సుపరిపాలన, అభివృద్ధి, ప్రజానుకూల స్ఫూర్తి, సామాజిక న్యాయం గెలిచింది. చరిత్రాత్మక, అసమాన గెలుపుతో NDAను ఆశీర్వదించిన బిహార్ ప్రజలకు కృతజ్ఞతలు. ప్రజలకు సేవ చేసేందుకు, బిహార్ కోసం పని చేసేందుకు ఈ తీర్పు మాకు మరింత బలాన్నిచ్చింది’ అని ట్వీట్ చేశారు. తమ ట్రాక్ రికార్డు, రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలనే తమ విజన్ ఆధారంగా ప్రజలు ఓటేశారని తెలిపారు.

ఈరోజు ప్రశ్న: విదురుడు హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించకుండా ‘మంత్రి’ పాత్రకే ఎందుకు పరిమితమయ్యారు?
జవాబు: ధృతరాష్ట్రుడు, పాండురాజు.. ఈ ఇద్దరూ అంబిక, అంబాలిక గర్భాన జన్మించారు. కానీ, విదురుడు దాసి గర్భాన జన్మించడం వలన, ఆనాటి రాజ్యాంగ నియమం ప్రకారం సింహాసనాన్ని అధిష్ఠించే అర్హతను కోల్పోయి, మంత్రి పాత్రకే పరిమితం అయ్యారు.
<<-se>>#Ithihasaluquiz<<>>

మెన్స్ ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో పసికూన UAE-Aని భారత్-A బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఊచకోత కోస్తున్నారు. దోహాలో జరుగుతున్న టీ20లో కేవలం 32 బంతుల్లోనే సెంచరీ కొట్టారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న వైభవ్ ఏకంగా 9 సిక్సర్లు, 10 ఫోర్లు బాదారు. దీంతో ఇండియా-A 10 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 149 రన్స్ చేసింది.

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA గెలుపుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ఇది వికసిత్ బిహార్‌పై నమ్మకం పెట్టుకున్న ప్రతి ఒక్కరి విజయమని అన్నారు. జంగిల్ రాజ్, బుజ్జగింపు రాజకీయాలు చేసే వారు ఏ వేషంలో వచ్చినా దోచుకునేందుకు అవకాశం లభించదని ట్వీట్ చేశారు. పని తీరు ఆధారంగా ప్రజలు తీర్పు చెప్పారని పేర్కొన్నారు. బిహార్ ప్రజల ప్రతి ఓటు మోదీ ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకానికి చిహ్నమని చెప్పారు.
Sorry, no posts matched your criteria.