news

News July 11, 2025

BJP రామచంద్రా.. నోరు తెరవరేం?: KTR

image

TG: భద్రాచలం ఆలయ భూముల <<16992146>>కబ్జాపై <<>> BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ట్విటర్‌లో స్పందించారు. ‘రాములోరి భూములను ఆక్రమిస్తుంటే మాట్లాడరేం? మీ భాగస్వామి ప్రభుత్వం(AP) చెరలో ఉన్నాయని వదిలేస్తున్నారా? లేక ఈసారి భద్రాద్రినే గంపగుత్తగా వారి చేతిలో పెడదామనుకుంటున్నారా? ఓట్ల కోసమే చేసే మీ రామజపాలను ప్రజలు గమనిస్తున్నారు. మోదీతో మాట్లాడతారో, మీ దోస్తు దగ్గర మోకరిల్లుతారో మీ ఇష్టం. భద్రాద్రిని కాపాడండి’ అని కోరారు.

News July 11, 2025

లీటర్ పెట్రోల్ ధర ఇరాన్‌లో రూ.2.4, వెనుజులాలో రూ.3.06!

image

భారత్‌లో లీటర్ పెట్రోల్ ధర సగటున రూ.100 ఉంది. అత్యధిక చమురు నిల్వలు ఉన్న ఇరాన్, వెనిజులా దేశాల్లో చాలా తక్కువ ధరకే పెట్రోల్ లభిస్తోంది. లీటర్ పెట్రోల్ ధర ఇరాన్‌లో రూ.2.4 ఉండగా వెనుజులాలో ₹3.06గా ఉంది. ఇండియాలో పెట్రోల్‌పై కేంద్రం ₹19.90, రాష్ట్రం 30-35% వరకు పన్ను(ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుంది) వసూలు చేస్తున్నాయి. అండమాన్‌లో దేశంలోనే తక్కువ ధరకు పెట్రోల్(రూ.82.42) లభిస్తోంది.

News July 11, 2025

ALL TIME HIGHకి చేరిన బిట్‌కాయిన్

image

క్రిప్టో కరెన్సీ రారాజు బిట్‌కాయిన్ సరికొత్త ఆల్-టైమ్ హైకి చేరుకుంది. COIN DESK ప్రకారం తొలిసారిగా $118,303.14కి చేరినట్లు తెలుస్తోంది. 24 గంటల క్రితం $111,169.90గా ఉన్న బిట్‌కాయిన్ విలువ 6.63శాతం పెరిగి ప్రస్తుతం సుమారు $118,303.14ను తాకి గత రికార్డులు బద్దలు కొట్టింది. మార్కెట్లు ఇలానే దూసుకెళ్తే ఇది $125Kని ఈజీగా రీచ్ అవుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

News July 11, 2025

విద్యార్థులపై లైంగిక వేధింపులు.. సీఎం సీరియస్

image

AP: కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో విద్యార్థినుల పట్ల సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై CM చంద్రబాబు సీరియస్ అయ్యారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తనకు నివేదిక అందిన అనంతరం ఆదేశించారు. ఈ నెల 9న విద్యార్ధినుల ఫిర్యాదుతో విచారించిన అధికారుల కమిటీ కళ్యాణ చక్రవర్తితో పాటు మరో ముగ్గురు వేధించినట్లు గుర్తించింది. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చక్రవర్తి కోసం గాలిస్తున్నారు.

News July 11, 2025

OFFICIAL.. 18న OTTలోకి కుబేర

image

టాలీవుడ్ కింగ్ నాగార్జున, తమిళ హీరో ధనుష్ కాంబినేషన్‌లో వచ్చిన కుబేర మూవీ OTT స్ట్రీమింగ్ ఖరారైంది. ఈ నెల 17వ తేదీ అర్ధరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. DSP మ్యూజిక్ అందించిన ఈ మూవీలో రష్మిక కీలక పాత్ర పోషించారు. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో రూ.134 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

News July 11, 2025

ఈ నెల 15న ముంబైలో టెస్లా షోరూం ప్రారంభం!

image

ఎలాన్ మస్క్‌కు చెందిన ఈవీ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్‌లో కార్యకలాపాలకు సిద్ధమైంది. ఈ నెల 15న ముంబైలోని బాంద్రాలో ఆ కంపెనీ తొలి షోరూంను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కార్లు ముంబైకి చేరుకున్నాయని జాతీయ మీడియా పేర్కొంది. 2021 నుంచే టెస్లా భారత మార్కెట్‌లో ప్రవేశించాలని ప్రయత్నించినా కంపెనీ ఏర్పాటు చేయాలన్న భారత్ కండిషన్లతో ఆలస్యమైంది. కాగా ఢిల్లీలోనూ షోరూంను ప్రారంభిస్తారని సమాచారం.

News July 11, 2025

శ్రీశైలం నీళ్లు ఎలా వాడుకుంటారో తెలుసా?

image

శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ నుంచి రాయలసీమ, తెలంగాణకు నీరందుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44వేల క్యూసెక్కులను రాయలసీమకు తరలించొచ్చు. తెలుగు గంగ, గాలేరు-నగరి కాలువల ద్వారా కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు నీరందుతోంది. హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకంతో అనంతపురం, చిత్తూరుకు నీరు వెళ్తోంది. అటు తెలంగాణ కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా లబ్ధి పొందుతోంది.

News July 11, 2025

ఇలా చేస్తే మీ ఆధార్ వివరాలు సేఫ్: UIDAI

image

ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా కాపాడుకునేందుకు బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలని UIDAI పేర్కొంది. దీనికోసం <>ఆధార్ వెబ్‌సైట్‌లో<<>> ఆధార్ నంబర్, క్యాప్చా, OTPతో లాగిన్ అవ్వాలి. LOCK/ UNLOCK ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసి బయోమెట్రిక్స్ తాత్కాలిక/పర్మినెంట్‌ లాక్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. CONSENT బాక్స్‌పై క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ నొక్కితే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. SHARE IT

News July 11, 2025

జగన్ పర్యటన.. మొత్తం నాలుగు కేసులు నమోదు

image

AP: YS జగన్ చిత్తూరు(D) బంగారుపాళ్యం పర్యటనపై తాజాగా మరో కేసు నమోదైంది. అనుమతి లేకున్నా రోడ్‌షో చేపట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. పరిమితికి మించి జన సమీకరణ చేపట్టారని, రోడ్డుపై మామిడికాయలు పారబోసి షరతులు ఉల్లంఘించారని, ఫొటోగ్రాఫర్‌పై జరిగిన దాడి ఘటనపై 3 వేర్వేరు కేసులు పెట్టారు. CC ఫుటేజ్, వీడియోలను పరిశీలిస్తున్న పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News July 11, 2025

ఫీజులు పెంచాలన్న అభ్యర్థనను తిరస్కరించిన HC

image

TG: ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫీజులు పెంచాలన్న పలు కాలేజీల అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా ఫీజులు నిర్ణయించాలని ఫీజుల నియంత్రణ కమిటీని ఆదేశించింది. కమిటీ నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని కాలేజీలకు న్యాయస్థానం స్పష్టం చేసింది.