news

News July 11, 2025

భారత వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్?

image

భారత వన్డే జట్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ త్వరలో బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్‌కు గిల్ సారథ్యం వహిస్తారని రాసుకొచ్చాయి. అలాగే టీ20 వైస్ కెప్టెన్సీని కూడా అప్పగిస్తారని పేర్కొంటున్నాయి. దీనిపై ప్రస్తుత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మతో BCCI చర్చలు జరిపినట్లు సమాచారం. కాగా గిల్ ప్రస్తుతం టెస్టు కెప్టెన్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

News July 11, 2025

ఇటలీలో భారీగా ఉద్యోగాలు.. ఇండియన్స్‌కు భలే ఛాన్స్

image

2028 కల్లా విదేశీయులకు 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న ఇటలీ నిర్ణయం భారతీయులకు మేలు చేయనుంది. తమ దేశంలో వృద్ధుల సంఖ్య పెరగుతుండటంతో వలసలను ప్రోత్సహించాలని ఇటలీ నిర్ణయించింది. ప్రస్తుతం ఇటలీలో 1,67,333 మంది భారతీయులు నివసిస్తున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు. ఈ క్రమంలో హోటల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్‌కేర్, డిజిటల్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ వంటి రంగాల్లో అవకాశాలు మెండుగా ఉంటాయని అంచనా.

News July 11, 2025

మీ పిల్లలూ స్కూల్‌కి ఇలాగే వెళుతున్నారా?

image

పిల్లలను స్కూళ్లకు పంపేందుకు పేరెంట్స్ ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా డబ్బులకు ఆశపడి వాహనదారులు లెక్కకుమించి విద్యార్థులను ఎక్కిస్తున్నారు. దీంతో పిల్లల ప్రయాణం ప్రమాదకరంగా సాగుతోంది. రవాణాశాఖ అధికారులు ఇలాంటి వాహనాలపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాల్లో తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.

News July 11, 2025

బిజినెస్ అప్‌డేట్స్

image

*హిందుస్థాన్ యునిలీవర్ లిమిటెడ్ (HUL) కొత్త సీఈవో, ఎండీగా ప్రియా నాయర్ నియామకం
*LICలో మరోసారి వాటాలు విక్రయించేందుకు కేంద్రం ప్రయత్నాలు
*వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకోలేదన్న TCS
*కెనడా దిగుమతులపై 35 శాతం టారిఫ్స్ విధించిన ట్రంప్, ఆగస్టు 1 నుంచి అమలు

News July 11, 2025

రూ.180 కోట్ల చెల్లింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

image

AP: 2014-19 మధ్య జరిగిన ఉపాధిహామీ పనుల బిల్లులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక పేమెంట్లు ఇవ్వలేదని, ఐదేళ్ల పాటు సమాచారం ఇవ్వకపోవడంతో కేంద్రం ఆ ఫైళ్లను మూసివేసిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. తాము పదేపదే విజ్ఞప్తులు చేయడంతో రూ.180 కోట్ల విలువైన 3.5 లక్షల ఉపాధి హామీ పనులను కేంద్రం రీస్టార్ట్ చేస్తూ బిల్లులు చెల్లించేందుకు అంగీకరించిందని వివరించింది.

News July 11, 2025

మూవీ ముచ్చట్లు

image

* ‘ది రాజాసాబ్’ మ్యూజిక్ సిట్టింగ్స్.. తమన్‌తో ప్రభాస్
* ఓటీటీలోకి వచ్చేసిన ‘8 వసంతాలు’.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
* సన్‌నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ అవుతున్న కలియుగం 2064
* సెప్టెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానున్న విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’
* ఇవాళ థియేటర్లలోకి ‘ఓ భామ అయ్యో రామ’, ‘సూపర్ మ్యాన్’ సినిమాలు
* కార్తీ కొత్త మూవీ ‘మార్షల్’
* సోనీలివ్‌లో యాక్షన్ డ్రామా మూవీ ‘నరివెట్ట’ స్ట్రీమింగ్

News July 11, 2025

బైకులకు చలాన్లు వేయకండి: వీహెచ్

image

TG: ట్రాఫిక్ పోలీసులు టూ వీలర్స్ టార్గెట్‌గా చలాన్లు వేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. ప్రభుత్వం చొరవ తీసుకొని చలాన్లు వేయకుండా పోలీసులకు సూచనలు చేయాలని కోరారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో యువత కీలకమని, వారిని చలాన్ల పేరుతో ఇబ్బంది పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం కాంగ్రెస్ కార్యకర్తలపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలన్నారు.

News July 11, 2025

వీధి కుక్కలకు రోజూ చికెన్‌తో భోజనం

image

వీధికుక్కల కోసం బృహత్ బెంగళూరు మహానగర పాలికే(BBMP) కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రోజుకు 4 వేల వీధికుక్కలకు ఒకపూట భోజనం పెట్టేందుకు టెండర్ పిలిచింది. టెండర్ లేఖ ప్రకారం..రోజుకు 100 ఎంపిక చేసిన ప్రాంతాల్లో 4 వేల కుక్కలకు అన్నం, చికెన్, కూరగాయలతో భోజనం పెట్టాలి. ఉ.11గం. కల్లా ఒక్కో కుక్కకు 750 కేలరీలు అందేలా 600 గ్రా.ల ఆహారం పెట్టాలి. ఇందుకోసం BBMPకి ఏటా రూ.2.88 కోట్లు ఖర్చవుతుందని అంచనా.

News July 11, 2025

జకోవిచ్ సెమీస్ గండాన్ని దాటుతారా?

image

వింబుల్డన్‌లో ఇవాళ ఆసక్తికర పోరు జరగనుంది. స్టార్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్, వరల్డ్ నం.1 సినర్ సెమీఫైనల్లో తలపడనున్నారు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లో సినర్ చేతిలో జకో ఓటమి పాలయ్యారు. మరి ఇవాళ ప్రతీకారం తీర్చుకుంటారా? యంగ్ ప్లేయర్‌కు మరోసారి దాసోహం అంటారా? అనేది తేలనుంది. మరో సెమీస్‌లో అల్కరాజ్, ప్రిట్జ్ తలపడనున్నారు. ఆదివారం ఫైనల్ జరగనుంది.

News July 11, 2025

ఆగస్టు చివరికల్లా ఎన్నికల ప్రక్రియ పూర్తి!

image

TG: ఆగస్టు నెలాఖరు కల్లా పరిషత్, సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పంచాయతీరాజ్ చట్టసవరణ ఆర్డినెన్స్‌ను గవర్నర్ వారం లోపే జారీ చేసే అవకాశం ఉందని, ఆ తర్వాత పది రోజుల్లోపే రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్లు వెల్లడించాయి. తొలుత పరిషత్, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. కాగా SEP30లోగా ఎన్నికలు పూర్తి చేయాలని HC ఆదేశించిన విషయం తెలిసిందే.