India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: స్కూళ్లు, విద్యాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఆప్కాస్ సిబ్బందితో పాటు పెన్షనర్ల వివరాలను నమోదు చేయాలని RJDలను విద్యాశాఖ ఆదేశించింది. హౌస్ హోల్డ్ డేటాబేస్‌లో పలువురి వివరాలు నమోదు కాకపోవడంతో ఈ చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తూ డేటా బేస్‌లో పేర్లు లేని ఉద్యోగులు 2.80 లక్షల మంది ఉండగా, ఒక్క విద్యాశాఖలోనే 63వేల మందికి పైగా ఉన్నారు.
TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు <<15018734>>నాంపల్లి కోర్టును<<>> కోరారు. బన్నీ డబ్బు, పలుకుబడి ఉన్న వ్యక్తి అని, బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదించారు. PSలోనూ విచారణకు సహకరించకపోవడంతోనే అరెస్ట్ చేశామని, ఇప్పుడు బెయిల్ ఇస్తే మళ్లీ విచారణకు సహకరించకపోవచ్చని తెలిపారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని తమ వాదనల్లో పోలీసులు పేర్కొన్నారు.
ఇటీవల తరచూ విమాన ప్రమాదాలు జరుగుతుండటంతో ఫ్లైట్స్‌లో ఏ సీట్లు సేఫ్ అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రెక్కల కిందిభాగంలో ఇంధనం ఉండటం వల్ల నిప్పులు రాజుకుంటే వాటి పక్కన కూర్చున్న వారికి ప్రభావం ఎక్కువని, తోక భాగం సేఫ్ అని నిపుణులు అంటున్నారు. మంటలు లేకపోయినా ముందు కూర్చున్నవారికి ముప్పు ఎక్కువట. మధ్య సీట్ల పరిస్థితి విచిత్రమని, నిప్పు లేకపోతే EMG ఎగ్జిట్ వీరికి దగ్గరగా ఉండటంతో తప్పించుకునే అవకాశముంది.
ఈ ఏడాది మరికొన్ని గంటల్లో ముగియనుంది. 2024లో టాలీవుడ్‌లో 100కు పైగా చిత్రాలు విడుదలయ్యాయి. ‘హనుమాన్’ బంపర్ హిట్‌తో ఏడాది ఘనంగా ప్రారంభమైంది. కల్కి, దేవర, పుష్ప-2, క, టిల్లూ స్క్వేర్, సరిపోదా శనివారం, కమిటీ కుర్రాళ్లు, ఆయ్, 35 చిన్న కథ కాదు వంటి చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ముఖ్యంగా చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సత్తాచాటి ఔరా అనిపించాయి. ఈ ఏడాది వచ్చిన వాటిలో మీ ఫేవరెట్ మూవీ ఏంటి?
అఫ్గాన్‌లో మహిళలపై ఆంక్షల్ని తాలిబన్లు మరింత కఠినతరం చేశారు. మహిళలు ఉండే ప్రాంతాల్లో కనీసం కిటికీలు కూడా ఉండకూడదని హుకుం జారీ చేశారు. ‘ఇళ్లల్లో మహిళలు సమయం గడిపే చోట కిటికీలు ఉండకూడదు. ఇప్పటికే కిటికీలు ఉంటే వాటిని శాశ్వతంగా మూసేయాలి. ఇంటి ఆవరణ, వంటగది, బావులు వంటి ప్రాంతాల్లో వారు బయటకు కనిపించకుండా గోడలు నిర్మించాలి’ అని తేల్చిచెప్పారు. వారి నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చెల్లింపుల భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు RBI కీలక నిర్ణయం తీసుకుంది. RTGS, NEFT, ఆన్‌లైన్ లావాదేవీలు జరిపే వినియోగదారులకు వారు డబ్బులు పంపే బ్యాంకు ఖాతాదారుడి పేరు కనిపించేలా చూడాలని భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్(NPCI)ని ఆదేశించింది. తద్వారా మోసాలు, తప్పులు జరగకుండా వినియోగదారులు జాగ్రత్త పడతారని పేర్కొంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1లోపు ఇది అమలుకావాలని బ్యాంకులకు RBI తేల్చిచెప్పింది.
తెలంగాణలో పోలీసులు ఇవాళ రాత్రి 8 నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేయనున్నారు. మద్యం తాగి తొలిసారి పట్టుబడితే ₹10వేల ఫైన్, 6 నెలల జైలు శిక్ష విధించనున్నారు. రెండోసారి పట్టుబడితే ₹15వేల జరిమానా, జైలు శిక్ష, 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తారు. డ్రగ్స్ సేవించి దొరికితే నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేస్తారు. సో.. ఆల్కహాల్ సేవిస్తే డ్రైవ్ చేయకండి.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో రైల్వే ట్రాకుల వద్ద పతంగులు ఎగురవేయొద్దని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సూచించారు. రైల్వే యార్డులు, గేట్లు, ట్రాకుల వద్ద ఉన్న కరెంట్ తీగలకు సమీపంలో ఎగురవేసి గతంలో చాలా మంది ప్రమాదానికి గురయ్యారని తెలిపారు. అధిక వోల్టేజీతో ఉన్న తీగలకు చైనా మంజా వంటి దారాలు తాకితే ప్రమాదం ఎక్కువని పేర్కొన్నారు. ఎక్కడైనా తీగలకు దారాలు వేలాడితే తమకు సమాచారం ఇవ్వాలంది.
TG: దేశంలో సంపన్న ముఖ్యమంత్రుల్లో సీఎం రేవంత్ ఏడో స్థానంలో నిలిచారు. ఆయన పేరిట రూ.30.04 కోట్ల విలువైన ఆస్తులున్నాయని ఏడీఆర్ నివేదిక తెలిపింది. ఇక రూ.931 కోట్లతో ఏపీ సీఎం చంద్రబాబు అగ్రస్థానంలో, రూ.332 కోట్లతో అరుణాచల్ సీఎం పెమాఖండు రెండో స్థానంలో నిలిచారు. కేవలం రూ.15 లక్షల ఆస్తితో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జాబితాలో ఆఖరి స్థానంలో ఉన్నారు.
దక్షిణ కొరియా అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన యూన్ సుక్‌ను అరెస్టు చేయాలని అక్కడి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో సైనిక పాలన విధించేందుకు యూన్ ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఆ విషయంలో ఆయన్ను విచారించాలని కోర్టు అధికారుల్ని ఆదేశించింది. ఆయన కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.