India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: 2025 ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం రూ.3.25 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం నిధులు కేటాయించనుంది. ‘తల్లికి వందనం’కు రూ.10,300 కోట్లు, అన్నదాత సుఖీభవకు రూ.10,717 కోట్లు అవసరమని అంచనా వేశారు. అలాగే అమరావతి నిర్మాణం, పోలవరం, మహిళలకు వడ్డీలేని రుణాలకు నిధులు కేటాయించనుంది.

AP: ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వారం రోజుల నుంచి రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. దీంతో మార్చి మొదటి వారం నుంచే ఒంటిపూట బడుల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. దీనిపై విద్యాశాఖ ఎలా స్పందిస్తుందో చూడాలి.

TG: రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. అప్పుల బాధతో ఇటీవల నలుగురు రైతులు బలవన్మరణం చెందగా నిన్న మరో రైతు తనువు చాలించారు. భూపాలపల్లి జిల్లా వెంకటేశ్వరపల్లికి చెందిన బండారి రవి(54) రెండెకరాల్లో మిర్చి వేశారు. పంట పెట్టుబడి, కూతురు పెళ్లి కోసం రూ.10లక్షల అప్పు చేశారు. మిర్చికి గిట్టుబాటు ధర లేకపోవడంతో అప్పు చెల్లించలేకపోయారు. దీంతో పురుగుమందు తాగి ప్రాణాలు తీసుకున్నారు.

TG: నిర్మాత కేదార్ మృతిపై మిస్టరీ వీడటంలేదు. దుబాయ్‌లోని ఫ్లాట్‌లో ఆయన అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. కేదార్ మృతికి ముందు ఆయన ఫ్లాట్‌లోనే ఉన్న ఓ మాజీ MLAను విచారించి వదిలేసినట్లు సమాచారం. అనంతరం ఆయన HYD వచ్చేశారు. ఇటు కేదార్ మృతిపై రాజకీయ దుమారం రేగుతోంది. ఫ్రెండ్ చనిపోతే KTR ఎందుకు స్పందించడంలేదని రేవంత్ ప్రశ్నించగా ఆ మరణాన్ని BRSకు అంటగట్టడమేంటని కవిత కౌంటర్ ఇచ్చారు.

AP: కృష్ణపట్నం దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం రికార్డ్ సృష్టించింది. 800MW ఉత్పత్తి చేయగల 3వ యూనిట్‌లో అంతరాయం లేకుండా 100 రోజుల పాటు విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు జెన్‌కో ఎండీ చక్రధర్ బాబు ప్రకటించారు. 2024 నవంబర్ 18 నుంచి 1,596 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగిందన్నారు. అలాగే, సీలేరు జల విద్యుత్ కేంద్రంలో 24గంటల వ్యవధిలోనే 4.949MU విద్యుత్ ఉత్పత్తి అయిందని చెప్పారు.

AP: నటుడు పోసాని కృష్ణమురళికి రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను కడప సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది. నిన్న 9 గంటల పాటు విచారించిన పోలీసులు రాత్రి జడ్జి ముందు హాజరుపర్చారు. రా.9 గంటల నుంచి ఉ.5 గంటల వరకు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. పోసాని తరఫున వాదనలు వినిపించిన పొన్నవోలు సుధాకర్ బెయిల్ ఇవ్వాలని కోరారు. అందుకు న్యాయమూర్తి నిరాకరించారు.

పుణే <<15593054>>రేప్<<>> కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు రాందాస్ యువతిపై అత్యాచారం చేసిన బస్సులో వందల సంఖ్యలో కండోమ్‌లు, మహిళల లోదుస్తులను పోలీసులు గుర్తించారు. దీంతో ఆ మానవ మృగం ఇంకా ఎంతమందిపై ఇలాంటి దారుణాలకు ఒడిగట్టాడో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటన జరిగిన బస్టాండ్ PSకు 100 మీ.దూరంలోనే ఉండటం గమనార్హం. నిందితుడి కోసం పోలీసులు డ్రోన్లు, డాగ్ స్క్వాడ్లను గాలిస్తున్నారు.

నటి జయప్రద సోదరుడు రాజబాబు కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. హైదరాబాద్‌లోని నివాసంలో ఆయన నిన్న సాయంత్రం మరణించినట్లు వెల్లడించారు. తన సోదరుడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని తన అభిమానులు ప్రార్థించాలని జయప్రద కోరారు.

TG: ప్రభుత్వం చేపట్టిన కులగణన రీసర్వే నేటితో ముగియనుంది. గతేడాది నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25 వరకు నిర్వహించిన సర్వేలో పాల్గొనని కుటుంబాల కోసం ప్రభుత్వం ఈనెల 16 నుంచి రీసర్వే చేపట్టింది. అయితే ఇందులోనూ వివరాలు ఇచ్చేందుకు చాలామంది ఆసక్తి చూపలేదు. మొత్తం 3.50 లక్షల కుటుంబాలు మిగిలిపోగా సుమారు 10వేల ఫ్యామిలీలే ఎంట్రీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. సర్వేలో పాల్గొనాలంటే 040 21111111 నంబర్‌కు కాల్ చేయండి.

AP: కూటమి ప్రభుత్వం నేడు తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఉదయం 10గం.కు అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్, మండలిలో మరో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. సూపర్ 6 పథకాలు, రాజధాని అమరావతి నిర్మాణానికి బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. మరోవైపు, తొలిసారి బడ్జెట్ పుస్తకాల ముద్రణను ఆపేసిన ప్రభుత్వం ఆ వివరాలు ఉండే పెన్ డ్రైవ్‌ను సభ్యులతో పాటు మీడియాకు ఇవ్వనుంది.
Sorry, no posts matched your criteria.