news

News October 1, 2024

నా మిత్రుడు రజినీకాంత్ త్వరగా కోలుకోవాలి: చంద్రబాబు

image

AP: తన మిత్రుడు, సూపర్ స్టార్ రజినీకాంత్ త్వరగా కోలుకోవాలని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో ఆయన వర్ధిల్లాలని కోరుకున్నారు. మరోవైపు మంత్రి లోకేశ్ కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా రజినీకాంత్ అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. హృదయ నాళాలకు సంబంధించి వైద్యులు చికిత్స చేశారు.

News October 1, 2024

సొత్తు తిరిగిస్తే దొంగ‌త‌నం క్ష‌మార్హ‌మా?: బీజేపీ

image

ముడా కేసులో భూముల‌ను తిరిగి అప్ప‌గించేస్తాన‌ని సీఎం సిద్ద రామ‌య్య స‌తీమ‌ణి చేసిన ప్రకటనపై బీజేపీ సెటైర్లు వేసింది. చోరీ చేసిన సొత్తు తిరిగిచ్చేస్తే దొంగ అమాయకుడు అయిపోతాడా? అంటూ సీఎంను ప్రశ్నించింది. భూములను తిరిగిచ్చేయడం ద్వారా కొన్ని తప్పులు జరిగాయన్న విషయాన్ని సీఎం అంగీకరిస్తున్నారని ప్రతిపక్ష నేత ఆర్.అశోక దుయ్యబట్టారు. సొత్తు తిరిగిచ్చేస్తే చోరీ క్షమార్హం అవుతుందా? అంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు.

News October 1, 2024

ఫ్రీ హోల్డ్ భూముల వెరిఫికేషన్ పూర్తి చేయండి: మంత్రి అనగాని

image

AP: ఫ్రీ హోల్డ్ భూముల వెరిఫికేషన్ నెలాఖరుకు పూర్తి చేయాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. CCLA ఆఫీసులో జిల్లా కలెక్టర్లతో మంత్రి ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. ‘గ్రీవెన్స్ ఎప్పటికప్పుడు జీరో స్థాయికి తీసుకురావాలి. ప్రజలను వారి సమస్యల పరిష్కారం కోసం 10 సార్లు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిప్పించుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో నెలాఖరులోగా పూర్తి చేయాలి’ అని ఆదేశించారు.

News October 1, 2024

మారుతీ సుజుకీ అమ్మకాల్లో పెరుగుదల

image

సెప్టెంబరులో తమ కార్ల అమ్మకాలు పెరిగాయని మారుతీ సుజుకీ ప్రకటించింది. మొత్తం 1,84,727 యూనిట్లు విక్రయించినట్లు తెలిపింది. గత ఏడాది సెప్టెంబరుతో పోలిస్తే ఇది 2శాతం ఎక్కువని పేర్కొంది. తాము అమ్ముతున్న ప్రతి మూడు కార్లలో ఒకటి సీఎన్‌జీ వేరియంట్ అని వివరించింది. తొలిసారిగా సీఎన్‌జీ అమ్మకాలు 50వేల మార్కు దాటినట్లు స్పష్టం చేసింది. మరోవైపు హ్యుందాయ్ 64,201 యూనిట్లు విక్రయించినట్లు ప్రకటించింది.

News October 1, 2024

ALERT.. కాసేపట్లో ఈ ప్రాంతాల్లో వర్షాలు

image

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. జగిత్యాల, జనగామ, గద్వాల్, కరీంనగర్, మెదక్, నాగర్‌కర్నూల్, నల్గొండ, సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, హన్మకొండ, భువనగిరి సహా మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయంది. అటు హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో రెండు గంటలుగా భారీ వర్షం కురుస్తోంది.

News October 1, 2024

GST వ‌సూళ్లు ₹1.73 ల‌క్ష‌ల కోట్లు

image

GST వ‌సూళ్లు సెప్టెంబ‌ర్‌లో ₹1.73 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుకున్నాయి. గ‌త ఏడాది ఇదే నెల‌తో (₹1.63 లక్షల కోట్లు) పోలిస్తే 6.5% వృద్ధి న‌మోదైంది. అయితే, ఆగ‌స్టు నెల జీఎస్టీ వ‌సూళ్లు ₹1.75 లక్షల కోట్లుగా ఉండగా, సెప్టెంబర్‌లో కలెక్షన్లు కొంత‌మేర త‌గ్గ‌డం గ‌మ‌నార్హం. FY25 First-Halfలో GST వసూళ్లు రూ.10.87 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇది FY24 First-Half కంటే 9.5 శాతం అధికం కావడం గమనార్హం.

News October 1, 2024

అర్ధరాత్రి నుంచి OTTలోకి ’35 చిన్న కథ కాదు’

image

గత నెలలో థియేటర్లలో రిలీజ్ అయి హిట్ టాక్ సొంతం చేసుకున్న ’35 చిన్న కథ కాదు మూవీ’ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ అర్ధరాత్రి నుంచి చిత్రం ‘ఆహా’లో అందుబాటులో ఉండనుంది. నందకిశోర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియదర్శి, విశ్వదేవ్, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించగా, వివేక్ సాగర్ సంగీతం అందించారు.

News October 1, 2024

JK చివరి విడత ఎన్నికల్లో 65.48% పోలింగ్

image

జ‌మ్మూక‌శ్మీర్ చివ‌రి విడ‌త ఎన్నిక‌ల్లో ఓటింగ్ శాతం పెరిగింది. సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు 65.48% పోలింగ్ న‌మోదైంది. జమ్మూలోని 24, కశ్మీర్‌లోని 16 స్థానాలు కలిపి మొత్తం 40 స్థానాల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో అత్య‌ధికంగా ఉధంపూర్ జిల్లాలో 72.91%, అత్య‌ల్పంగా బారాముల్లాలో 55.73% పోలింగ్ జ‌రిగింది. మొద‌టి ద‌శ‌లో 61.38%, రెండో ద‌శ‌లో 57.31% పోలింగ్ నమోదైన విష‌యం తెలిసిందే. అక్టోబ‌ర్ 8న కౌంటింగ్ జ‌ర‌గ‌నుంది.

News October 1, 2024

ఆ ఇద్ద‌రి విడుద‌ల వెనుక BJP ఉంది: రాబ‌ర్ట్ వాద్రా

image

ఢిల్లీ EX CM అరవింద్ కేజ్రీవాల్‌, డేరా చీఫ్ గుర్మీత్ జైలు నుంచి విడుద‌ల వెనుక BJP హ‌స్తం వుంద‌ని రాబ‌ర్ట్ వాద్రా ఆరోపించారు. హ‌రియాణా ఎన్నిక‌ల్లో BJPకి అనుకూలంగా ప్ర‌చారం చేయ‌డానికే గుర్మీత్‌ను 20 రోజులు పెరోల్‌పై విడుద‌ల చేశార‌ని, ఎన్నికల ప్రచారానికి వీలు కల్పించేలా కేజ్రీవాల్‌కు బెయిల్ దక్కేలా చేశారని దుయ్య‌బ‌ట్టారు. తద్వారా కాంగ్రెస్ పార్టీని దెబ్బ‌తీయవ‌చ్చ‌ని BJP భావిస్తోంద‌న్నారు.

News October 1, 2024

టెస్టు కెప్టెన్‌గా రోహిత్‌శర్మ ట్రాక్ రికార్డు

image

* శ్రీలంకపై 2-0తో గెలుపు
* ఆస్ట్రేలియాపై 2-1తో విజయం
* వెస్టిండీస్‌పై 1-0తో గెలుపు
* సౌతాఫ్రికాతో 1-1తో సిరీస్ డ్రా
* ఇంగ్లండ్‌పై 4-1తో విజయం
* బంగ్లాదేశ్‌పై 2-0తో సిరీస్ విజయం

error: Content is protected !!