India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బంగ్లాతో టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమ్ ఇండియా WTC పాయింట్ల పట్టికలో తన అగ్ర స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. 98 పాయింట్లతో టాప్ స్పాట్‌లో కొనసాగుతోంది. రెండో స్థానంలో ఆస్ట్రేలియా (90 పాయింట్లు) నిలిచింది. ఈ ఏడాది భారత్ ఆడబోయే 8 టెస్టుల్లో మూడింట్లో గెలిస్తే WTC ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోనుంది. భారత్ ఈ ఏడాది మొత్తం 11 టెస్టులు ఆడి ఎనిమిదింట్లో గెలిచి, రెండింట్లో ఓడి, ఒకటి డ్రా చేసుకుంది.
AP: చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌కు మంగళగిరి పోలీసులు నోటీసులిచ్చారు. రేపు ఉదయం డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇటు టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టైన మాజీ ఎంపీ నందిగం సురేశ్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును 4వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
AP: రాష్ట్రవ్యాప్తంగా రేషన్ పంపిణీ కొనసాగుతోంది. తెనాలి నియోజకవర్గంలో రేషన్ పంపిణీలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ నెల నుంచి బియ్యంతో పాటు రాయితీపై ఇస్తున్న కందిపప్పు, పంచదారను ఆయన లబ్ధిదారులకు అందించారు. కాగా కేజీ కందిపప్పు సబ్సిడీపై రూ.67కి, అరకేజీ పంచదార రూ.17కి ప్రభుత్వం అందిస్తోంది.
ఈక్విటీ డెలివరీ ట్రేడ్‌లపై ఎలాంటి బ్రోకరేజీ ఛార్జీలను విధించబోమని, ఈ సేవలను ఉచితంగానే కొనసాగించనున్నట్టు Zerodha CEO నితిన్ కామత్ తెలిపారు. Options కోసం STT 0.0625% నుంచి 0.1%కి పెరుగుతుందన్నారు. అలాగే లావాదేవీ ఛార్జీ 0.0495% నుంచి 0.035%కి తగ్గుతుందని, దీని ఫలితంగా సెల్లింగ్ ట్రేడ్‌ల ఖర్చు NSEలో 0.02303% లేదా రూ.కోటి ప్రీమియంపై రూ.2,303, BSEలో 0.0205% లేదా రూ. 2,050 పెరుగుతుందన్నారు.
ఎస్‌బీఐ బ్యాంక్ సర్వర్లు డౌన్ అవ్వడంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది కస్టమర్లు ఇబ్బందులు పడుతున్నారు. కంపెనీలు మొదటి తారీఖున జీతాలు వేయలేకపోతున్నాయి. నిన్న కూడా సర్వర్ డౌన్ సమస్యలు తలెత్తాయి. డబ్బులు కట్ అయినా పేమెంట్స్ ఫెయిల్ అవుతున్నాయని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారు. ఇతర బ్యాంకుల్లోనూ ఈ సమస్యలు ఉన్నట్లు పలువురు వాపోతున్నారు. మీకూ ఈ సమస్య ఎదురవుతోందా?
AP: ‘లులు’ కంపెనీకి ప్రభుత్వం ఇచ్చే స్థలం విలువ రూ.1,300 కోట్లు ఉందని, కానీ ఆ సంస్థ రూ.600 కోట్లు మాత్రమే పెట్టుబడి పెడుతుందని YCP నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అందుకే గతంలో లులు కంపెనీ పెట్టుబడులు వద్దని చెప్పామన్నారు. ‘రూ.99కే మద్యం ఇవ్వడం కాదు. నిత్యావసరాల రేట్లు తగ్గించాలి. 2.50 లక్షల మంది వాలంటీర్లను తప్పించారు. మద్యం షాపుల్లో పనిచేసే 15 వేల మంది సిబ్బందిని తీసేశారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.
గుజరాత్‌కు చెందిన ఓ కుటుంబం ఇప్పటివరకు 630 లీటర్ల రక్తాన్ని దానంగా ఇచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచింది. అహ్మదాబాద్‌లోని మణేక్‌బాగ్ ప్రాంతానికి చెందిన పటేల్ కుటుంబంలో 27 మంది ఉన్నారు. వీరిలో కొందరు 100సార్లకుపైగా రక్తదానం చేశారు. మొత్తంగా 1,400 యూనిట్ల బ్లడ్ డొనేషన్ చేసి ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. మరోవైపు ఇదే ప్రాంతానికి చెందిన మవలంకర్ ఫ్యామిలీ కూడా 356 లీటర్ల రక్తదానం చేసింది.
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బంగ్లా క్రికెటర్ షకీబ్ అల్ హసన్‌కు తన బ్యాటును గిఫ్ట్‌గా ఇచ్చి ఆశ్చర్యపరిచారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా యంగ్ క్రికెటర్లకు కోహ్లీ తన బ్యాట్లను గిఫ్ట్‌గా ఇస్తుంటారు. రింకూ సింగ్, ఆకాశ్ దీప్, గుర్బాజ్ తదితరులకు బ్యాట్ ఇచ్చారు. మరోవైపు విరాట్ ఇచ్చిన బ్యాట్‌తోనే ఆకాశ్ దీప్ నిన్న బంగ్లాపై రెండు సిక్సర్లు బాదడం విశేషం.
APలో 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ‘5 నెలల్లో PMT, PET పరీక్షలను పూర్తి చేస్తాం. పలు కారణాలతో ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ వాయిదా పడింది. రెండో దశ అప్లికేషన్ ఫాం నింపడానికి భర్తీ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను <
బంగ్లాతో రెండో టెస్టులో రెండున్నర రోజుల ఆట వర్షార్పణమైనప్పటికీ టీమ్ ఇండియా అద్భుత ఆటతో విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడే దీనిక్కారణమని కేఎల్ రాహుల్ తెలిపారు. ‘ఎంత వీలైతే అంత ట్రై చేసి గెలవడానికే చూడాలని 4వ రోజు ఆట మొదలయ్యే సమయానికి రోహిత్ క్లియర్‌గా చెప్పారు. దీంతో దూకుడుగా ఆడేందుకు ఆటగాళ్లకు స్వేచ్ఛ లభించింది. వికెట్లు పడుతున్నా ఆ దూకుడును కొనసాగించి విజయం సాధించాం’ అని వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.