India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారీ డిస్కౌంట్ల పేరుతో చేస్తోన్న స్కామ్‌ను నివారించేందుకు ఏకంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ రంగంలోకి దిగారు. అక్కడి సూపర్ మార్కెట్స్ డిస్కౌంట్స్ ఇచ్చేముందు ప్రొడక్ట్ లేబుల్స్‌ను మార్చేస్తున్నాయని వాచ్‌డాగ్ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆంథోనీ తన తోటి పార్లమెంట్ సభ్యురాలు మేరీ డోయల్‌తో పాటు మరికొందరితో చర్చించినట్లు ట్వీట్ చేశారు. సాధ్యమైనంత తక్కువ ధరకు వస్తువులు అందేలా కృషి చేస్తామన్నారు.
వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో దళపతి విజయ్ నటించిన ది గోట్(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) మూవీ ఈ నెల 3న ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. గత నెల 5న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ రూ.450 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాలో స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి, జయరాం, ప్రభుదేవా కీలక పాత్రల్లో నటించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరసత్వం రద్దుపై తమకు అభ్యర్థన అందిందని కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై చర్యలు తీసుకొనేందుకు కాస్త సమయం కావాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌కు తెలిపింది. రాహుల్‌కు బ్రిటన్ పౌరసత్వం ఎలా వచ్చిందో, తర్వాత ఆ డాక్యుమెంటును ఎందుకు క్యాన్సిల్ చేశారో సీబీఐతో దర్యాప్తు చేయించాలని కర్ణాటక బీజేపీ కార్యకర్త విఘ్నేశ్ శిశిర్ హైకోర్టులో వేసిన పిల్‌కు వివరణ ఇచ్చింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదలపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తామని ‘రా మచ్చా మచ్చా’ ఈవెంట్‌లో ఆయన ప్రకటించారు. అయితే, గతంలో డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేయగా వరుస సెలవులు ఉండటంతో క్రిస్మస్‌కి ప్లాన్ చేశారు. కాగా, సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్ కానుంది.
AP: తిరుమల లడ్డూ అంశంలో CM చంద్రబాబు, ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో తమ నేతలకు TDP కీలక ఆదేశాలిచ్చింది. కోర్టు, న్యాయమూర్తులపై విమర్శలు, వ్యతిరేక వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో వాస్తవాలే ప్రజలకు చెప్పాలని కోరింది. చంద్రబాబు శ్రీవారి భక్తుడని, ల్యాబ్ నిర్ధారించిన తర్వాతే నెయ్యిలో కల్తీ జరిగిందనే విషయం ప్రజలకు చెప్పారని తెలిపింది.
TG: డీఎస్సీ ఫలితాల్లో నారాయణపేట జిల్లా రాకొండకు చెందిన గోపాల్, అతని కుమారుడు భానుప్రకాశ్ ర్యాంకులు సాధించారు. తెలుగు పండిట్‌గా జిల్లాలో గోపాల్‌కు ఫస్ట్ ర్యాంక్ రాగా, మ్యాథ్స్ సబ్జెక్టులో భాను ప్రకాశ్‌కు 9వ ర్యాంక్ వచ్చింది. గోపాల్ భార్య విజయలక్ష్మి ఇదివరకే తెలుగు పండిట్‌గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. రెండు నెలల క్రితం వారి రెండో కుమారుడు చంద్రకాంత్ కూడా గవర్నమెంట్ జాబ్‌కు(ఏఈఈ) సెలక్ట్ అయ్యాడు.
AP: ఖరీఫ్ సీజన్‌లో సాగు లక్ష్యం 32.50లక్షల హెక్టార్లు కాగా, 27.44లక్షల హెక్టార్లలోనే(84 శాతం) పంటలు సాగయ్యాయి. వరి సాగు 10%, పత్తి 33%, వేరుశనగ 48% తగ్గింది. పలు చోట్ల భారీ వర్షాలు, రాయలసీమలో వర్షాభావం, సకాలంలో వరుణుడు కరుణించకపోవడం వల్ల సాగు లక్ష్యం నెరవేరలేదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే జొన్న, కొర్ర, సజ్జ, కంది, మినుము, పెసర, సన్‌ఫ్లవర్ వంటి పంటల సాగు ఆశాజనకంగా ఉందన్నారు.
తనకు కేటాయించిన 14 ప్లాట్లను ముడాకు తిరిగిచ్చేయాలన్న తన భార్య నిర్ణయం ఆశ్చర్యపరిచిందని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. కుటుంబానికే పరిమితమైన ఆమె ప్రతిపక్షాల కుట్రతో మానసిక క్షోభ అనుభవిస్తోందని తెలిపారు. ‘తల వంచకుండా అన్యాయానికి ఎదురెళ్లడమే నా మార్గం. కానీ నాపై జరిగిన రాజకీయ కుట్రతో ఆమె ఆవేదన చెందింది. ప్లాట్లను తిరిగివ్వాలని నిర్ణయించుకుంది. ఆమె మానసిక వేదన బాధాకరం’ అని పేర్కొన్నారు.
ప.బెంగాల్‌లో జూ.డాక్టర్లు మళ్లీ నిరసన బాట పట్టారు. తమకు భద్రత కల్పించాలంటూ 10 రకాల డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ఈసారి పూర్తి విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. RG కర్ ఆసుపత్రిలో లేడీ ట్రైనీ డాక్టర్‌పై రేప్&మర్డర్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైద్యులకు భద్రతతో పాటు ఆ కేసులో న్యాయం చేయాలంటూ జూడాలు చేపట్టిన 42 రోజుల నిరసనను Sept 21న పాక్షికంగా ముగించారు.
సుప్రీంకోర్టులో లడ్డూ అంశం పెండింగ్‌లో ఉన్నప్పుడు తిరుపతిలో DY CM పవన్ బహిరంగ సభ నిర్వహించడం సరికాదని ఎంపీ గురుమూర్తి ట్వీట్ చేశారు. ‘పవిత్ర తిరుపతి లడ్డూ కల్తీపై సరైన విచారణ కూడా చేయకుండా నిరాధారమైన వ్యాఖ్యలు చేసినందుకు సీఎం చంద్రబాబుపై సుప్రీంకోర్టు మండిపడింది. బాధ్యతాయుతమైన ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీరు ముందే నిర్ధారణకు వచ్చి ప్రాయశ్చిత్త దీక్ష ఎలా చేస్తారు?’ అని ప్రశ్నించారు.
Sorry, no posts matched your criteria.