news

News February 28, 2025

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

image

TG: ఏటా ఫిబ్రవరి 4న ‘తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం’గా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు CS శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సామాజిక న్యాయం, సమానత్వం, సమ్మిళిత అభివృద్ధికి ప్రభుత్వం మరోసారి తన నిబద్ధతను చాటుకున్నట్లు పేర్కొన్నారు. ఈ దినోత్సవం నాడు అవగాహన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, వ్యక్తులను గుర్తించి అవార్డులు ఇవ్వడం, సంక్షేమ శిబిరాలు నిర్వహించడం వంటివి చేయనుంది.

News February 28, 2025

SEBI చీఫ్‌గా తుహిన్ కాంత పాండే

image

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) చీఫ్‌గా తుహిన్ కాంత పాండేను కేంద్రం నియమించింది. ప్రస్తుతం ఆయన ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నారు. తుహిన్ సెబీ ఛైర్మన్‌‌గా మూడేళ్లు పదవిలో ఉండనున్నారు. ప్రస్తుతం ఛైర్మన్‌గా ఉన్న మాధవి పురీ బుచ్ పదవీకాలం నిన్నటితో ముగిసింది. కాగా ఇటీవల ఆమె తీవ్ర ఆర్థిక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు.

News February 28, 2025

నమాజ్ వేళలు.. ఫిబ్రవరి 28, శుక్రవారం

image

ఫజర్: తెల్లవారుజామున 5.23 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.35 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.29 గంటలకు
అసర్: సాయంత్రం 4.44 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.22 గంటలకు
ఇష: రాత్రి 7.35 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 28, 2025

శుభ ముహూర్తం (28-02-2025)

image

☛ తిథి: అమావాస్య, ఉ.7.06 వరకు
☛ నక్షత్రం: శతభిషం, మ.3.36 వరకు
☛ శుభ సమయం: సా.5.09 నుంచి 5.33 వరకు
☛ రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
☛ యమగండం: సా.0.00 నుంచి 4.30 వరకు
☛ దుర్ముహూర్తం: ఉ.8.24-9.12, మ.12.24-1.12 వరకు
☛ వర్జ్యం: రా.9.22 నుంచి 10.52 వరకు
☛ అమృత ఘడియలు: ఉ.8.45 గంటల నుంచి 10.16 వరకు

News February 28, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 28, 2025

TODAY TOP STORIES

image

* ఉగాది నుంచి P4 కార్యక్రమం: సీఎం చంద్రబాబు
* ఉద్యోగాల కల్పనలో నం.1గా నిలిచాం: CM రేవంత్
* ముగిసిన పోసాని కృష్ణమురళి విచారణ
* బీఆర్ఎస్ వల్లే SLBC ప్రమాదం: ఉత్తమ్
* గోరంట్ల మాధవ్‌కు పోలీసుల నోటీసులు
* తగ్గిన బంగారం ధరలు
* తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
* ఎల్లుండి ఓటీటీలోకి ‘సంక్రాంతికి వస్తున్నాం’
* పాకిస్థాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ రద్దు

News February 28, 2025

చిన్నారిని చిదిమేసిన మానవమృగం.. ప్రైవేట్ పార్ట్స్ వద్ద 29 కుట్లు

image

ఓ మానవమృగం కామవాంఛకు ఐదేళ్ల చిన్నారి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది. ఆ బాలిక ప్రైవేట్ పార్ట్స్ వద్ద 29 కుట్లు వేశామని డాక్టర్లు చెప్పడం ఆ 17 ఏళ్ల నిందితుడి రాక్షసత్వానికి నిదర్శనం. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో జరిగింది. నిందితుడు పీకలదాకా తాగి బాలిక తలను గోడకు పలుమార్లు కొట్టాడని, శరీరంపై అనేక గాయాలున్నాయని పోలీసులు తెలిపారు. అతడిని అరెస్టు చేశామని, జువైనల్‌కు తరలిస్తామని చెప్పారు.

News February 28, 2025

BREAKING: ఆర్సీబీ ఘోర పరాజయం

image

WPLలో ఆర్సీబీతో జరిగిన మ్యాచులో గుజరాత్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 126 పరుగుల స్వల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్ 16.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ గార్డ్‌నర్ (58) ఫిఫ్టీతో రాణించారు. లిచిఫీల్డ్ (30) ఫర్వాలేదనిపించారు. రేణుకా సింగ్, జార్జియా చెరో 2 వికెట్లు తీశారు.

News February 28, 2025

ఇలా చేస్తే హాయిగా నిద్ర పడుతుంది

image

ప్రతి ఒక్కరికీ కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర అవసరం. గాఢ నిద్ర రావాలంటే రాత్రి 7 గంటలలోగా భోజనం చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఆహారం త్వరగా జీర్ణమై హాయిగా నిద్ర పడుతుంది. గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే ఒత్తిడి, ఆందోళన తగ్గి నిద్ర పడుతుంది. ఏదైనా బుక్స్ చదివినా నిద్రలోకి జారుకుంటారు. పడుకునే ముందు గ్లాసు పాలు తాగినా గాఢ నిద్ర వస్తుంది. అలాగే నువ్వులు/కొబ్బరినూనెతో మసాజ్ చేసుకుంటే మంచి నిద్ర పడుతుంది.

News February 28, 2025

YS జగన్ పరువు నష్టం కేసు వాయిదా

image

AP: తనపై తప్పుడు కథనాలు ప్రచురించిన పలు పత్రికలపై వైఎస్ జగన్ దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణ జులై 16వ తేదీకి వాయిదా పడింది. అమెరికాలో అదానీ గ్రూపుపై దాఖలైన కేసులో తన పరువుకు భంగం కలిగేలా కథనాలు ప్రచురించాయని జగన్ కోర్టులో రూ.100 కోట్లకు దావా వేశారు. ఈ కేసు ఢిల్లీ హైకోర్టు పరిధిలోకి రాదని ప్రతివాదులు వాదించగా, కౌంటర్ దాఖలు చేస్తామని YS జగన్ తరఫు న్యాయవాది దయకృష్ణన్ న్యాయస్థానంలో వాదించారు.