News February 28, 2025
YS జగన్ పరువు నష్టం కేసు వాయిదా

AP: తనపై తప్పుడు కథనాలు ప్రచురించిన పలు పత్రికలపై వైఎస్ జగన్ దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణ జులై 16వ తేదీకి వాయిదా పడింది. అమెరికాలో అదానీ గ్రూపుపై దాఖలైన కేసులో తన పరువుకు భంగం కలిగేలా కథనాలు ప్రచురించాయని జగన్ కోర్టులో రూ.100 కోట్లకు దావా వేశారు. ఈ కేసు ఢిల్లీ హైకోర్టు పరిధిలోకి రాదని ప్రతివాదులు వాదించగా, కౌంటర్ దాఖలు చేస్తామని YS జగన్ తరఫు న్యాయవాది దయకృష్ణన్ న్యాయస్థానంలో వాదించారు.
Similar News
News March 26, 2025
IPL: రషీద్ ఖాన్ ఖాతాలో మరో మైలురాయి

IPLలో అతి తక్కువ మ్యాచుల్లో 150 వికెట్ల మైలురాయిని చేరుకున్న బౌలర్ల జాబితాలో GT స్పిన్నర్ రషీద్ ఖాన్ మూడో స్థానంలో నిలిచారు. 122 మ్యాచుల్లో ఆయన ఈ ఘనతను సాధించారు. తొలి రెండు స్థానాల్లో మలింగా (105), చాహల్ (118) ఉన్నారు. 4, 5, 6 స్థానాల్లో బుమ్రా (124), బ్రావో (137), భువనేశ్వర్ కొనసాగుతున్నారు. ఇక అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల లిస్టులో చాహల్ (205) టాప్‌లో ఉండగా, రషీద్ 11వ స్థానానికి చేరారు.
News March 26, 2025
TG: ‘రాజీవ్ యువ వికాసం’ పథకం మార్గదర్శకాలు ఇవే

☛ 5 ఏళ్లలో ఒక్కో కుటుంబం ఒక్కసారి మాత్రమే లబ్ధి పొందాలి
☛ కుటుంబాల వార్షిక ఆదాయం పట్టణాల్లో రూ.2లక్షలు, పల్లెల్లో రూ.1.50లక్షలలోపు ఉండాలి
☛ రేషన్ కార్డు లేకపోతే ఇన్‌కం సర్టిఫికెట్ సమర్పించాలి
☛ మహిళలకు (ఒంటరి, వితంతు) 25%, దివ్యాంగులకు 5% రిజర్వేషన్
☛ అమరవీరుల కుటుంబాలు, స్కిల్స్ ఉన్న వారికి ప్రాధాన్యత
☛ <
News March 26, 2025
TG: ‘రాజీవ్ యువ వికాసం’.. కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే

☞ రేషన్ కార్డు తప్పనిసరి. ఒకవేళ లేకపోతే ఇన్‌కం సర్టిఫికెట్ సమర్పించాలి
☞ ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో
☞ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్‌కు అప్లై చేస్తే డ్రైవింగ్ లైసెన్స్, అగ్రికల్చర్ యూనిట్‌కి అప్లై చేస్తే పట్టాదారు పాస్ బుక్, దివ్యాంగ అభ్యర్థులైతే సదరం సర్టిఫికెట్ జతచేయాలి
☞ ఆన్‌లైన్ అప్లికేషన్ పూర్తయ్యాక దానిని డౌన్‌లోడ్ చేసి MPDO లేదా మున్సిపల్/జోనల్ కమిషనర్‌కు సమర్పించాలి