India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

లెజెండరీ సింగర్ KJ యేసుదాస్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరినట్లు వస్తున్న వార్తలను ఆయన కుమారుడు విజయ్ ఖండించారు. ప్రస్తుతం ఆయన USలో ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. తప్పుడు వార్తల వల్ల కోట్లాది మంది అభిమానుల్లో ఆందోళన నెలకొంటుందని, అలాంటి ప్రచారం చేయొద్దని కోరారు. యేసుదాస్ అన్ని భాషల్లో దాదాపు 50K పాటలు పాడారు. 8 నేషనల్ అవార్డులు పొందారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలను అందుకున్నారు.

మనం డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు డాక్టర్లు నాలుకని చూపించమంటారు. ఎందుకంటే అది మన ఆరోగ్యపరిస్థితిని సూచిస్తుంది. శరీరం డీహైడ్రేట్‌గా ఉంటే నాలుక పొడిగా మారుతుంది. అనీమియా సమస్య ఉంటే రక్తహీనతను సూచిస్తుంది. ఇన్ఫెక్షన్లు ఉంటే నాలుకపై తెల్లని పొరలు ఏర్పడతాయి. థైరాయిడ్ సమస్య ఉంటే నాలుక పెద్దదిగా మారుతుంది. కిడ్నీ, లివర్ సమస్యలుంటే రంగుమారుతూ ఉంటుందని పరిశోధనల ద్వారా తేలింది.

AP: పోసాని కృష్ణమురళి సహా తప్పు చేసినవారెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అధికారం ఉందని అడ్డగోలుగా వ్యవహరిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ‘వైసీపీ హయాంలో పోసాని పేట్రేగిపోయారు. చంద్రబాబు, లోకేశ్, పవన్‌లను అసభ్యంగా దూషించారు. నంది అవార్డులపై కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విచ్చలవిడిగా ప్రవర్తించినవారికి ఇదే గతి పడుతుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తోన్న ‘ది పారడైజ్’ నుంచి మార్చి 3న గ్లింప్స్ వీడియో విడుదల కానుంది. దీనిని మొత్తం 8 భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సినీవర్గాలు పేర్కొన్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీతో పాటు ఇంగ్లిష్ & స్పానిష్‌లో గ్లింప్స్ రిలీజ్ అవుతుందని సమాచారం. ఇందులో నాని బోల్డ్‌గా, వైల్డ్‌గా కనిపించనున్నారు.

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబసభ్యుల గురించి సినీనటుడు పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు సహించలేకే ఆయనపై ఫిర్యాదు చేశానని జనసేన నేత జోగిమణి తెలిపారు. వైసీపీ హయాంలోనే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు. ‘పవన్‌పై పోసాని వ్యాఖ్యలతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా. ఇష్టానుసారం మాట్లాడవద్దని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించాం. అయినా పోసాని ప్రవర్తన మారలేదు’ అని ఆయన పేర్కొన్నారు.

బిహార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీచర్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. ప.బెంగాల్ డార్జిలింగ్‌కు చెందిన దీపాలి బిహార్‌లోని కేంద్రీయ విద్యాలయంలో పని చేస్తున్నారు. ‘దేశంలో ఎక్కడైనా పని చేయవచ్చు కానీ బిహార్‌లో కష్టం. ఇక్కడి ప్రజలకు సివిక్ సెన్స్ ఉండదు. ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉండేందుకు బిహారే కారణం. బిహార్‌ను తీసేస్తే ఇండియా అభివృద్ధి చెందిన దేశం అవుతుంది’ అని వ్యాఖ్యానించారు.

TG: మెట్రో విస్తరణ తాను అడ్డుకున్నట్లు నిరూపించే దమ్ముందా అని సీఎం రేవంత్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. ప్రాజెక్ట్ విస్తరణకు రాష్ట్రం వద్ద నయాపైసా లేక తనను దోషిగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల హామీలు కేంద్రాన్ని అడిగి ఇచ్చారా అని ప్రశ్నించారు. రేవంత్ సీఎం కావటం తెలంగాణ ప్రజల దురదృష్టమన్నారు. గాలిమాటలకు, బ్లాక్‌మెయిలింగ్‌కు తాను భయపడనని స్పష్టం చేశారు.

AP: పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె PSకు తీసుకొచ్చిన పోలీసులు.. అక్కడే వైద్యుడితో మెడికల్ టెస్టులు చేయించారు. అతడికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని డాక్టర్ గురుమహేశ్ వెల్లడించారు. అనుచిత వ్యాఖ్యల కేసులో పోసానిని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విచారిస్తున్నారు. మరోవైపు వైసీపీ నాయకులు పెద్దఎత్తున అనుచరులతో PSకు రాగా పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో వారు వెనక్కి వెళ్లిపోయారు.

CT: మార్చి 2న NZతో మ్యాచులో IND కెప్టెన్ రోహిత్ శర్మకు రెస్ట్ ఇవ్వొచ్చని క్రీడా వర్గాలు తెలిపాయి. అతని స్థానంలో వైస్ కెప్టెన్ గిల్ కెప్టెన్సీ చేస్తారని పేర్కొన్నాయి. PAKతో మ్యాచులో రోహిత్ తొడ కండరాల గాయంతో ఇబ్బందిపడ్డారు. తాజాగా ప్రాక్టీస్ సెషన్‌లోనూ ఆయన యాక్టివ్‌గా పాల్గొనలేదు. దీంతో NZతో మ్యాచుకు హిట్‌మ్యాన్‌కు రెస్ట్ ఇచ్చి రాహుల్‌ను ఓపెనర్‌గా, పంత్‌ను WKగా ఆడిస్తారని వార్తలొస్తున్నాయి.

TG: హైదరాబాద్ నెహ్రూ జూపార్కులో వివిధ టికెట్ ధరలను భారీగా పెంచారు. ఇప్పటివరకు ఎంట్రన్స్ టికెట్ పెద్దలకు రూ.75, పిల్లలకు రూ.45 ఉండగా.. ఇక నుంచి రూ.100, రూ.50 వసూలు చేస్తామని అధికారులు ప్రకటించారు. ట్రైన్ రైడ్ టికెట్ పెద్దలకు రూ.80, పిల్లలకు రూ.40గా నిర్ణయించారు. బ్యాటరీ వెహికల్ రైడ్ ధర రూ.120 అని తెలిపారు. అలాగే పార్కింగ్ ధరలు సైతం పెంచారు. మార్చి 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయన్నారు.
Sorry, no posts matched your criteria.