News September 29, 2024

పేరుకే రిచెస్ట్.. కానీ పిచ్ కూడా ఆరబెట్టలేరు!

image

వరల్డ్ రిచెస్ట్ క్రికెట్ బోర్డు బీసీసీఐ పరిస్థితి పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది. భారత్-బంగ్లా రెండో టెస్టులో వర్షం పడకపోయినా నిన్న, ఇవాళ ఒక్క బంతి పడకుండానే ఆట రద్దయింది. చాలా మైదానాల్లో వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ వ్యవస్థల్లేవు. పిచ్ ఆరబెట్టేందుకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా.. ఆఖరుకు పాకిస్థాన్ సైతం హెలికాప్టర్లు వాడుతుంటే మనోళ్లు ఐరన్ బాక్సులు, హెయిర్ డ్రైయర్లు వాడుతున్నారు.

Similar News

News October 11, 2024

నీటి పారుదల శాఖకు రూ.284 కోట్లు విడుదల

image

AP: జలవనరుల ప్రాజెక్టుల్లో అత్యవసరంగా చేపట్టాల్సిన పనుల కోసం నీటిపారుదల శాఖకు రూ.284.04 కోట్లు విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నుంచి ఈ నిధులు విడుదల చేసింది. దీంతో కాలువలు, ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు వంటివి చేయనున్నారు. అంతకుముందు రూ.310 కోట్లతో ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ అంచనా వ్యయాన్ని పంపింది.

News October 11, 2024

GOOD NEWS.. వారికి బోనస్

image

కేంద్ర ప్రభుత్వంలోని గ్రూప్-C ఉద్యోగులు, గ్రూప్-బి నాన్‌గెజిటెడ్ ఉద్యోగులకు నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్‌ను ప్రభుత్వం ప్రకటించింది. 2024 మార్చి 31లోపు ఉద్యోగంలో చేరిన, 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 6 నెలలు విధులు నిర్వహించిన వారు బోనస్‌కు అర్హులు. పనిచేసిన రోజులను బట్టి చెల్లింపులు ఉంటాయి. అర్హులైన ఉద్యోగులకు యావరేజ్‌గా రూ.6908 బోనస్ అందుతుంది. కేంద్ర పారామిలిటరీ, ఆర్మీ ఉద్యోగులూ అర్హులే.

News October 11, 2024

9 రోజుల్లో రూ.713 కోట్ల మద్యం తాగేశారు

image

TG: దసరా పండుగకు ముందు వరుస సెలవుల నేపథ్యంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. గత 9 రోజుల్లో రూ.713.25 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. రేపు దసరా కావడంతో ఈ మూడు రోజుల్లో సేల్స్ ఎక్కువగా జరుగుతాయని అంచనా వేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే రూ.350 కోట్ల అమ్మకాలు అదనంగా ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఈ సారి బీర్ల కంటే లిక్కర్ అమ్మకాలే ఎక్కువ జరుగుతున్నట్లు పేర్కొన్నారు.