India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబసభ్యుల గురించి సినీనటుడు పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు సహించలేకే ఆయనపై ఫిర్యాదు చేశానని జనసేన నేత జోగిమణి తెలిపారు. వైసీపీ హయాంలోనే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు. ‘పవన్‌పై పోసాని వ్యాఖ్యలతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా. ఇష్టానుసారం మాట్లాడవద్దని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించాం. అయినా పోసాని ప్రవర్తన మారలేదు’ అని ఆయన పేర్కొన్నారు.

బిహార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీచర్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. ప.బెంగాల్ డార్జిలింగ్‌కు చెందిన దీపాలి బిహార్‌లోని కేంద్రీయ విద్యాలయంలో పని చేస్తున్నారు. ‘దేశంలో ఎక్కడైనా పని చేయవచ్చు కానీ బిహార్‌లో కష్టం. ఇక్కడి ప్రజలకు సివిక్ సెన్స్ ఉండదు. ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉండేందుకు బిహారే కారణం. బిహార్‌ను తీసేస్తే ఇండియా అభివృద్ధి చెందిన దేశం అవుతుంది’ అని వ్యాఖ్యానించారు.

TG: మెట్రో విస్తరణ తాను అడ్డుకున్నట్లు నిరూపించే దమ్ముందా అని సీఎం రేవంత్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. ప్రాజెక్ట్ విస్తరణకు రాష్ట్రం వద్ద నయాపైసా లేక తనను దోషిగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల హామీలు కేంద్రాన్ని అడిగి ఇచ్చారా అని ప్రశ్నించారు. రేవంత్ సీఎం కావటం తెలంగాణ ప్రజల దురదృష్టమన్నారు. గాలిమాటలకు, బ్లాక్‌మెయిలింగ్‌కు తాను భయపడనని స్పష్టం చేశారు.

AP: పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె PSకు తీసుకొచ్చిన పోలీసులు.. అక్కడే వైద్యుడితో మెడికల్ టెస్టులు చేయించారు. అతడికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని డాక్టర్ గురుమహేశ్ వెల్లడించారు. అనుచిత వ్యాఖ్యల కేసులో పోసానిని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విచారిస్తున్నారు. మరోవైపు వైసీపీ నాయకులు పెద్దఎత్తున అనుచరులతో PSకు రాగా పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో వారు వెనక్కి వెళ్లిపోయారు.

CT: మార్చి 2న NZతో మ్యాచులో IND కెప్టెన్ రోహిత్ శర్మకు రెస్ట్ ఇవ్వొచ్చని క్రీడా వర్గాలు తెలిపాయి. అతని స్థానంలో వైస్ కెప్టెన్ గిల్ కెప్టెన్సీ చేస్తారని పేర్కొన్నాయి. PAKతో మ్యాచులో రోహిత్ తొడ కండరాల గాయంతో ఇబ్బందిపడ్డారు. తాజాగా ప్రాక్టీస్ సెషన్‌లోనూ ఆయన యాక్టివ్‌గా పాల్గొనలేదు. దీంతో NZతో మ్యాచుకు హిట్‌మ్యాన్‌కు రెస్ట్ ఇచ్చి రాహుల్‌ను ఓపెనర్‌గా, పంత్‌ను WKగా ఆడిస్తారని వార్తలొస్తున్నాయి.

TG: హైదరాబాద్ నెహ్రూ జూపార్కులో వివిధ టికెట్ ధరలను భారీగా పెంచారు. ఇప్పటివరకు ఎంట్రన్స్ టికెట్ పెద్దలకు రూ.75, పిల్లలకు రూ.45 ఉండగా.. ఇక నుంచి రూ.100, రూ.50 వసూలు చేస్తామని అధికారులు ప్రకటించారు. ట్రైన్ రైడ్ టికెట్ పెద్దలకు రూ.80, పిల్లలకు రూ.40గా నిర్ణయించారు. బ్యాటరీ వెహికల్ రైడ్ ధర రూ.120 అని తెలిపారు. అలాగే పార్కింగ్ ధరలు సైతం పెంచారు. మార్చి 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయన్నారు.

JPC రిపోర్టు ఆధారంగా సవరించిన వక్ఫ్ బిల్లును కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. మార్చి 10 నుంచి మొదలయ్యే బడ్జెట్ రెండో దఫా సమావేశాల్లో లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. సాధారణ ఓటింగుతో ఉభయ సభల్లో ఆమోదం పొంది, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజముద్ర వేస్తే కొత్త చట్టం అమల్లోకి వస్తుంది. వక్ఫ్ బిల్లును కాంగ్రెస్ సహా ఇండియా కూటమి నేతలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.

HYDలో ఓ చిట్టీల వ్యాపారి సుమారు 2వేల మందికి డబ్బులు చెల్లించకుండా ఫ్యామిలీతో పరారయ్యాడు. అనంతపురం జిల్లాకి చెందిన పుల్లయ్య 18yrs క్రితం HYD వచ్చాడు. కూలీ పనులు చేసే అతను చిట్టీల వ్యాపారంతో కోటీశ్వరుడయ్యాడు. బీకేగూడ రవీంద్రానగర్‌లో ఉంటూ స్థానికులతో చిట్టీలు వేయించాడు. డబ్బులు తిరిగి చెల్లించాలని అడగడంతో ఈనెల 21న పరారయ్యాడు. బాధితులంతా అతని ఇంటికి చేరుకొని ఆవేదన వ్యక్తం చేయడంతో విషయం వెలుగుచూసింది.

TG: సినీ నిర్మాత కేదార్ మరణం గురించి సీఎం రేవంత్ చేసిన <<15587966>>వ్యాఖ్యలపై<<>> బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ‘హత్యలు, మరణాలు అంటూ అనవసర ఆరోపణలు చేస్తున్నారు. అధికారంలో ఉండి ప్రతిపక్షంలా మాట్లాడుతున్నారు. తాను ఏం చెప్పినా జనాలు నమ్ముతారని అనుకోవడం పొరపాటే. ప్రభుత్వం ఆయన చేతిలోనే ఉంది. ఎలాంటి విచారణకైనా సిద్ధం’ అని స్పష్టం చేశారు.

ఉత్తరాదిన 25 భాషలను హిందీ మింగేసిందని TN CM స్టాలిన్ ఆరోపించారు. ‘హిందీ ఒత్తిడి ప్రాచీన మాతృభాషలను చంపేసింది. UP, బిహార్ హిందీ హార్ట్ ల్యాండ్స్ కావు. వాటి అసలైన భాషలు ఇప్పుడు గతించిపోయాయి. భోజ్‌పురి, మైథిలీ, అవధి, బ్రాజ్, బుందేలి, గర్హ్‌వలి, కుమోని, మాగహి, మార్వాడి, మాల్వి, ఛత్తీస్‌గడి, సంతాలి, ఆంగిక, హో, ఖరియా, ఖోర్తా, కుర్మాలి, కురుఖ్, ముండారి వంటి భాషలు ఉనికి కోసం పోరాడుతున్నాయ’ని అన్నారు.
Sorry, no posts matched your criteria.