News September 29, 2024
దసరా నుంచి ఇంటింటికి కార్గో సేవలు!
TG: దసరా నుంచి ఇంటింటికి కార్గో సేవలు అందించాలని RTC నిర్ణయించింది. వినియోగదారులు ఆన్‌లైన్‌లో బుక్ చేయగానే సిబ్బంది నేరుగా ఇంటికి వచ్చి వస్తువులను తీసుకెళ్లి ఇచ్చిన అడ్రస్‌లో డెలివరీ చేస్తారు. ఆర్డర్ పరిమాణాన్ని బట్టి 2/3/4 వీలర్ ఉపయోగిస్తారు. తొలుత దీనిని HYDలో, ఆ తర్వాత ఇతర జిల్లాల్లో అమలు చేయనున్నారు. ప్రస్తుతం కార్గో సేవలు ఒక బస్ స్టేషన్ నుంచి మరో బస్ స్టేషన్ వరకు మాత్రమే కొనసాగుతున్నాయి.
Similar News
News October 9, 2024
దసరా: స్పెషల్ బస్సుల్లో టికెట్ ఛార్జీల పెంపు!
TG: దసరా పండుగకు నడుపుతున్న TGSRTC స్పెషల్ బస్సుల్లో టికెట్ ఛార్జీలు పెంచారని ప్రయాణికులు వాపోతున్నారు. సాధారణ ఛార్జీల కంటే 25% వరకు అదనంగా వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇదివరకు ఉప్పల్ నుంచి తొర్రూరుకు సూపర్ లగ్జరీలో టికెట్ రూ.310గా ఉంటే ఇప్పుడు రూ.360 తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఛార్జీల పెంపుపై ఆర్టీసీ అధికారిక ప్రకటన చేయలేదు.
News October 9, 2024
పాకిస్థాన్‌కు కొరకరాని కొయ్యగా హ్యారీ బ్రూక్
పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ (109*) సెంచరీ చేశారు. 9 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో శతకం బాదారు. పాక్‌పై ఆడిన నాలుగు టెస్టుల్లోనూ బ్రూక్ 4 సెంచరీలు చేశారు. ఈ క్రమంలో ఆయన అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. పాక్ గడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన మూడో బ్యాటర్‌గా మరో ఇద్దరితో కలిసి రికార్డు నెలకొల్పారు. గతంలో అమర్‌నాథ్, అరవింద డిసిల్వా నాలుగేసి సెంచరీలు బాదారు.
News October 9, 2024
కాంగ్రెస్ ‘రిజెక్ట్’ స్టేట్‌మెంట్లపై ECI సీరియస్: ఖర్గేకు ఘాటు లేఖ
EVMలపై నిందలేస్తూ, హరియాణా ఫలితాలను అంగీకరించడం లేదన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై ECI ఘాటుగా స్పందించింది. ఘనమైన ప్రజాస్వామ్య వారసత్వం కలిగిన ఈ దేశంలో ఇలాంటి జనరలైజ్ స్టేట్‌మెంట్లను ఎప్పుడూ చూడలేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు లేఖరాసింది. ఇది ప్రజాతీర్పును అప్రజాస్వామికంగా తిరస్కరించడమేనని స్పష్టం చేసింది. INC 12 మంది సభ్యుల బృందాన్ని 6PMకు కలిసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది.