India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళే ఇంటి యజమానిగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులను జారీ చేస్తామని తెలిపారు. అక్టోబర్ 3 నుంచి పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఒకే కార్డులో రేషన్, హెల్త్, ఇతర పథకాల వివరాలన్నీ ఉంటాయని, అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా అర్హులను గుర్తిస్తామని చెప్పారు.
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు డ్రాగా ముగిస్తే భారత్ WTC ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం కానున్నాయి. డ్రాగా ముగిస్తే టీమ్ ఇండియా పట్టికలో కొన్ని పాయింట్లు కోల్పోతుంది. మిగిలిన 8 టెస్టుల్లో ఐదింట్లో గెలవాల్సి ఉంటుంది. త్వరలో ఆసీస్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. ఒకవేళ అక్కడ సిరీస్ కోల్పోతే మూడో స్థానానికి దిగజారే ప్రమాదం ఉంది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు చేజారిపోతాయి.
AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిరసనలు కొనసాగుతున్న వేళ కార్మికులకు భారీ షాక్ తగిలింది. ఏకంగా 4వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించినట్లు సమాచారం. వారి గేట్‌పాస్‌లను వెనక్కి తీసుకోవాలని వివిధ విభాగాల్లోని కాంట్రాక్టర్లకు, సూపర్ వైజర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న కార్మికులు ఆందోళనకు దిగారు. తొలగింపు ప్రక్రియను నిలిపేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై బెంగళూరు సిటీ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎలక్టోరల్ బాండ్ల పేరుతో వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారన్న ఆరోపణలపై దాఖలైన కేసులో ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు <<14214492>>ఆదేశానుసారం<<>> పోలీసులు చర్యలు ప్రారంభించారు. ED అధికారులు, కర్ణాటక BJP ప్రస్తుత, మాజీ అధ్యక్షులు విజయేంద్ర, నలీన్ కుమార్ తదితరులపై కూడా కేసు నమోదు చేశారు.
భూగోళం మినీ మూన్‌ని అనుభూతి చెందనుంది. ఆస్టరాయిడ్ 2024 PT5 Sep 29 నుంచి Nov 25 వరకు మానవాళికి దర్శనమివ్వనుంది. అనంతరం భూ గురుత్వాకర్షణ శక్తి వల్ల కక్ష్య నుంచి వీడిపోతుంది. ఇది నేరుగా కంటికి కనిపించకపోయినా టెలిస్కోప్‌తో చూడవచ్చు. అర్జున ఆస్టరాయిడ్ బెల్ట్ నుంచి వచ్చిన ఈ గ్రహశకలం 33 అడుగులు ఉంటుంది. వీటి రాక సహజమేనని, ఇలాంటివి అనేకం భూకక్ష్యలోకి వచ్చిపోతుంటాయన్నది నిపుణుల అభిప్రాయం.
భారతదేశ U17 ఫుట్‌బాల్ జట్టు ‘SAFF U17 ఛాంపియన్‌షిప్స్ 2024’ ఫైనల్స్‌కు చేరుకుంది. సెమీ ఫైనల్స్‌లో నేపాల్‌ను 4-2 తేడాతో ఓడించి సత్తా చాటింది. జట్టు తరఫున విశాల్ యాదవ్ రెండు గోల్స్ చేయగా, రిషి సింగ్ & హేమ్నీచుంగ్ లుంకిమ్ ఒక్కో గోల్ సాధించారు. ఈరోజు జరిగే రెండో సెమీస్‌లో బంగ్లాదేశ్‌తో పాకిస్థాన్ తలపడనుంది. ఇందులో గెలిచిన జట్టుతో సోమవారం జరిగే ఫైనల్స్‌లో ఇండియా తలపడనుంది.
TG: ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకే హైడ్రా ఏర్పాటు చేశామని ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. చెరువులు, నాలాలు రక్షించడమే దాని లక్ష్యమని, పేదలను ఇబ్బంది పెట్టడం కాదన్నారు. ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ చెరువులు, నాలాలను కాపాడుకోలేం. కోటి మంది బాధితులుగా మిగులుతారు. విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకే ఒవైసీ, మల్లారెడ్డి కాలేజీలు కూల్చలేదు. జన్వాడ ఫామ్‌హౌజ్ హైడ్రా పరిధిలో లేదు’ అని పేర్కొన్నారు.
హరియాణా ఎన్నికల కోసం కాంగ్రెస్ పూర్తిస్థాయి మ్యానిఫెస్టో ప్రకటించింది. మద్దతు ధరకు చట్టబద్ధత సహా రూ.25 లక్షల వరకు ఉచితంగా చికిత్స అందిస్తామంది. పింఛన్ రూ.6 వేలకు పెంపు *18-60 ఏళ్ల మహిళలకు నెలకు రూ.2 వేలు *2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు *రైతు కమిషన్ ఏర్పాటు *ఓబీసీలకు రూ.10 లక్షలకు క్రిమీలేయర్ పెంపు *అమరవీరుల కుటుంబాలకు రూ.2 Cr *రూ.500కే గ్యాస్ సిలిండర్ హామీలిచ్చింది.
TG: హైడ్రాపై కొంతమందికి మాత్రమే వ్యతిరేకత ఉందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. హైడ్రా బూచి కాదని భరోసా ఇచ్చే సంస్థ అని ఆయన చెప్పారు. ‘మేం కూల్చిన ఏ భవనానికీ అనుమతులు లేవు. పలుకుబడి ఉన్న కొందరు కబ్జా చేసి తప్పుడు సర్వే నంబర్లతో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. హైడ్రా చర్యలు తీసుకోకపోతే నగర ప్రజలే బాధితులవుతారు. హైడ్రా కారణంగా ఎవరూ ఆత్మహత్యలు చేసుకోలేదు’ అని ఆయన పేర్కొన్నారు.
RBI లెక్కల ప్రకారం 1976 మార్చి 31 నాటికి దేశంలో చలామణీలో ఉన్న నగదు మొత్తం రూ.7,144 కోట్లు. ఇందులో రూ.87.91 కోట్ల విలువైన రూ.1,000 నోట్లు, రూ.22.90 కోట్ల విలువైన రూ.5వేల నోట్లు ఉండేవి. రూ.10వేల నోట్లను 1,260 మాత్రమే ముద్రించారు. వీటి విలువ రూ.1.26 కోట్లు. దేశం మొత్తం కరెన్సీలో రూ.5,000, రూ.10,000 నోట్ల వాటా కేవలం 2 శాతం లోపే. ప్రస్తుతం దేశంలో చలామణీలో ఉన్న నగదు రూ.34.90 లక్షల కోట్లు.
Sorry, no posts matched your criteria.