News September 28, 2024
నోట్ల చలామణీ 1976, 2024లో ఎలా ఉందంటే?
RBI లెక్కల ప్రకారం 1976 మార్చి 31 నాటికి దేశంలో చలామణీలో ఉన్న నగదు మొత్తం రూ.7,144 కోట్లు. ఇందులో రూ.87.91 కోట్ల విలువైన రూ.1,000 నోట్లు, రూ.22.90 కోట్ల విలువైన రూ.5వేల నోట్లు ఉండేవి. రూ.10వేల నోట్లను 1,260 మాత్రమే ముద్రించారు. వీటి విలువ రూ.1.26 కోట్లు. దేశం మొత్తం కరెన్సీలో రూ.5,000, రూ.10,000 నోట్ల వాటా కేవలం 2 శాతం లోపే. ప్రస్తుతం దేశంలో చలామణీలో ఉన్న నగదు రూ.34.90 లక్షల కోట్లు.
Similar News
News October 9, 2024
స్థానిక సంస్థలకు రూ.287 కోట్లు విడుదల
AP: గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.287.12 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వ పాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు నిధులను కేటాయిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ జీవో ఇచ్చారు. ఇటు PM జన్‌మన్ పథకం కింద 332 గిరిజన గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాల ఏర్పాటుకు రూ.29.93 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
News October 9, 2024
ఈ జిల్లాల్లో వర్షాలు
TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఆదిలాబాద్, కొమురంభీమ్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి నారాయణపేట, గద్వాల, కొత్తగూడెం, ఖమ్మం, జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది.
News October 9, 2024
వారు రుణమాఫీకి దరఖాస్తు చేసుకోవచ్చు: కోదండరెడ్డి
TG: అర్హులైన రైతులు రుణమాఫీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. సాంకేతిక కారణాలతో కొంతమందికి రుణమాఫీ కాలేదని వ్యవసాయ శాఖ గుర్తించిందన్నారు. ఇప్పటికే ఆరు లక్షల దరఖాస్తులు పరిష్కరించామన్నారు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ, బీఆర్ఎస్ రుణమాఫీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. అర్హులందరికీ రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.