news

News September 26, 2024

Jr.NTR ‘దేవర’ సంచలనం

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ‘దేవర’ సినిమా రిలీజ్‌కు ముందే కలెక్షన్లలో సంచలనం సృష్టిస్తోంది. రేపు మూవీ రిలీజ్ కానుండగా నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్‌ $2.5 మిలియన్ల మార్క్‌ను దాటేశాయి. ఓవర్సీస్‌లో తారక్ సునామీ సృష్టిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. వరల్డ్ వైడ్‌గా ప్రీసేల్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.75+ కోట్ల కలెక్షన్స్ దాటేసినట్లు అంచనా వేస్తున్నాయి.

News September 26, 2024

ఆ విద్యార్థులకు గుడ్‌న్యూస్

image

AP: వసతి గృహాలు, గురుకులాల్లో చదువుకునే దివ్యాంగ విద్యార్థులు ప్రతి నెలా పింఛను కోసం ఇళ్లకు వెళ్లడం దూరాభారమై ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వారి బ్యాంకు ఖాతాల్లోనే పింఛను నగదు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నవంబరు 1 నుంచి వీరికి అకౌంట్లలోనే డబ్బులు వేయనున్నారు. మొత్తంగా APలో 8.50 లక్షల మంది ఈ కోటాలో పింఛను పొందుతున్నారు. ఇందులో 10 వేల మంది విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు.

News September 26, 2024

UN సెక్యూరిటీ కౌన్సిల్లో రిఫార్మ్స్ చేయాల్సిందే: G4 నేషన్స్

image

UN సెక్యూరిటీ కౌన్సిల్లో సంస్కరణలు అవసరమని G4 ఫారిన్ మినిస్టర్స్ స్పష్టం‌చేశారు. జియో పాలిటిక్స్, ప్రజెంట్, ఫ్యూచర్‌ను ప్రతిబింబించేలా మార్పులు ఉండాలన్నారు. కౌన్సిల్‌ను విస్తరించాలని, డెవలపింగ్ కంట్రీస్‌కు ప్రాధాన్యం దక్కాల్సిందేనని నొక్కిచెప్పారు. ఆఫ్రికా, ఏషియా పసిఫిక్, లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంతాలకు శాశ్వత, తాత్కాలిక సభ్యత్వాలు ఉండాలన్నారు. G4 అంటే భారత్, బ్రెజిల్, జపాన్, జర్మనీ కూటమి.

News September 26, 2024

APPLY: ఎస్బీఐలో 1497 ఉద్యోగాలు

image

SBIలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. పలు విభాగాల్లో 1497 డిప్యూటీ మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బీటెక్, BE, ఎంటెక్, Msc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగిన వారు అర్హులు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అర్హత గల అభ్యర్థులు OCT 4వ తేదీలోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఇతర వివరాల కోసం వెబ్‌సైట్: https://sbi.co.inను సంప్రదించాలి.

News September 26, 2024

ఓటీటీలోకి వచ్చేసిన ‘సరిపోదా శనివారం’

image

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘సరిపోదా శనివారం’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు డిజిటల్ వేదికపై అలరించేందుకు సిద్ధమైంది. ఈ మూవీలో ఎస్.జే.సూర్య విలన్‌గా నటించగా ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా సందడి చేశారు.

News September 26, 2024

IPL: ధోనీకి లైన్ క్లియర్ అయినట్లేనా?

image

ఐపీఎల్ మెగా వేలానికి ముందు బీసీసీఐ ఐదుగురికి రిటెన్షన్ అవకాశం కల్పించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే సీఎస్కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వచ్చే సీజన్‌ కూడా ఆడనున్నారు. ఇప్పటివరకు ఆ జట్టు రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, మతీశ పతిరణ, శివం దూబేలను అట్టిపెట్టుకోవాలని భావించింది. ఇప్పుడు ఐదుగురికి అనుమతి లభిస్తుండడంతో ధోనీని కూడా కచ్చితంగా రిటైన్ చేసుకోవచ్చని సమాచారం.

News September 26, 2024

రెండు చీరలు ఇస్తానన్న సీఎం ఏమైపోయావ్?: KTR

image

TG: ‘ఆడబిడ్డలకు 2 బతుకమ్మ చీరలు ఇస్తానన్న సీఎం ఏమైపోయావ్?’ అని KTR ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీని నిలిపివేసిందనే ఓ పత్రికా కథనంపై స్పందించారు. ‘అత్తమీద కోపం దుత్త మీద తీర్చినట్లు ఉంది మీ వ్యవహారం. మా మీద కోపం ఆడబిడ్డల మీద చూపిస్తున్నారు. వారికి ఇంకా గొప్పగా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. ఇచ్చేది కూడా ఆపేస్తే ఎలా?’ అని Xలో పేర్కొన్నారు.

News September 26, 2024

వంగవీటి రాధాకు స్టెంట్ వేసిన డాక్టర్లు

image

AP: టీడీపీ నేత వంగవీటి రాధా ఇవాళ ఉదయం స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేశారు. ప్రస్తుతం రాధా ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందని తెలిపారు.

News September 26, 2024

PHOTO: జగన్ ఫ్లెక్సీలో అల్లు అర్జున్

image

AP: వైసీపీ చీఫ్ జగన్ పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. విజయనగరం జిల్లా డెంకాడ మండలం పినతాడివాడలో శ్రీ బంగారమ్మ తల్లి జాతర సందర్భంగా ఈ ఫ్లెక్సీ‌లు వెలిశాయి. ‘ తగ్గేదేలే’, ‘YCP-AA MUTUAL’ అనే ట్యాగ్‌లైన్లతో వీటిని ఏర్పాటు చేశారు. ఈ ఫొటోలను వైసీపీ శ్రేణులు షేర్ చేస్తున్నాయి.

News September 26, 2024

భార్య బికినీ వేసుకునేందుకు ఐలాండ్‌నే కొన్నాడు

image

దుబాయ్‌కు చెందిన ఓ బిలియనీర్ తన భార్య కోసం ఏకంగా ఐలాండ్‌నే కొనేసినట్లు తెలుస్తోంది. జమాల్ అల్ నడాక్ తన భార్య సౌదీ కోసం 50 మిలియన్ డాలర్లు వెచ్చించి ఓ ప్రైవేట్ ఐలాండ్‌ను కొన్నట్లు సమాచారం. తన భార్య సౌకర్యవంతంగా బికినీ వేసుకునేందుకే దీనిని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల రీత్యా ఈ ఐలాండ్ ఎక్కడనేది బహిర్గతం కాలేదు. మరోవైపు ఇది ఆసియాలోనే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

error: Content is protected !!