News September 26, 2024
PHOTO: జగన్ ఫ్లెక్సీలో అల్లు అర్జున్
AP: వైసీపీ చీఫ్ జగన్ పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. విజయనగరం జిల్లా డెంకాడ మండలం పినతాడివాడలో శ్రీ బంగారమ్మ తల్లి జాతర సందర్భంగా ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. ‘ తగ్గేదేలే’, ‘YCP-AA MUTUAL’ అనే ట్యాగ్‌లైన్లతో వీటిని ఏర్పాటు చేశారు. ఈ ఫొటోలను వైసీపీ శ్రేణులు షేర్ చేస్తున్నాయి.
Similar News
News October 6, 2024
ఢిల్లీకి బయల్దేరిన సీఎం రేవంత్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. రేపు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరద నష్టం వివరాలను షాకు అందించనున్నట్లు సమాచారం. అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్వహించే హోంమంత్రుల సమావేశంలో రేవంత్ పాల్గొననున్నారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పెద్దలతో సమావేశం అవుతారు. రాష్ట్రంలో క్యాబినెట్ విస్తరణ, తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
News October 6, 2024
కాసేపట్లో వర్షం
తెలంగాణలోని 8 జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వికారాబాద్, వరంగల్, హన్మకొండ, కొత్తగూడెం, భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో మోస్తరు వర్షం కురవనుందని పేర్కొంది. మరోవైపు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వాన పడింది.
News October 6, 2024
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందన
తెలంగాణలో పంట రుణమాఫీ పూర్తిగా కాలేదని ప్రధాని మోదీ నిన్న చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించారు. రూ.2లక్షల లోపు పంట రుణాలన్నీ మాఫీ చేశామన్నారు. 22,22,067 మంది రైతులకు రూ.17,869.22కోట్లు మాఫీ జరిగిందని, అందుకు సంబంధించిన పత్రాలను ట్వీట్ చేశారు. ‘కాంగ్రెస్ గ్యారంటీ అంటే గోల్డెన్ గ్యారంటీ’ అని రైతులు విశ్వసించారని రేవంత్ అన్నారు. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం కేంద్రం నుంచి సహకారం కావాలన్నారు.